ఖలేజా సినిమా ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. అందులో కొత్త విషయమేమీ లేదు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం మాత్రం 'మహేష్' ని దేవుడిగా చూపించడమే. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఈ హఠాత్ పరిణామం మింగుడు పడలేదు. అలా కాకుండా మహేష్ దేవుడి క్యారెక్టరు వేస్తున్నాడని ప్రేక్షకుడు ముందుగా ప్రిపేర్ అయ్యుంటే ఆ సినిమా అంత ఫ్లాప్ అయ్యుండేది కాదేమో. అంటే ఆ సినిమాకి 'ఖలేజా' అని కాకుండా 'దేవుడు' పెట్టుంటే బాగుండేదేమో.
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
Subscribe to:
Post Comments (Atom)
మహేష్ బాబు, దేవుడు.. అని చెప్పలేదు , ( చెప్పడం) త్రివిక్రమ్ ఉద్దేశం కాదు , పాళీ గ్రామంలో ప్రజలకి, వారి కష్టాలను తీర్చడం వలన దేవుడులా కనిపించాడు. అని మాత్రమే చెప్పాడు . మీకు ఈ విషయం అర్ధం కావాలంటే ఈ వీడియో చూడగలరు. https://www.youtube.com/watch?v=qQNmJQfGuAo
ReplyDeletehttps://youtu.be/qQNmJQfGuAo
ReplyDeleteవెంకట రమణ గారూ మీరు చెప్పినట్టు త్రివిక్రం వీడియో చూసాను. ఆయన మాటల్లో సారాంశమేమిటంటే మహేష్ ఈ సినిమాలో దేవుడు కాదు దేవుడి లాంటి మనిషి అని. వాళ్ళ కష్టాలు తీర్చాడు కాబట్టి అంటే ఆ గ్రామస్తుల దృష్టిలో అతను దేవుడితో సమానం అని. దానికి సపోర్టింగ్ గా యింకొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చారు. మరి అటువంటప్పుడు మహేష్ చెప్పినవన్నీ జరిగిపోవడం లాంటి సీన్లు ఎందుకు పెట్టినట్టు? అవేవీ లేకుండా కూడా అతని గొప్పతనాన్ని (హీరోయిజం అనాలా?) చూపించవచ్చు కదా? ఓ ప్రక్కన అతని మహిమలు చూపుతున్నప్పుడు ఆ పాళీ గ్రామ ప్రజలకీ, చూసే ప్రేక్షకుడికీ మాత్రం అతను దేవుడిలానే అర్ధమవుతుంది గానీ యింకోలా అర్ధం కాదు కదా? యింకో విషయమేమిటంటే దేవుడి లాంటి మనిషి గురించి చెపుతూ శ్రీరాముడు గురించీ, శ్రీకృష్ణుడి గురించీ వాళ్ళ గొప్పతనం గురించి త్రివిక్రం కొన్ని విషయాలు చెప్పరు. వాళ్ళని మనమెవ్వరం చూడలేదు. పైగా జనం వాళ్ళని దేవుడి లాంటి మనుషుల్లా చూడడం లేదు. కేవలం "దేవుడు " లా మాత్రమే చూస్తున్నారు. ఓ గాంధీ, ఓ అంబెద్కరూ, ఓ మదర్ తెరేసా, ఓ భగత్ సింగూ........ వీళ్ళు- జనాల దృష్టిలో దేవుళ్ళు. కాదు.....దేవుడి లాంటి మనుష్యులు. వీళ్ళకి ఎలాంటి మహిమలు లేవు. ఉన్నట్టు చదవలేదు. కానీ వాళ్ళెప్పుడూ జనాల దృష్టిలో గ్రేట్.
ReplyDeleteనా భావం మీకు అర్ధమయ్యిందనుకుంటాను వెంకట రమణ గారూ.
వరప్రసాద్ దాసరి
వరప్రసాద్ గారు,
Deleteఈ సినీమా లో , మహేష్ బాబు చెప్పినవన్నీ జరిగిపోవడం వలన, మీకు మహేష్ బాబు దేవుడు గా కనిపించినట్టు అనుకుంటే, అసలు మీకు , దేవుడి లా, కనపడవలసింది , "రావు రమేష్ " .
ఎందుకంటే , మహేష్ బాబు లాంటి వ్యక్తి , పాళీ గ్రామానికి వస్తాడని చెప్పిందే , రావు రమేష్ కదా ....? అసలు అతనికి ఎలా తెలుసు ?
మీకు ఈ సినీమా లో "రావు రమేష్" ఎలా కనిపించాడో నాకు తెలియదు గాని , నాకు మాత్రం "మహేష్ బాబు" , "రావు రమేష్ "ఇద్దరు దేవుడిలా కనిపించలేదు .
మన కళ్ళ ముందు అన్యాయం జరిగితే , మనకు ఆపే శక్తి లేనప్పుడు , ఆ అన్యాయాన్ని ఆపడానికో (లేదా ) ప్రశ్నిం చడానికో (లేదా ) ఆ అన్యాయం ఎక్కువ కాలం సాగదని, మనం ఎలా నమ్ముతామో , (తాడిని తన్నే వాడుంటే..... వాడి తలను తన్నే వాడు మరొకడుంటాడు.) ఆ విధంగానే పాళీ అనే గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని ఆపడానికి యవడో ఒకడు వస్తాడని (మనలానే) "రావు రమేష్" కూడా నమ్మాడు . కాబట్టి రావురమేష్ ఇక్కడ దేవుడు కాదు.
ఇక మహేష్ బాబు విషయానికి వస్తే , ఈ సినీమాలో ఒక దగ్గర , కార్లు ఆపి 10/- అడుగుతాడు, అప్పుడు ఎవ్వరు ఇవ్వరు , కాని నాకేగనక 10 రుపాయులు ఎవరైనా ఇస్తే , ఆ పిల్లవాడికి పాలు కొనిస్తాను , అని మనసులో అనుకుని ఒక కారుని ఆపితే , అతడు వెంటనే 100 రూపాయలు తీసి ఇస్తాడు. ఇక్కడ మీకు మహేష్ బాబు దేవుడిలా కనిపించాడు, కాని, మనం ఎవరికైన మంచి చెయ్యాలి , అనుకుంటే , దేవుడు మనకు కచ్చితంగా అవకాశం కల్పిస్తాడు అని నాకు అర్ధం అయ్యింది. దానికోసం , మనమొ (లేదా ) మహేష్ బాబో, దేవుడైపోవలసిన అవసరం లేదు .
గాలి వలన పువ్వులు రాలాయ్ , పిల్ల వలన నిల్లోచ్చాయ్ , వాడి వలన గోడ పడింది. అని ఒక సన్నివేశం లో , రావు రమేష్ , మహేష్ బాబుతో అంటాడు .
ఇక్కడ మీకు మహేష్ బాబు దేవుడి లా కనపడాలి అంటే ... గాలి లేకుండా పువ్వులు రాలాలి , అప్పటికప్పుడు నీళ్ళు భూమి లోనుండి రావాలి, గోడ , దానంతట అదే పడిపోయుండాలి. కాని అలా జరగలేదు. So,ఇక్కడ మహేష్ బాబు దేవుడు కాదు .
ఇక్కడ మీరు మొత్తం గా 2 విషయాలు గమనించగలరు
1) ఒకరి వలన ఒక పని , పుర్తవ్వాలి అని రాసి పెట్టి ఉంటుంది. అవి వారివలననే , పూర్తవుతాయి.
2) మనం , ఒక మంచి పని చెయ్యాలి అని మనస్పూర్తిగా అనుకుంటే , కచ్చితంగా , బగవంతుడు అవకాసం కల్పిస్తాడు.
మీరు అన్నట్టే , ఓ గాంధీ, ఓ అంబెద్కరూ, ఓ మదర్ తెరేసా, ఓ భగత్ సింగూ, మొదలగు వారి వలన కొన్నిపనులు పుర్తవ్వాలి అని రాసి పెట్టి ఉంది , అందుకే , గాంధీ వలన , స్వాతంత్రయం , అంబెద్కర్ వలన రాజ్యాంగం , మదర్ తెరేసా వలన శాంతి , నెలకొల్పబడ్డాయి . వీరు , ఆ పనులను మనస్పూర్తిగా అనుకుని చేసి ఉంటారు . అందుకే , దేవుడు వాళ్ళ పనులను , విజయవంతం చేసాడు ,
so , ఇక్కడ , గాంధీ, అంబెద్కరూ,మదర్ తెరేసా, భగత్ సింగూ. దేవుళ్ళు. కాదు.....దేవుడి లాంటి మనుష్యులు.
పైన సినీమాలో చెప్పబడింది ఇదే , వారు దేవుళ్ళు కాదు , దేవుడులాంటి మనుషులు .
వెంకట రమణ గారూ మీ విశ్లేషణ చాలా బాగుంది. అయినా నాకు కొన్ని సందేహాలు మాత్రం తీరలేదు. అందులో మచ్చుకి కొన్ని
Delete1. ఒక పాప ఆ విషపు నీళ్ళు త్రాగి చనిపోతుంది కానీ మహేష్ "నేనే గనక నిజంగా దేవుడినైతే ఆ పాప బ్రతుకుతుంది" అనగానే ఆ పాప బ్రతుకుతుంది.
2. డీన్ ని కలవడానికి వెళ్ళినప్పుడు "వాడిని నేను కలవడమెందుకు వాడే యిక్కడికి రావాలి" అంటాడు. చిత్రంగా డీన్ అతని దగ్గరికే వచ్చేస్తాడు.
3. ప్రకాష్ రాజ్ చావు కూడా మహేష్ చెప్పినట్టే జరుగుతుంది.
సరే పైన నేను చెప్పినవన్నీ నిజం కాకపోయినా లేక అదంతా యాధృచ్చికం అనుకున్నా ఆ సినిమా అంతా దేవుడి చుట్టూనే తిరుగుతుంది. కాదంటారా? మహేష్ దేవుడా లేక దేవుడి లాంటి మనిషా లేక మీరు చెప్పినట్టు రావు రమేష్ దేవుడా లేక జ్యోతిష్యుడా యివన్నీ వదిలేస్తే ఆ సినిమా లో సెంటర్ పాయింట్ మాత్రం " దేవుడు" . ఏమంటారు రమణ గారూ - వరప్రసాద్ దాసరి