బాగా బోర్ కొడుతోందా? జీవితం నిస్సారంగా అనిపిస్తోందా? చిరాగ్గా ఉందా? ఏమీ తోచడం లేదా? అయితే ఈ క్రింద చెప్పిన వాటిలో మీకు నచ్చింది చేయండి.
ఏదైనా పార్కుకెళ్ళండి. వాకుంగు చేయటానికొచ్చే 'తాతారావు'లుంటారు. పది నిమిషాలు వాకింగు చేసి, ఓ రెండు గంటలు కూర్చొని రాజకీయాలనించి సినిమాల దాక అన్ని విషయాలు తమకే తెలుసన్నట్టు అనర్గళంగా ఉపన్యాసం దంచేస్తుంటారు. అవి వింటే కాస్త బోర్ తగ్గచ్చేమో.
బాలేదా? అయితే రైల్వే స్టేషనుకెళ్ళండి. ఖాళీగా ఉన్న ఓ బెంచీ మీద కూర్చొని ట్రైను ఎక్కే దిగే జనాల్ని గమనించండి. వీలుంటే ఓ టీటీ దగ్గరకెళ్ళి బెర్త్ యిమ్మని అడగండి. షరా మామూలుగా లేదనే చెప్తాడు. అయినా వదలకండి, బ్రతిమలాడండి. ఫ్యామిలీ తో వచ్చానని దీనంగా చెప్పండి. డబ్బులిస్తానని చెప్పండి. సరేనన్నాడనుకోండి ఫ్యామిలీని తీసుకొస్తానని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోండి.
అక్కడే సెండాఫివ్వటానికొచ్చే వాళ్ళు, వాళ్ళకి దూరమవుతున్న వాళ్ళ ఫీలింగ్సూ గమనించండి. ట్రైను బయల్దేరేటప్పుడు వాళ్ళతో పాటూ మీరు కూడా వాళ్ళకి టాటా చెప్పండి. స్టేషనులోపలికి వెళ్ళేటపుడు ప్లాట్ ఫాం టికెట్ తీసుకోవటం మాత్రం మర్చిపోకండేం!
యిదీ నచ్చలేదా? అయితే ఓ సినిమాకి వెళ్ళండి. అది కూడా పాత సినిమా. అది కూడా అస్సలు జనాలు లేని సినిమా. అదీ ఎదురు సీటు మీద కాళ్ళు వేసుకొని చూడగలిగే సదుపాయమున్న హాలుకెళ్ళండి. అటువంటి సదుపాయము మీకు పెద్ద థియేటరులో ఉండదు - కేవలం చిన్న థియేటరులో మాత్రమే ఉంటుంది. అటువంటి ఆణిముత్యాన్ని (థియేటరుని) ఎంచుకొని హాయిగా కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని సినిమా చూడండి. సినిమా బోర్ కొడితే అక్కడే ఓ కునుకేసేయండి. అడిగే వాడుండడు. ఆ కునుకేదో యింట్లోనే వేయొచ్చు కదా అంటారా? వస్తున్నా. యింట్లో ఎంత గింజుకున్నా రాని నిద్ర బోర్ కొట్టే సినిమా చూస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కావాలంటే ప్రయత్నించండి.
లాభం లేదా? సరే. ఓ షాపింగ్ మాల్ కో బట్టల షాపుకో వెళ్ళండి. బట్టలు అన్నీ పరిశీలించండి. మొత్తం బట్టలన్నీ చూడండి. అందులో మీకు నచ్చినవి ఉన్నా యింకా చూపించమనండి. మీకు తెలీకుండానే చాలా టైము కిల్ అయిపోతుంది. చివరికి బట్టలేవీ నచ్చలేదు అని చెప్పి బయటకొచ్చేయండి.
లేదా మీ ఊళ్ళో గోదావరో సముద్రమో ఉంటే అక్కడ కాసేపు గడిపి రండి. మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది.
అసలు బయటకెళ్ళడం ఇష్టం లేదా? సరే ఓ పని చేయండి. మీకు బాగా దగ్గరి స్నేహితుడికి ఫోన్ చేయండి. కాస్త చమత్కారంగా హాస్యభరితంగా మాట్లాడేవాడైతే మరీ మంచిది. అలా అని మీ గర్ల్ ఫ్రెండుకో లేక భార్యకో ఫోన్ మాత్రం అస్సలు చేయకండోయ్. ఎందుకంటే వారు మిమ్మల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేయరు సరి కదా యింకా బోరు కొట్టిస్తారు. ఎందుకంటే జీవితాంతం మీరు మాత్రమే వారిని ఎంటర్ టైన్ చేయాలని కోరుకుంటారు కాబట్టి.
మీ ఆల్బంలు తీసి చూసుకోండి. పాత జ్ఞాపకాలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.
మీకు నచ్చిన పాటలు పెట్టుకుని వినండి.
మీకు నచ్చిన పుస్తకమో లేక నవలో లేక పత్రికో చదవండి.
అబ్బే. లాభం లేదా? అయితే చివరగా యిది ప్రయత్నిచండి. మీ యింట్లో నెట్ ఉంటే www.dasarigamalu.blogspot.in ఓపెన్ చేసి చదవండి. బోర్ మొత్తం మీ యింటి బ్యాక్ డోర్ లోంచి పరార్!

ఈ రోజు మీ బ్లాగ్ మొత్తం చదివాను,(బోర్ కొట్టి కాదు తీరిక దొరికి)బుల్లి బుల్లి పోస్టులు కదా బాగున్నాయి.వ్రాస్తూ ఉండండి.
ReplyDeleteనీహారిక గారూ మీకు నా రచనలు (పోస్టులు) నచ్చినందుకు ధన్యవాదములు. మీరు కూడా మీ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉండండి (వీలైతే నా ప్రతీ రచన మీద :-)
Deleteమా ఇంట్లో నెట్ ఉందని నువ్వు చెప్పిన చివరి ఆప్షన్ ట్ర్య్ చేసాను. కొంచెం workout అయ్యింది. కొన్ని try చెయ్యడానికి కుదరలేదు.😊😊😊
ReplyDelete