Showing posts with label ఓ సమయమా ఎందుకింత నిర్దయ?. Show all posts
Showing posts with label ఓ సమయమా ఎందుకింత నిర్దయ?. Show all posts

Monday, 23 December 2013

ఓ సమయమా ఎందుకింత నిర్దయ?

అరెరె అప్పుడే ఆ రోజులయిపోయాయా?
కార్కు బాలుతో ఫాస్టు బౌలింగు చేసేసి
కాళ్ళూ వికెట్లని విరొగ్గొట్టేసిన రోజులు
అపుడే అయిపోయాయా?

బ్లాకులో గీతాంజలీ
బొడ్లో చైనులు చుట్టుకొని శివ సినిమాలు
చూసి కేరింతలు కొట్టిన రోజులు
అపుడే దూరమయ్యాయా?

హవా హవా ఏ హావా అంటూ సోలో సాంగులు పాడేసి
ఏక్ దో తీనంటూ మాధురీ డేన్సులకి ఈలలు వేసేసి
చిరు స్టెప్పులకి స్టెప్పులు కలిపేసిన రోజులు
అప్పుడే కనుమరుగయ్యాయా?