ఈ క్రింద పేర్కొన్న ఐడియాలనుకోండి,
సూచనలనుకోండి సమాజానికి ఉపయోగపడతాయని నేను భావించి వ్రాస్తున్నవి. వీటిలో కొన్ని సిల్లీ గానూ, హాస్యాస్పదంగా అనిపిచ్చుండొచ్చు.
మీలో కొంత మందికి వీటికంటే యింకా మంచి ఐడియాలు కలిగివుండవచ్చు. కానీ వీటిమీద మీ అభిప్రాయాలను
నాతో తప్పకుండా పంచుకుంటారు కదూ.
ఎవరైనా ఒక చిన్న పరికరాన్ని కనిపెడితే బాగుండును. అది ఎలాంటిదై ఉండాలంటే....... ఒక చేతిలో పట్టేంత ఉండాలి. పాకెట్ లో పట్టేంత ఉంటే మరీ బాగుంటుంది. ఆ పరికిరం కి ఒక బటనుండాలి. ఆ బటను నొక్కితే ఓ మూడు (3) కిలోమీటర్ల వరకు వినబడేంత గట్టిగా సౌండు రావాలి. దాన్ని క్రింద కొట్టినా లేక పగలగొట్టినా పగలనంత గట్టిదై ఉండాలి. కానీ ఆ శభ్డాన్ని ఆపాలంటే పోలీసు వాళ్ళు వచ్చి లాక్ ఓపెన్ చేస్తే తప్ప ఇంకెవరూ ఆపలేని పరిస్థితి ఉండాలి. ప్రతీ అమ్మాయీ, ప్రతీ మహిళ ఆ పరికరాన్ని తమ వెంట ఎప్పుడూ ఉంచుకోవాలి. ఎవరైనా వారి మీద లైంగిక దాడి చేయటానికి ప్రయత్నించినపుడు వారు వెంటనే ఈ పరికరము లోని బటన్ ని నొక్కాలి. వెంటనే అది గట్టిగా ఓ మూడు కిలోమీటర్లు వినబడేంత శబ్దం చేయాలి. దాడి చేయటానికి వచ్చిన వాడు ఆ పరికరాన్ని పగలకొట్టటానికి ప్రయత్నించినా పగలదు. దాంతో వాడు పలాయనం చిత్తగించాలి. ఆ శబ్డం విని చుట్టు ప్రక్కల వాళ్ళు అక్కడికి చేరుకోవాలి. ఆ అమ్మాయిని కాపాడాలి. దాని లాక్ మాత్రం పోలీసుల దగ్గరే ఉండాలి.
ఎవరైనా యిలాంటి పరికరం కనిపెడితే బాగుంటుంది కదా? నా ఈ కల ఎప్పటికైనా నెరవేరుతుందంటారా?
((నవంబరు 15 న నేను పెట్టిన పోస్టు యిది)
యిది ఈ రోజు అంటే 23.11.2013 ఈనాడు పేపర్ లో ప్రచురించిన వార్త. ఆదలో ఉన్న మహిళకు రక్షణ 'నిర్భయ '. ECIL తయారు చేసిన పరికరం (పేరు నిర్భయ) ఆడవారిని లైంగిక దాడికి గురైనపుడు బటన్ నొక్కితే తన బంధువులకు, సన్నిహితులకు, పోలీసులకు వెంటనే సమాచారం చేరుతుంది. సరిగ్గా యిలాంటి పరికరాన్నే నేను సూచించింది. కాకపోతే ECIL కి నా సూచన ఏమిటంటే ఆ పరికరానికి నేను సూచించిన విధంగా మీట నొక్కితే సౌండ్ గట్టిగా వచ్చే విధంగా ఉంటే బాగుంటుంది. తద్వారా దాడి చేసే వాడు భయపడే అవకాశముంటుంది. ఏది ఏమైనా చాలా సంతోషంగా ఉంది ఓ పరికరాన్ని కనిపెట్టినందుకు.
No comments:
Post a Comment