నందమూరి కళ్యాణ్ రాం,నారా రోహిత్ వీళ్ళిద్దరికీ ఓ విషయం లో పోలికుంది.
రూపంలో కాదు. నటనలో అంత కన్నా కాదు. మరేంటి? దర్శకుల ఎంపికలో, కధ ఎంపికలో,
హీరోయిన్ ఎంపికలో వీళ్ళిద్దరూ తమదైన మార్కు చూపిస్తుంటారు. మిగతా వాళ్ళలాగ
ఒక సినిమా హిట్టవ్వగానే ఆ సినిమా దర్శకుడి వెంట పడడం, లేకపోతే ఆ సినిమాలోని
హీరోయిన్ ని వెంటనే బుక్ చేసేయడం చేయరు. నందమూరి బాలకృష్ణ, జూ యన్ టీఆర్
లు తరచుగా చేసే తప్పులు యివే. ఒకసారి బాలకృష్ణ సినిమాలు గుర్తు
తెచ్చుకోండి. అప్పట్లో చిరంజీవి నటించిన 'ఇంద్ర' హిట్టవ్వగానే అందులో
నటించిన ఆర్తీ అగర్వాల్, సోనాలీ బెంద్రె లను యధాతదంగా తన పల్నాటి
బ్రహ్మనాయుడు సినిమాలో పెట్టేసుకున్నాడు. దర్శకుడు కూడా సేం టూ సేం. బీ
గోపాల్. సినిమా అట్టర్ ఫ్లాప్. అలాగే 'ఆది' సినిమా హిట్టవ్వగానే వినాయక్
వెంటబడి చెన్నకేశవ రెడ్డి సినిమా తీస్తే అది ఘోర పరాజయం.
జూ యన్ టీఆర్ కూడా అంతే. గబ్బర్ సింగ్ హిట్టవ్వగానే హరీష్ శంకర్ తో రామయ్యా వస్తావయ్యా, 'అత్తారింటికి దారేదీ' హిట్టవ్వగానే అందులో నటించిన ప్రణీత, సమంత లతో 'రభస ', కిక్ హిట్టవ్వగానే వెంటనే సురేందర్ రెడ్డితో ఊసరవెల్లి, కొన్ని సినిమాలు హిట్టవ్వగానే శ్రీను వైట్లతో 'బాద్షా' యిలా చెప్పుకుంటూ పోతే యిద్దరికీ యిలా కాంబినేషన్లు, హిట్టు దర్శకుల వెంటపడి చేతులు కాల్చ్ణుకున్న సందర్భాలు ఎన్నో.
యిలా చేయడం తప్పా ఒప్పా అన్నది కాదు ప్రశ్న. ఒక సినిమా హిట్టవడమన్నది కేవలం కాంబినేషను వలనో లేక దర్శకుడి పేరు వలనో సాధ్యం కాదు. సినిమాలో విషయముండాలి. దాని తర్వాతే ఏదైనా.
యిక కళ్యాణ్ రాం, నారా రోహిత్ ల గురించి చెప్పుకుంటే వీళ్ళిద్దరూ యిప్పటి వరకూ తాము నటించిన సినిమాలను ఒక సారి పరిశీలించండి. వీరిద్దరూ హిట్టు దర్శకుల వెంట పడకుండా కాంబినేషన్ల జోలికి పోకుండా ఎప్పుడూ కొత్తదనానికి స్వాగతిస్తుంటారు హిట్టూ ఫ్లాపు లతో సంబంధం లేకుండా. ఏమంటారు?!