Showing posts with label పైత్యం బయట పడేది అప్పుడేగా!. Show all posts
Showing posts with label పైత్యం బయట పడేది అప్పుడేగా!. Show all posts

Wednesday, 23 July 2014

పైత్యం బయట పడేది అప్పుడేగా!

చాలా మంది ఇంట్లోనో లేక వంటరిగా ఉన్నప్పుడు సాధారణంగా చేసే పని యిష్టమైన పాటలు పెట్టుకొని  వినడం. అదీ చాలా ప్రశాంతంగా. చివరికి అది ఎంత హుషారైన పాటైనా సరే. కానీ విచిత్రమేమిటంటే అదే పాటని స్నేహితులు లేదా కొంచెం క్లోజ్ గా ఉండేవాళ్ళు ఉన్నప్పుడు అంతకు ముందు ఎప్పుడూ విననట్టు, గట్టిగా పాడేస్తూ, పిచ్చి పిచ్చిగా డాన్సు మూమెంట్లు యిస్తూ ఉంటారు. వంటరిగా ఉన్నప్పుడు కుదురుగా వినే వాళ్ళు   జనాలున్నప్పుడు అలా ఎందుకు ప్రవర్తిస్తారో మరి?