శుభలేఖ లో ఏముంటుంది? ఏముంటుంది? ఫెండ్లి కొడుకి వివరాలు, పెండ్లి కూతురి వివరాలు, పెండ్లి ఫలానా రోజు, విందు వివరాలు, యివే కదా అంటారా? నిజమే. యివే ఉంటాయి. ఆ కార్డులో చాలా భాగము ఖాళీగా ఉంటుంది కదా. ఆ ప్లేస్ లో యాడ్స్ ఉంటే ఎలా ఉంటుదంటారు? పెళ్ళికి చాలా ఖర్చు అవుతుంది కదా? కొంతైనా యాడ్స్ ద్వారా భారం తగ్గొచ్చేమో? ఆలోచించండి. చీ. పవిత్రమైన పెండ్లి శుభలేఖ లో యాడ్స్ ఏమిటంటారా? ఏమో మరి. నాకు అలా అనిపించింది. యిప్పుడు కాకపోయినా భవిష్యత్ లో యిలాంటివి జరగొచ్చేమోనని నా అభిప్రాయం. (నాకు గనక యిప్పుడు పెండ్లి జరుగుంటే శుభలేఖ లో తప్పకుండా నా బ్లాగ్ గురించి నేనే ఒక యాడ్ వేసుకునేవాడినేమో!)
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment