మణిరత్నం మోసం చేయడమేంటనుకుంటున్నారా? అవును. మోసం చేసింది మాత్రం మనల్నే. రోజా సినిమా చూసారా? కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమా అది. ఆ సినిమా షూటింగ్ అంతా ఎక్కడ తీసారో తెలుసా? కాశ్మీర్ అనుకుంటున్నారు కదూ. కానే కాదు. ఆ సినిమాని మొత్తం ఊటీ లో తీసేసాడు మణిరత్నం. మొన్నా మధ్య ఊటీ వెళ్ళినప్పుడు అర్ధమయ్యింది నాకు. ఊటీ ని ఏమాత్రం తెలియనియ్యకుండా కాశ్మీర్ అనే విధంగా భ్రమింపచేసాడు మణిరత్నం. ఈ సినిమానే కాదు 'దిల్ సే' సినిమా కూడా అంతే.
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
Wednesday, 15 October 2014
Subscribe to:
Post Comments (Atom)
ఆలోచింప చేసే విధం గా ఉదండీ !! ( టపా హెడ్ లైన్ కనబడు తోంది టపా కనబడడం లే!!)
ReplyDeleteచీర్స్
జిలేబి
ఆలోచింప జేసే లా ఉందండీ ! (అసలు టపా ఎక్కడుందో అని !!)
ReplyDeleteచీర్స్
జిలేబి
జిలేబీ గారూ మీరు చెప్పదలుచుకున్నదేమిటో అర్ధం కాలేదండి. దయచేసి కాస్త వివరంగా వ్రాయండి
Delete