Wednesday, 7 February 2018

నమ్మకమే జీవితం

నేనెవరినీ నమ్మను....మనుషులంటే అస్సలు నమ్మకం లేదు" ఇలాంటి మాటలు అప్పుడప్పుడు వింటుంటాం. కావొచ్చు కానీ జీవితంలో ప్రతీ నిమిషం ఎవరో ఒకరిని నమ్మి తీరాల్సిందే. నమ్ముతూనే ఉండాల్సిందే. ఒక బస్సో రైలో ఎక్కామంటే డ్రైవర్ని నమ్ముతాము సక్రమంగా నడుపుతాడని. ఒక హోటల్ కి వెళితే వాళ్ళు పెట్టిన పదార్థాలు తాజావనే నమ్మి తీరాలి. ఒకవేళ అనుమానం వచ్చినా చేసేది కూడా ఏమీ లేదనుకోండి. ఒక దర్శకుడు సినిమా తీస్తే జనం చూస్తారని నమ్మకం.... ఒక సినిమా కి వెళ్లే ప్రేక్షకుడు బానే ఉంటుందని నమ్మకం.... ఇలా అన్ని చోట్లా అన్ని రకాలుగా తోటి మనిషిని నమ్మకపోతే జీవితమే లేదు
 నమ్మకమే జీవితం.

1 comment:

  1. తప్పదుగా, నమ్మకంతోనే లాగిస్తున్నాం - ఆధునిక జీవితంలో / ఈ రోజుల్లో చాలాసార్లు చాలాచోట్ల నమ్మకం వమ్ము అవుతున్నప్పటికీ 😒.

    ReplyDelete