నటుడు 'మాడా' పతనానికి కారకులు ఎవరో తెలుసా? దర్శకుడు స్వర్గీయ 'E.V.V.సత్యనారాయణ'. అవును. వినడానికి కొంచెం 'యిది'గా ఉన్నా అది నిజం. 'మాడా వెంకటేశ్వర రావు' 'చిల్లరకొట్టు చిట్టెమ్మ ' సినిమా లో 'ఆ' టైపు క్యారెక్టరు చేసి ఉండవచ్చు. కానీ ఆ సినిమాకు ముందూ, ఆ తర్వాత సినిమాలు చాలా వాటిల్లో కమెడియనుగానూ, సహాయనటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్నాడాయన. కానీ ఈవీవీ దర్శకత్వము మొదలుపెట్టిన తర్వాత ఆయన కొన్ని సినిమాల్లో 'మాడా' పేరుని ఆడా మగా కాని వారికి పర్యాయ పదంగా మార్చేసాడు ఈవీవీ. 'నేనేమైనా ఆడా మగా కాని మాడా గాడిని అనుకున్నావా?' లాంటి డైలాగులు పలికించడం ద్వారా 'మాడా వెంకటేశ్వర రావు' లాంటి మంచి నటుడి స్థాయిని దిగజార్చాడు. యిక అక్కడినించి ఆయనకి దాదాపు అన్ని సినిమాల్లో 'ఆ' టైపు పాత్రలు మాత్రమే వచ్చాయి. ఈవీవీ వలన బలైపోయిన మరో నటుడు గునుపూడి విశ్వనాధ శాస్త్రి. ఎవరో అర్ధమయ్యిందా? లేదు కదూ?. అదే 'ఐరన్ లెగ్ శాస్త్రి ' అంటే అర్ధమవుతుంది. అతనికి ఆ పేరు పెట్టడమే కాకుండా అతన్ని ఆ పేరుతో తెగ పాపులర్ చేసేశాడు ఈవీవీ. వృత్తి రీత్యా పౌరోహిత్యం చేసుకొనే విశ్వనాధ శాస్త్రి సినిమాల్లో 'ఐరన్ లెగ్ శాస్త్రి'గా పేరు తెచ్చుకోవడం వలన అతనికి పౌరోహిత్య అవకాశాలు రావడమే కరువయ్యాయి. ఆ క్రమము లోనే చివరికి చావుని కొని తెచ్చుకున్నాడు విశ్వనాధ శాస్త్రి...... అదే ఐరన్ లెగ్ శాస్త్రి. ప్చ్ !
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
Tuesday, 23 September 2014
Monday, 22 September 2014
మీ వయసెంత?
మీ వయసెంత అని ఎవరైనా అడిగారనుకోండి. ఎంత చెపుతారు? అదేం ప్రశ్న ? నా వయసెంతో అంతే చెపుతాను. అని చిరాకు పడుతున్నారు కదూ? ఆగండాగండి. యిందులో ఒక చిన్న తిరకాసుంది. ఎలాగో చూద్దాం. మీరు 1-1-1974 సంవత్సరములో పుట్టారనుకుందాము. యిప్పుడు చెప్పండి మీ వయసెంత చెపుతారు?
40 సంవత్సరాలా? లేక 41 సంవత్సరాలా?
చాలా మంది చెప్పే జవాబు 41. కానీ యిది తప్పు. ఎందుకంటే మనము చెప్పాల్సింది మనము ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసాము అని. అంతే గానీ పూర్తి చేయాల్సిన వయసు చెప్పగూడదు. యింకా కొంచెం లోతులోకి వెళ్ళి చెప్పుకుంటే ఓ మూడు నెలల క్రితం మీకు ఒక అబ్బాయి పుట్టాడనుకొనడి ఆ అబ్బాయి వయసు ఎంత చెపుతారు? మూడు నెలలు చెపుతారా లేక సంవత్సరమా? అర్ధమయ్యిందనుకుంటా?!
40 సంవత్సరాలా? లేక 41 సంవత్సరాలా?
చాలా మంది చెప్పే జవాబు 41. కానీ యిది తప్పు. ఎందుకంటే మనము చెప్పాల్సింది మనము ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసాము అని. అంతే గానీ పూర్తి చేయాల్సిన వయసు చెప్పగూడదు. యింకా కొంచెం లోతులోకి వెళ్ళి చెప్పుకుంటే ఓ మూడు నెలల క్రితం మీకు ఒక అబ్బాయి పుట్టాడనుకొనడి ఆ అబ్బాయి వయసు ఎంత చెపుతారు? మూడు నెలలు చెపుతారా లేక సంవత్సరమా? అర్ధమయ్యిందనుకుంటా?!
Friday, 19 September 2014
మళ్ళీ చప్పట్లు !
అప్పుడెప్పుడో వచ్చిన హిందీ సినిమా "తేజాబ్" గుర్తుందిగా? అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ నటించారు. మాధురీ 'ఏక్ దో తీన్ పాట ఒక ఊపు ఊపేసింది అప్పట్లో. దాన్ని తెలుగులో కూడా తీసారు. వెంకటేష్, రాధ హీరో, హీరోయిన్లు. యిదంతా తెలిసిన విషయమే. బానే ఉంది. ఆ సినిమాకి సంబంధించిన యింకో విషయం చెప్పనా? తేజాబ్ సినిమాని తెలుగులో మళ్ళీ యింకో సారి తీసారు. కాకపోతే మక్కీకి మక్కీ కాకుండా దాదాపు అదే కధతో అన్నమాట. ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లు. సినిమా గుర్తొచ్చిందా? సరే చెప్పేస్తున్నా. "వర్షం". అవును. "వర్షం" సినిమా తేజాబ్ కధాంశంతో తీసిన సినిమానే. M.S.రాజు మంచి తెలివిగా తీసాడు, ఎక్కడా తేజాబ్ సినిమా గుర్తు రాకుండా. ఆయన తీసిన యింకో సినిమా "నువ్వొస్తానటే నేనొద్దంటానా?" సినిమా కూడా అదే బాపతు. హిందీ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా "మైనే ప్యార్ కియా" సినిమా కధాంశంతో తీసిన సినిమా అది. భలే ఉంది కదా?!
Friday, 5 September 2014
ఇంటెర్వెల్ లేని తెలుగు సినిమాలు
నాకు తెలిసీ ఇంటర్వెల్ లేని తెలుగు సినిమా గతం లో ఒకటొచ్చింది. దాని పేరు "ఆఖరి పోరాటం". నాగార్జున, శ్రీదేవి నటించిన సినిమా అది. ఆ సినిమా కి ఇంటెర్వెల్ లేదు. యిప్పుడు చాలా కాలం తర్వాత అలాంటి ఇంటెర్వెల్ లేని సినిమా ఒకటి రాబోతోంది. దాని పేరు "అనుక్షణం". మంచు విష్ణు హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తోంది. గమ్మత్తేమిటంటే ఈ రెండు సినిమాలు ఇంగ్లీష్ అక్షరం 'A' తో మొదలవ్వడం. రెండు సినిమాల దర్శకుల పేర్లు కూడా R అక్షరం తో మొదలవుతాయి.
Subscribe to:
Posts (Atom)