వాళ్ళందరూ సినిమా గాయకులే. జనాలకి కూడా వాళ్ళలో చాలా మంది తెలుసు. గుర్తు పడతారు కూడా. వాళ్ళలో గొప్ప గాయకులెవరంటే ఎలా చెపుతారు? ఎలా నిర్ణయిస్తారు? పోనీ సినిమా పాటలు కాకుండా క్రొత్త పాటలు పాడతారా అంటే అదీ లేదు. ఎప్పుడూ సినిమా పాటలే. యింకా దారుణమయిన విషయమేమిటంటే గతం లో వాళ్ళు పాడేసిన పాటలనే మళ్ళీ పాడటం. ఎవరైనా క్రొత్త గాయకులు పాడుతున్నారా అంటే కాస్తో కూస్తో ఒప్పుకోవచ్చు గానీ ఆల్రెడీ సినిమాల్లో పాడుతోన్నవాళ్ళు మళ్ళీ పాడటమేంటి? స్వరాభిషేకం, లిటిల్ చాంప్స్, సూపర్ సింగర్, ........ పేర్లు ఎన్నైనా పెట్టుకోనివ్వండి సారాంశం మాత్రం పాటల పొటీయే. అదీనూ సినిమా పాటలు. ఇవేకాదు ఏ చానల్ చూసినా సినిమా పాటలు. చిన్న పిల్లల నించి పెద్దవాళ్ళ దాకా అందరూ తెగ పాడేస్తున్నారు. బానే ఉంది కానీ వాళ్ళ ప్రతిభని కొలవడానికి సినిమా పాటలే గత్యంతరం అయితే ఎలా? ఎప్పుడూ సినిమా పాటలే కాకుండా కొన్నైనా స్వంతంగా ట్యూన్లు కట్టి పాడొచ్చు కదా? అలా చేస్తే క్రొత్త సంగీత దర్శకులు, గేయ రచయితలు కూడా సినీ రంగానికి పరిచయం అవుతారు కదా? ఎందుకంటున్నానంటే ఆ సినిమా పాటలు పాడుతున్నప్పుడు పాడే వాళ్ళకీ, వినే మనకీ ఆ పాట తాలూకు మాతృక మనకి కనిపిస్తూ (వినిపిస్తూ) ఉంటుంది. పాటని ఆస్వాదించడం కన్నా మాతృక తో పోల్చి చూడటమే సరిపోతోంది.
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
Thursday, 29 October 2015
Subscribe to:
Post Comments (Atom)
నిజమే. పూర్వం రాజేశ్శ్వరరావు,ఘంటసాల, వంటి గాయకుల సినిమా పాటలు ,ప్రైవేటు రికార్డులకు మంచి ఆదరణ ఉండేది.సభల్లో వాటిని పాడేవాళ్ళు. ఇప్పటి గాయనీ గాయకులకు అంత ఆదరణ లేదు. ఐనా మీరన్నట్లు ,వీళ్ళు పాత పాటలు పాడడం కన్నా తాము స్వయంగా పాడిన సినిమాల్లోని స్వంత పాటలుమాత్రమే పాడితే బాగుంటుంది కదా.
ఇలా రోజుకో ప్రోగ్రాం చెయ్యడం వీళ్ళకి మరో ఆదాయమార్గం అండి. స్పాన్సర్లకి కొదవ లేదు, జనాల వేలంవెర్రికి అంతు లేదు. దాంతో ఈ గాయనీ గాయకులకి పండగే పండగ. ఫలానా పాట రచన గురించి రికార్డింగ్ గురించి వర్ణిస్తూ, సినిమా పరిశ్రమ గొప్పదనం గురించి ఎడతెరిపి లేకుండా చెప్పుకుంటూ లాభసాటి కాలక్షేపం చేస్తుంటారు.
ReplyDeleteఅవును సార్. మీరు చెప్పింది అక్షరాలా నిజం
ReplyDelete