అష్టా చమ్మ సినిమా చూసాక హీరో 'నాని' ని చూసాక ఆ సినిమా దర్శకుడు 'ఇంద్రకంటి మోహన కృష్ణ' కి దగ్గర పోలికలు కనిపించి అతని తమ్ముడేమో అనుకున్నాను. మొన్న మొన్నటి వరకు కూడా వాళ్ళిద్దరూ అన్నదమ్ములేమోనని అనుకునేవాడిని. తర్వాత తెలిసిందనుకోండి!
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
Thursday, 19 November 2015
Sunday, 8 November 2015
రాంచరణ్ విషయం లో జరిగింది అఖిల్ విషయం లో జరగనిది?
ఒక సారి చిరుత సినిమా గుర్తు తెచ్చుకోండి. యిప్పుడు చెప్పబోయేది చిరుత సినిమా గురిచి కాదు, ఆ సినిమాలో నటించిన రాంచరణ్ గురించి. అతని లాంచింగ్ గురించి. ఎంత గ్రాండ్ గా లాంచ్ చేసారో గుర్తుందిగా?! ఆ సినిమా విడుదలయ్యేంతవరకూ అతని నోటినుండి ఒక్క మాట కూడా వినలేదు మనం. కాదు వినే అవకాశమివ్వలేదు చిరంజీవి కుటుంబం. కేవలం అతని నటన గురించో లేక షూటింగ్ విశేషాలు మాత్రమే చూసే భాగ్యం కలిగేది మనకి. ఆ సినిమా విడుదల అయ్యేంతవరకూ అతని నటన ఎలా ఉంటుందా, అతని డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందా అని కళ్ళు కాయలు కాచేలా చూసాము. అతను పొడుగు తక్కువా లేక అందంగా లేడా అన్న విషయాల్ని కూడా మనం పట్టించుకోనతగా అతన్ని ప్రమోట్ చేసారు చిరంజీవి కుటుంబం. ఒక రకంగా చెప్పాలంటే మొన్న బాహుబలికి ఎంత హైప్ క్రియేట్ అయ్యిందో 'చిరుత' సినిమాకి అంతే హైప్ క్రియేట్ అయ్యింది. ఇదే టెక్నిక్కుని చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి కూడా కొనసాగించారు. రేపు ఆ పార్టీని స్థాపిస్తారనగా ఈ రోజు వరకు ఆ పార్టీ పేరుని ప్రకటించకుండా ఆ పార్టీకి పెట్టబోయే పేరు మీద మనకి ఎంతో ఆశక్తిని రేకెత్తించేలా చేసారు. సరే ఆ విషయాన్ని ప్రక్కన పెడితే ఏతా వాతా చెప్పొచ్చేదేంటంటే రాంచరణ్ ని చిరంజీవి కుటుంబం గొప్పగా లాంచింగ్ చేసారని. కొంచెం వెనక్కి వెళితే మహేశ్ ని కూడా ఇదే విధంగా లాంచ్ చేసారు.
యిప్పుడు కాసేపు వర్తమానం లోకి వద్దాం. ఒక్క సారి నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య విషయానికొస్తే అతని లాంచింగ్ ఎంత నీరసంగా, ఎంత చప్పగా జరిగిందో గుర్తు తెచ్చుకోండి. పైగా అతని మొదటి సినిమాకి ఎంచుకున్న కధ, పాత్రధారుల ఎంపిక విషయంలో ఎన్నో తప్పులు జరిగిపోయాయి. మళ్ళీ అదే తప్పు చిన్న కొడుకు అఖిల్ విషయంలోనూ చేస్తున్నాడు నాగార్జున. అఖిల్ సినిమా ఎలా ఉంటుందో అన్నది సినిమా విడుదలయ్యాక చెప్పొచ్చు. నేను చెప్పేది అతని లాంచింగ్ గురించి. ఆ సినిమా విడుదలకి ముందే అతని యింటర్వ్యూలు తెగొచ్చేసాయి, వస్తున్నాయి. చిన్న చిన్న టీవీ ప్రోగ్రాముల్లోకి కూడా వచ్చేస్తున్నాడు అఖిల్. యిక సినిమా విడుదలయ్యే సరికి తన మీద జనాలకి ఉండే కాస్తో కూస్తో ఉన్న ఆశక్తి కూడా పోయేలా చేసుకుంటున్నాడు అఖిల్. తన కొడుకుల్ని ప్రమోట్ చేసే విషయం లో నాగార్జున పూర్తిగా ఫెయిల్ అయినట్లే.

Subscribe to:
Posts (Atom)