పిల్లల్ని సక్ర మార్గంలో పెంచడమెలా? మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్ని గౌరవించడం ఎలా? ముఖ్యంగా తండ్రిని గౌరవించడమెలా? యిలాంటివి నేర్పడానికి మనకి బోలెడన్ని పుస్తకాలున్నాయి, కొన్ని సినిమాల్లో కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. కానీ వీటన్నిటినీ తలదన్నే యాడ్ ఒకటి మనం చూసే అధ్బుత అవకాశం కలుగుతోంది ఈ మధ్య. పిల్లలకి వాళ్ళ తండ్రిని ఎంత చక్కగా గౌరవించాలొ ఎంత నేర్పుగా వాళ్ళకి కావలసింది తమ తండ్రి నుంచి సాధించుకోవాలో సదరు యాడ్ చూసి నేర్చేసుకోవచ్చన్నమాట. యింతకీ ఆ యాడ్ సారాంశం ఏమిటంటే ......
ఒక కుర్రాడు తన తండ్రికి 'అతి' వినయం ప్రదర్శిస్తూ అతని తండ్రికి కావలసిన పని ఏదో చేస్తాడు. ఈ తతంగాన్ని అతని తల్లి ఓ కంట చూస్తూనే ఉంటుంది. ఆ కుర్రాడు తన తల్లితో "చూసావా నాన్నని ఎలా మస్కా కొట్టి నా పని చేసుకున్తున్నానో అన్నట్టుగా సైగ చేస్తాడు. అది చూసిన ఆ తల్లి ఆ కుర్రాడిని ఏమీ అనకపోగా ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది.ఇదే విధంగా అమ్మాయితో కూడా ఇలాంటి యాడ్ ఉంది. ఆహా ... ఎంత గొప్ప యాడో కదా?
ఇదే కాదు 'పిల్లలు కాదు పిడుగులు' అనే గొప్ప కార్యక్రమం ఒకటోస్తోంది. మన యింట్లో పిల్లలు వాళ్ళ వయసును మించిన మాటలు మాట్లాడితే కొప్పడతాము.. కానీ ఈ కార్యక్రమం చిన్న చిన్న పిల్లలు చక్కటి ముదర కబుర్లు చెప్పే మహత్తర అవకాశం కలిపిస్తోంది. వాళ్ళు అలా చెపుతుంటే ఆ కార్యక్రమాన్ని యాంకరింగ్ చేస్తున్న 'ఉదయభాను' విరగబడి నవ్వుతోంది(ఏడవలేక). ఆ పిల్లల తల్లిదండ్రులైతే నిజంగానే ఎడ్చేస్తున్నారు ఆనందం తట్టుకోలేక. నవ్వాలో, ఏడవాలో అర్ధం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది 'మనం' మాత్రమే. ఈ సారి ఎవరైనా క్లారిటీ ఇస్తే బాగుండును. .