పద్మశ్రీ అల్లు రామలింగయ్య సమర్పించు
గుల్షన్ కుమార్ ప్రెజెంట్స్
నిర్మాత : మాగంటి రవీంద్రనాధ్ చౌదరి
నిర్మాత : శ్రీమతి అనిత
ఏంటి వీళ్ళందరి గురించి రాసాననుకుంటున్నారా? వీళ్ళందరికీ ఓ సంబంధముంది. ఏంటంటారా? వీళ్ళెవరూ యిప్పుడు ఈలోకంలో లేరు. అంటే బ్రతికి లేరు. కానీ వీరందరూ ఎడాపెడా సినిమాలు తీసిపారేస్తున్నారు. అవును. నమ్మడానికి విడ్డూరంగా ఉన్నా యిది నిజం. వీరందరూ చనిపోయినా వీళ్లల్లో కొంతమంది సినిమాలు సమర్పిస్తున్నారు, కొంతమంది సినిమాలు తీస్తున్నారు.
మరి చనిపోయిన వాళ్ళు ఎలా తీస్తారు అంటే తీస్తారు అంతే. మనం నమ్మాలి....నమ్మి తీరాలి. గమ్మత్తేమిటంటే వీళ్ళ పేరు ముందు "కీర్తిశేషులు" అనో లేదా "స్వర్గీయ" అని కూడా ఉండదు. మరి ఎలా సమర్పిస్తున్నారు? అంటే వీళ్ళ ఆత్మలు సమర్పిస్తున్నాయా? ఎలా సాధ్యం? పోనీ అదే నిజమనుకున్నా పద్మశ్రీ అల్లు రామలింగయ్య ఆత్మ సమర్పించు అని ఉండాలి కదా?
అప్పుడు ఇంకో అనుమానమొస్తుంది. ఆత్మలు లెక్కలు గట్రా ఎలా చూస్తాయి? చూడలేవు కదా? మరి లెక్కలు చూడలేనప్పుడు వీళ్ళ పేర్లు ఎందుకు వేస్తున్నారు? వీళ్ళ మీద గౌరవం తో వేస్తున్నారు అని అనుకున్నా వాళ్ళ ఆత్మలు సమర్పించలేవు కదా? అది అసాధ్యం కదా? సినిమాలు తీయలేవు కదా?
గౌరవముంటే వారి ఫోటో వేయడమో లేదా స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి దివ్య ఆశీస్సులతో అనో వేస్తే కొంత బాగుంటుందేమో. అలా కాకుండా ఏకంగా సినిమాలు సమర్పించేయడమంటే కొంత....కాదు .....చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది.

Hahaha... Good observation.... Point undi
ReplyDelete☺😊 ThankTha you
Deleteశెవాలతో రాజకీయం అనేవాళ్ళు, సినిమాలతో కూడానా!!!
ReplyDelete👍
Delete
ReplyDeleteఇచ్చట దెయ్యము లహహో
వెచ్చగ నిదురోయి సూవె , వెండి తెరలపై
తచ్చట్లాడి సమర్పణ
విచ్చల విడిగన జిలేబి విరివిగ జేయున్ :)
జిలేబి
:-}
Delete"ఆత్మా"నందమే అసలైన ఆనందం అంటారు కదండి.
ReplyDelete☺
Delete