అప్పుడెప్పుడో వచ్చిన హిందీ సినిమా "తేజాబ్" గుర్తుందిగా? అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ నటించారు. మాధురీ 'ఏక్ దో తీన్ పాట ఒక ఊపు ఊపేసింది అప్పట్లో. దాన్ని తెలుగులో కూడా తీసారు. వెంకటేష్, రాధ హీరో, హీరోయిన్లు. యిదంతా తెలిసిన విషయమే. బానే ఉంది. ఆ సినిమాకి సంబంధించిన యింకో విషయం చెప్పనా? తేజాబ్ సినిమాని తెలుగులో మళ్ళీ యింకో సారి తీసారు. కాకపోతే మక్కీకి మక్కీ కాకుండా దాదాపు అదే కధతో అన్నమాట. ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లు. సినిమా గుర్తొచ్చిందా? సరే చెప్పేస్తున్నా. "వర్షం". అవును. "వర్షం" సినిమా తేజాబ్ కధాంశంతో తీసిన సినిమానే. M.S.రాజు మంచి తెలివిగా తీసాడు, ఎక్కడా తేజాబ్ సినిమా గుర్తు రాకుండా. ఆయన తీసిన యింకో సినిమా "నువ్వొస్తానటే నేనొద్దంటానా?" సినిమా కూడా అదే బాపతు. హిందీ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా "మైనే ప్యార్ కియా" సినిమా కధాంశంతో తీసిన సినిమా అది. భలే ఉంది కదా?!
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
Friday, 19 September 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment