Tuesday, 20 May 2014

'దిల్' లేని 'దిల్ రాజు'

కొంతమంది సినిమా నటులు, దర్శకులు, పాటల రచయితలు, నిర్మాతల పేర్లు గమనించండి. వారు నటించిన లేదా నిర్మించిన సినిమా పేరుతో కలిపి ఉంటాయి వారి పేర్లు. ఉదాహరణకి  'షావుకారు జానకి ', 'సిరివెన్నెల సీతా రామశాస్త్రి", కళ్ళు చిదంబరం, 'శుభలేఖ సుధాకర్ ', మహర్షి రాఘవ ', 'దిల్ రాజు ', 'అల్లరి నరేష్', 'వెన్నిరాడై నిర్మల ', 'నిళళ్గల్ రవి ', యిలా చెప్పుకుంటూ పోతే చాలా మంది లిస్టు తయారవుతుంది. యిదంతా మీకు తెలిసిన విషయమే. చెప్పుకోవలసిన విషయమేమిటంటే 'దిల్ రాజు ' ని అందరూ పిలిచినట్టు ఆయన అసలు పేరు 'రాజు' కాదు - 'వెంకట రమణా రెడ్డి'. 'రాజు ' అన్నది ఆయన ముద్దు పేరు మాత్రమే. 'దిల్' ఆయన తీసిన మొదటి సినిమా. ఆ సినిమా హిట్ అయ్యాక అందరూ ఆయన్ని 'దిల్ రాజు ' అని పిలవడం మొదలు పెట్టారు. బానే ఉంది. కానీ ఆయన తన సినిమాల్లో తన పేరుని 'రాజు' అని మాత్రమే వేసుకుంటాడు. 'దిల్ ' ని ఎక్కడా తన పేరు ముందు చేర్చడు. అయినా సరే అందరూ ఆయన్ని 'దిల్ రాజు' అనే పిలుస్తారు. 

No comments:

Post a Comment