Tuesday 1 December 2015

'కళా సేవకి భాషా భేదాలు ఉండవు బాబు' అంటారేమో

చాలా కాలం క్రింద ఓ యాడ్ వచ్చేది. చిరంజీవి, నాగార్జున, రాజేంద్రప్రసాద్ ఇలాంటి నటులు పొలోమంటు టీవీల్లో ఒక మాట చెపుతుండేవారు "తెలుగు వారంతా తెలుగులోనే మాట్లాడదాం " అని. ఆహా వీళ్ళకి  తెలుగు మీద ఎంత భక్తి ! అని పొరపాటున ఎవరన్నా అనుకున్నారేమో గానీ నాకు మాత్రం ఒకటే అనిపించేది ఆ యాడ్ చూసాక
"తెలుగు సినిమాల్లో తెలుగు నటులనే పెట్టుకుందాం. పరాయి భాష నటుల్ని ప్రక్కన పెడదాం" అని -
యిదే విషయాన్ని వాళ్ళకి చెపుదాం అని. 

5 comments:

  1. మరి చెప్పారా వారికి వరప్రసాద్ గారు...

    ReplyDelete
  2. మరి చెప్పారా వారికి వరప్రసాద్ గారు...

    ReplyDelete
  3. < "'కళా సేవకి భాషా భేదాలు ఉండవు బాబు' అంటారేమో"

    "అంటారేమో" అని మీకు సందేహమా? ఏమీ అనుమానం వద్దు - తప్పకుండా అంటారు. ఆ సూక్తులు తరచూ చెప్పేవాళ్ళల్లో ప్రముఖ నటులతో పాటు గానగంధర్వులు కూడా ముఖ్యులు. దానివల్ల వారికి ఇతర భాషల్లో కూడా అవకాశాలు తద్వారా ఆదాయం దొరుకుతాయి కదా. అలాగే ఆ సూక్తి వల్లనే కదా ఇతర భాషల వారు తెలుగులో వెలుగుతున్నారు. అందువల్ల ఆ సూక్తి ఉభయతారకం. అందుకని బొంబాయి హీరోయిన్లు, ఇతర భాషల నటీనటులే కనిపిస్తుంటారు. ఫంక్షన్లలో వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడే తెలుగు మాటలు సాధారణంగా "అందరికీ నమస్కారం" వరకే పరిమితం. అది కాక మాటకి నాలుగు సార్లు "డైరెక్టర్ సార్", "కెమెరామన్ సార్", లాంటి ఆణిముత్యాలు దొర్లుతుంటాయి. అంతా ఇంగ్లీషుమయమే. టీవీ ఇంటర్వ్యూల్లో కూడా వాళ్ళది అదే తీరు (ఓ సారి ఓ ప్రేక్షకురాలు ఫోన్ చేసి తెలుగులో చెప్పండి అని అడిగితే ఆ ఏంకరిణి "ఏం, మీకు ఇంగ్లీష్ రాదా?" అని గద్దించింది. అదీ మన దుర్గతి). తెలుగు సినిమాల్లో పదేళ్ళు వెలిగి పుష్కలంగా డబ్బు సంపాదించుకుంటారు (తప్పులేదు) గానీ తమకి ఉపాధి చూపించిన భాష నాలుగు ముక్కలు నేర్చుకునే ప్రయాస కూడా పడరు - ఏదో కొందరు మినహాయించి. అంతే కాదు టీవీ మీద వచ్చే ఏడ్స్ గమనించే ఉంటారు - కొన్ని కొన్ని హిందీలో ఉంటున్నాయి, హిందీలో మాత్రమే ఉంటున్నాయి (ఈ ట్రెండ్ ఎక్కువవుతోంది). ఛానెల్ వారికి వాటిద్వారా వచ్చే ఆదాయం మీదే దృష్టి గాని ఆ ఏడ్ తెలుగులోకి తర్జుమా చేయించాలని పట్టదు. తెలుగుభాష చేసుకున్న పాపం. ఈ వ్యాపారసంస్కృతిలో ఏ విలువలూ లేవు, సామాన్య జనం అభిప్రాయాన్ని ఎవరూ లెక్క చెయ్యరు, మనది బ్లాగుశోష. "మహామంత్రి తిమ్మరుసు" చిత్రంలోని "చరిత్ర ఎరుగని మహాపాతకము మాదేశానికి పట్టినదా" అనే పాట గుర్తు చేసుకుంటుండడమే.

    ReplyDelete
    Replies
    1. నరసిం హారావు గారూ.....చాలా గొప్పగా చెప్పారు సార్

      Delete