Saturday 8 November 2014

సునీల్ డైలాగు డెలివరీ మారిపోవడానికి కారకుడు ఎవరు?

ఈ మధ్య సునీల్ ని గమనించారా? కమెడియను గా ఉన్నప్పటి అతని నటననీ, హీరో అయ్యాక యిప్పటి నటనని పోల్చి చూడండి. చాలా తేడా కనిపిస్తోంది కదూ? కమెడియన్ గా ఉన్నప్పుడు అతని నటనలో చాలా 'ఈజ్' ఉండేది. కామెడీలో చెలరేగిపోయేవాడు. కానీ హీరో అయ్యాక పట్టి పట్టి నటిస్తున్నాడు రాముడు మంచి బాలుడు అనే తరహాలో. అతనిలోని ఈజ్ ఎగిరిపోయి నటనలో కృత్విమత్వము కనిపిస్తోంది. యిలా అతనిలోని మార్పుకి కారణమేమిటి? హీరో అయ్యాడు కాబట్టి ఫక్తు కమెడియనులా నటించడము కుదరదన్న మాట నిజమే. కానీ సునీల్ పరిస్థితి అది కాదు. మరీ బిగదీసుకుపోయి నటిస్తున్నాడు. ఆ తరహా నటన 'అందాల రాముడు' సినిమా లో లేదు. కానీ ఆ తర్వాత వచ్చిన 'మర్యాద రామన్న ' సినిమాలో అతని నటన పూర్తిగా మారిపోయింది. అతని మాట తీరు ఏదో తెచ్చి పెట్టుకున్నట్టుగా మారిపోయింది. దీనికి కారణం రాజమౌళి. అతని డైలాగ్ డెలివరీని పూర్తిగా మార్చిపాడేసాడు. ఆ సినిమా పెద్ద హిట్టయ్యింది. దాంతో అక్కడ్నించి సునీల్ ప్రతీ సినిమాలో అదే తరహా డైలాగు డెలివరీతో నటించేస్తున్నాడు. పాత సునీల్ ని ఎప్పుడు చూస్తామో??

2 comments:

  1. హీరోలుగా మారిన కమెడియన్లు దురదృష్ట వశాత్తు
    తెలుసుకోలేక పోతున్న విషయం - they are being
    popular and liked for their buffoonery -
    హీరో అవగానే ఒక ఎన్టీఆర్ లేక చిరంజీవి లాగా ఫీల్
    అయ్యి, తను ఒరిజినల్ గా కమెడియన్ అన్న విషయం
    మరిచి సీరియస్ హీరోఇజం చూపడం ప్రేక్షకులు రిసీవ్
    చేసుకోవడం కష్టం అని తెలుసుకోవలేకపోవడం -
    అలా తెలుసుకున్న బ్రహ్మానందం, బాబు మోహన్
    తిరిగి కమెడియన్ లుగా స్థిరపడి పోయారు.
    తెలుసుకున్న అలీ రెండిందాలా లాభాపడుతూనే
    వున్నాడు. తెలుసుకున్న రవితేజా కమెడియన్ కం
    హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇక్కడే సునీల్ ఫెయిల్
    అవుతున్నాడు. we are missing a good comedian
    and a true entertainer from him...

    ReplyDelete