Thursday, 6 November 2014

మరి దివాన్ చెరువుని దివాన్ టాంక్ అనరెందుకో !

మీరు గమనించారో లేదో గానీ మన తెలుగు వాళ్ళంతా చాలాకాలం నుండి "దీపావళి" ని ఆ పేరుతో పిలవడం మానేసారు. "దీవాలి" అని పిలుస్తున్నారు. అలాగే "వినాయక చవితి"ని "గణే ష్ చతుర్ధి" అని పిలుస్తున్నారు. ఏ పేరుతో పిలిచినా అర్ధం ఒకటే. కానీ నోరారా తెలుగు పేర్లతో పిలవడం మానేసారనే నేను చెప్పదల్చుకుంది. అన్నట్టు మా రాజమండ్రి లో "కంబాల చెరువు" ని కూడా "కంబాల టాంక్" అని పిలిచేస్తున్నారండోయ్!  

2 comments:

  1. 🙂🙂. మరోటి కూడా ఉంది. అదే "సంక్రాంతి"ని "పొంగల్" అనడం తెలుగువాళ్ళల్లో బాగా ఎక్కువవుతోంది 😕.
    "కంబాల టాంక్" అంటే గుర్తొచ్చింది. ఆమధ్య ఒకసారి ఒక పెద్దమనిషి తారసపడ్డాడు. మాటల్లో మీదే ఊరని అడిగితే అమలాపురం అన్నాడు. తన ఇల్లు "బ్లాక్ బ్రిడ్జ్" దగ్గర అని కూడా చెప్పాడు. నేనో క్షణం తికమక పడి 😳, తేరుకుని, సరే నాకు బాగా పరిచయం ఉన్న ఊరు కాబట్టి "నల్లవంతెన" దగ్గరా అని అడిగాను (ఆ ఊళ్ళో నల్లవంతెన, ఎర్రవంతెన అని ఉన్నాయి. ఎప్పటినుండో ఆ పేర్లతోనే పిలిచేవారు). అవునండీ, అదే బ్లాక్ బ్రిడ్జ్ అని నాబోటి అజ్ఞానులకు అర్థమయేలా మరోసారి చెప్పాడు పాపం. మనసులోనే ఆయన బడాయికో నమస్కారం పెట్టి ఊరుకున్నాను 🙏. అలా పలకడం స్టైల్ అనుకుంటున్నట్లున్నారు కొంతమంది 🙁.
    (మీ బ్లాగ్ చూస్తుంటే ఈ టపా కనపడింది. చదివి, బాగుందనుకుని, నా అనుభవం పంచుకోవాలని ఈ వ్యాఖ్య వ్రాసాను)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు సార్. మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి మీ కామెంట్లు.

      Delete