చాలా మంది ఇంట్లోనో లేక వంటరిగా ఉన్నప్పుడు సాధారణంగా చేసే పని యిష్టమైన పాటలు పెట్టుకొని వినడం. అదీ చాలా ప్రశాంతంగా. చివరికి అది ఎంత హుషారైన పాటైనా సరే. కానీ విచిత్రమేమిటంటే అదే పాటని స్నేహితులు లేదా కొంచెం క్లోజ్ గా ఉండేవాళ్ళు ఉన్నప్పుడు అంతకు ముందు ఎప్పుడూ విననట్టు, గట్టిగా పాడేస్తూ, పిచ్చి పిచ్చిగా డాన్సు మూమెంట్లు యిస్తూ ఉంటారు. వంటరిగా ఉన్నప్పుడు కుదురుగా వినే వాళ్ళు జనాలున్నప్పుడు అలా ఎందుకు ప్రవర్తిస్తారో మరి?
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
Wednesday, 23 July 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment