నేను యింతవరకూ చూసిన ప్రతీ థియేటర్ల బయట బ్లాకులో టికెట్లు అమ్మడం చూశాను చూస్తున్నాను. ప్రతీ థియేటరు బయట యిది సర్వ సాధారణం. కానీ నా చిన్నప్పటినిండీ బ్లాకులో అమ్మని ఒక థియేటరుని చూశాను. ఆ థియేటరులో బ్లాకులో టికెట్లు అమ్మరు. అమ్మడానికి అవకాశమే లేదు. ఎందుకంటే టికెట్ల కోసం అందరూ క్యూలో నించున్నాక వాళ్ళకు ఒక టికెట్ మాత్రమే యిచ్చేవారు. ఆ టికెట్ తీసుకున్నాక సరాసరి లోపలికి - అంటే థియేటరులోకి వెళ్ళిపోవలసిందే. సినిమా మొదలయిన అరగంట వరకూ ఎవరినీ బయటకి వదిలేవారు కాదు. స్కూటర్లూ, బండ్లూ, సైకిల్లూ గట్రా ముందే స్టాండులో పెట్టేసుకోవాలి. ఒక వేళ టికెట్టు దొరకకపోతే మాత్రం వాళ్ళకి బండి తాలూకు డబ్బులు తిరిగిచ్చేసే వాళ్ళు. కానీ నేను చెపుతోన్న విషయము ఓ యిరవై యేళ్ళ క్రితం మాట. అప్పట్లో ఆ థియేటరులో కేవలం ఇంగ్లీషు సినిమాలు మాత్రమే ఆడేవి. యిప్పుడు తెలుగు సినిమాలు కూడా ఆడేస్తున్నాయనుకోండి. యింతకీ ఆ థియేటరు పేరు చెప్పకుండా ఊదరగొట్టేస్తున్నాననుకుంటున్నారు కదూ. వస్తున్నా. ఆ థియేటరు కాకినాడలో ఉంది. పేరు "సత్యగౌరి"
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
Subscribe to:
Post Comments (Atom)
మీరు పంచుకొనే విషయాలు, మీ practical attitude నాకు నచ్చుతాయి.
ReplyDeletethank you very much
Deleteవిజయవాడ లీలామహల్, నవరంగ్ దియేటర్లలో కూడా అంతే...అక్కడ కూడా ఇంగ్లిష్ సినిమాలే వచ్చేవి. అయితే, ఇప్పుడు లీలామహల్ లేదు. నవరగ్ లో తెలుగు సినిమాలు కూడా వస్తున్నాయి.
ReplyDeleteమీ కామెంటుకి ధన్యవాదములు రాధాకృష్ణ గారూ. సత్య గౌరి లాంటి థియేటర్లు యింకా ఉన్నందుకు సంతోషంగా ఉంది
Deleteవిశాఖపట్నంలో లక్ష్మీనరసింహా థియేటర్లో కూడా అంతే అండీ!
ReplyDeleteమీ కామెంటుకి ధన్యవాదములు ప్రభాకర్ రెడ్డిగారూ. సత్య గౌరి లాంటి థియేటర్లు యింకా ఉన్నందుకు సంతోషంగా ఉంది
Delete