Wednesday, 7 June 2017

ఆహా ఏమి రుచి

అబ్బబ్బబ్బా.... ఏమి రుచి....ఏమి రుచి.....తిన్నాక జన్మ ధన్యమైపోయిందంటే నమ్మండి! ఎలా వండగలుగుతున్నారు రైల్వే స్టేషన్ లలో ఇంతటి రుచికరమైన టిఫిన్....సంజీవ్ కపూర్ కి కూడా సాధ్యం కానంత అద్భుతంగా ఎలా చేస్తున్నారు?! ఇడ్లీ....ప్రపంచంలో ఎక్కడా దొరకనంత మృదువుగా... పట్టుకుంటే జారిపోయేంత ఇదిగా ఎలా?! దోస...అబ్బో..తలుచుకుంటేనే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి...ఉప్మా....హేయ్.. ఎవడ్రా మధ్యలో...కుక్కలు కూడా తినవు అంటోంది...నమ్మకండి....ఇక గారి....వింటే భారతం వినాలి....తింటే రైల్వే స్టేషన్ లో గారే తినాలి.....వాడేవాడో వాంతి చేసుకుంటున్నాడా... ఆనందం ఎక్కువైనప్పుడు కళ్లల్లో ఆనందభాష్పాలు రావా?!...అలాగే ఇదీనూ.... రుచి మరీ ఎక్కువైపోయి అలా బయటకొస్తుందంతే......నా సలహా ఏంటంటే మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఏంతో రుచికరమైన వంటలకు ప్రశిిద్ధి గాంచిన రైల్వే స్టేషన్లలో ఆర్డర్ ఇవ్వండి....మీ బంధువులు, స్నేహితులు మిమ్మల్ని చల్లగా ఆశీర్వదిస్తారు...ఏంటి వాళ్ళ చేతిలో మారణయుధాలు లేకుండా చూసుకోవాలా!...నమొద్దు ఇలాంటి మాటల్ని.....శుభ్రంగా రైల్వే స్టేషన్ లో తినడం అలవాటు గా మార్చుకోండి.....ఆనందంగా జీవించండి.....ఏంటి ...బయట పారేయాలా.....ఏమిటో....ఎంత చెప్పినా వినదు....నమ్మదు ఈ పాడు లోకం!