ఈ మధ్య ఎక్కడ చూసినా చైన్ స్నాచింగుల వార్తలే. ఆడవాళ్ళు వంటి మీద నగలేసుకొని బయటకెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి. ఆడవాళ్ళు కాబట్టే యిలాంటి పరిస్థితి అదే మగవారికైతే ఏమీ బాధలు ఉండవు అని అనుకుంటున్నారా? ఎందుకుండవండి బాబు! భేషుగ్గా ఉంటాయి. కాకపొతే చైన్ స్నాచర్ల వల్ల కాదు. మరో రకంగా. ఎలా అంటారా? భైరవరావుల వల్ల. అదేనండి బాబు మనచేత ముద్దుగా శునకాలు అని పిలవబడే 'కుక్కలు'. ఈ శునకాలున్నాయి చూసారూ. అక్కడుంటాయి యిక్కడ లేవు అన్న ప్రశ్నే లేదు. ఎక్కడ పడితే అక్కడ ప్రతీ వీధిలో ప్రతీ సందులో గ్యాంగులు మెయింటైన్ చేస్తూ ఉంటాయి. మరి వీటి బారిన పడకుండా అంటే మన పిక్కలు వాటికి ఆహారం కాకుండా తప్పించుకోవడం ఎలా? కొంచెం కష్టమే. నా అనుభవాన్ని కాస్తంత జోడించి కొన్ని జాగ్రత్తలు చెప్పటానికి ప్రయత్నిస్తా. యివి ఖచ్చితంగా నిజం అని మీకు అనిపిస్తేనే పాటించండి. తర్వాత మీ యిష్టం, ఆపై మీ అదృష్టం.
విషయానికొస్తే కుక్కలకి పరిగెత్తే మనుష్యుల్ని చూసినా, కార్ల క్రింద- బండ్ల క్రింద టైర్లన్నాతెగ మంటెక్కిపోతాయి. అమాంతం మీద పడి మన కండ పీకేయ బుద్దవుతుంది వాటికి. అంచేత కుక్కల ముందు పరిగెత్తే ప్రయత్నం చేయకండి. వాటిని గౌరవించండి. అవి కూడా మిమ్మల్ని గౌరవిస్తాయి- కరవకుండా. అంతే కాదండోయ్ వాటికి టైర్లంటే మహా కోపం. ఎందుకంటే వాటి క్రింద పడి చనిపోయిన తోటి కుక్కలే గుర్తొస్తాయి వాటికి. అందుకే ఆ టైర్ల అంతు చూద్దామని కార్ల వెంటా బండ్ల వెనకాల పడుతూ ఉంటాయి. మీరు కార్లో ఉంటే గ్లాసులు వేసేసుకొని ప్రయాణించండి. అదే బండి మీద వెళితే మాత్రం మీ కాళ్ళు పైకి పెట్టుకొని డ్రైవ్ చేయటానికి ప్రయత్నించండి. లేదా ఏదో ఒక చోట ఆగిపోండి. అంతేగానీ వాటిని చూసి స్పీడు పెంచారో అవి మరింత వెర్రెక్కి పోయి మీ వెంటపడటం మీ పిక్కలు పీకేయటం ఖాయం. యిన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన కండలు పీకే కుక్కలు కూడా ఉంటాయి. వాటి సంగతేమిటంటారా?అవేం మామూలు కుక్కలు కాదండోయ్. మరేంటంటారా? మనుష్యులలో పిచ్చి మనుష్యులు ఉన్నట్టే కుక్కల్లో కూడా పిచ్చి కుక్కలుంటాయి. వాటిని మనం గుర్తించాలి. లేకపోతే అంతే సంగతి!

No comments:
Post a Comment