Showing posts with label అసలే నా యింటి అడ్రసు దొరక్క చస్తుంటే నీ గోలేంటెహె. Show all posts
Showing posts with label అసలే నా యింటి అడ్రసు దొరక్క చస్తుంటే నీ గోలేంటెహె. Show all posts

Tuesday, 15 July 2014

అసలే నా యింటి అడ్రసు దొరక్క చస్తుంటే నీ గోలేంటెహె

 మీరు ఓ అడ్రసు కోసం తెలియని ప్రదేశానికెళ్ళరనుకోండి. అక్కడ ఎవరినైనా మీరు చెప్పిన అడ్రసు గురించి వాకబు చేయండి. అందులో కొంత మంది అడ్రసు గురించి అడగ్గానే వెంటనే "ఈ అడ్రసా? ఏ ఏరియా అని చెప్పారు? ఏ సందని చెప్పారు? యిలాంటి ప్రశ్నలు వేసి మిమ్మల్ని ఇంటరాగేట్ చేస్తారు. వారు అలాంటి ప్రశ్నలు వేస్తున్నారంటే దానర్ధం వారికి ఆ అడ్రసు గురించి ఏ మాత్రం తెలియదని. కానీ వారు ఆ విషయం అస్సలు ఒప్పుకోరు. 'తెలియదు ' అని ఎంత మాత్రం చెప్పరు సరి కదా 'ఇలా తిన్నగా వెళ్ళి ఆ లెఫ్ట్ కి వెళ్ళండి.'... అని చెపుతారు. వారు చెప్పింది నమ్మి ఆ రూటులో వెళ్ళారంటే అంతే సంగతులు. మీ టైమంతా వృధా చేసుకున్నట్లే.  "తెలియదు" అనే చిన్న మాట చెప్పటానికి వచ్చిన తంటాలు యివి.