మీకొక చిన్న పరీక్ష. మన రాష్ట్రంలో సినిమా హాల్లో గానీ, రైల్వే స్టేషన్ లో గానీ, బస్ స్టేషన్ లో గానీ, ఒక కూల్ డ్రింక్ గానీ వాటర్ బాటిల్ గానీ కొనండి. ఆ బాటిల్ మీద ఉన్న అసలు రేటుకి గానీ మీరు కొనగలిగితే మీరు చాలా అదృష్టవంతుల క్రిందే లెక్క. కానీ నా అభిప్రాయము ప్రకారము మీరు ఎట్టి పరిస్తితుల్లోనూ అదృష్టవంతులయ్యే అవకాశమే లేదు. బాటిల్ రేట్ కన్నా రెండ్రూపాయలో మూడ్రూపాయలో ఎక్కువ పెట్టి కొనాల్సిందే.పట్టించుకొనే నాధుడే లేడు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తారనే భయం కూడా లేదు. మీరు ఒకవేళ దాన్ని ప్రశ్నించినా మిమ్మల్ని ఓ వెర్రి వెధవలా చూస్తారు. గట్టిగా అడిగితే అవి పాత రేట్లంటారు. యివే కాదు. గోలీకాయలంత సైజు ఉండే మూడు సమోసాలు పది రూపాయలట. రెండు గరిటల క్వాంటిటీ ఉండే పాప్ కార్న్ పేకెట్ పదిహేను రూపాయలు. బయట న్యూస్ పేపెరు రేటు ఐదు రూపాయలుంటే అక్కడ ఆరు రూపాయలు. చాలా దారుణమైన విషయమేమిటంటే మామూలు షాపుల్లో కూడా యిదే విధానాన్ని అమలు చేస్తున్నారు.
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
సత్యం.
ReplyDeleteబ్లాక్ మాత్రమే కాదండి వైట్ లో కూడా అంతే. ఇతర దేశాల సంగతి నాకు తెలియదు గానీ, నేను గమనించినంత వరకు, లేక నేను అర్ధం చేసుకున్నంత వరకు మాత్రం, మన దేశంలో authorised price fixing mechanism అనేది ఒకటి ఉన్నట్లుగా నాకు అనిపించదు. ఎవరి రేటు వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం పెట్టుకుంటారనిపిస్తుంది మా వూళ్ళో, విజయవాడ లో, నేను బందర్ రోడ్ లో గల ఒక ఫేమస్ స్వీట్ షాప్ నుంచి ఎగ్ బిస్కట్స్ 200 gms ప్యాకెట్ ఒకటి మొదట్లో, సుమారుగా ఒక 3 లేక 3 1/2 years క్రితం పది రూపాయలకు కొనేవాడ్ని. ఇప్పుడది 150 gms గా మారి 65 రూపాలయింది. అది కొన్నప్పుడల్లా నేను పై విషయమే అనుకుంటూ ఉంటాను. ప్లస్ నో బిల్లింగ్. అదొక్కటే కాదనుకోండి చాలా విషయాల్లోఇలాంటి వ్యత్యాసాలెన్నింటినో గమనించాను. నోరు మూసుకుని కొనడమో మానడమో చేయడం తప్ప మనం చేయగలిగినది ఏమీ లేదని మాత్రం అర్ధం అయ్యింది, మొర పెట్టుకునే దిక్కు ఏ దిక్కో తెలియక...
మీ కామెంటుకి నా ధన్యవాదములు రావు గారు.
ReplyDelete