Tuesday 15 July 2014

అసలే నా యింటి అడ్రసు దొరక్క చస్తుంటే నీ గోలేంటెహె

 మీరు ఓ అడ్రసు కోసం తెలియని ప్రదేశానికెళ్ళరనుకోండి. అక్కడ ఎవరినైనా మీరు చెప్పిన అడ్రసు గురించి వాకబు చేయండి. అందులో కొంత మంది అడ్రసు గురించి అడగ్గానే వెంటనే "ఈ అడ్రసా? ఏ ఏరియా అని చెప్పారు? ఏ సందని చెప్పారు? యిలాంటి ప్రశ్నలు వేసి మిమ్మల్ని ఇంటరాగేట్ చేస్తారు. వారు అలాంటి ప్రశ్నలు వేస్తున్నారంటే దానర్ధం వారికి ఆ అడ్రసు గురించి ఏ మాత్రం తెలియదని. కానీ వారు ఆ విషయం అస్సలు ఒప్పుకోరు. 'తెలియదు ' అని ఎంత మాత్రం చెప్పరు సరి కదా 'ఇలా తిన్నగా వెళ్ళి ఆ లెఫ్ట్ కి వెళ్ళండి.'... అని చెపుతారు. వారు చెప్పింది నమ్మి ఆ రూటులో వెళ్ళారంటే అంతే సంగతులు. మీ టైమంతా వృధా చేసుకున్నట్లే.  "తెలియదు" అనే చిన్న మాట చెప్పటానికి వచ్చిన తంటాలు యివి.

2 comments:

  1. ఇక్కడ దొరుకుతుందేమో చూడండి: http://manadiksuchi.blogspot.com/2014/07/blog-post.html

    ReplyDelete
  2. అడ్రస్ దొరికింది. బాగుంది 'శ్రీ' గారు !

    ReplyDelete