Thursday 7 August 2014

రైల్వే టోల్ గేట్

మొన్న జరిగిన స్కూల్ బస్ ఏక్సిడెంట్ వార్త యిప్పటికీ ఏదో చానల్ లో వస్తూనే ఉంది. కానీ అది చూడాలన్నా ఆ వార్త చదవాలన్నా ధైర్యం సరిపోవడంలేదు. ఏమి తప్పు చేసారు ఆ పిల్లలు? అసలు ఎందుకు జరిగింది? ఎవరి తప్పు? రైల్వేదా లేక బస్ డ్రైవర్ దా? డ్రైవరు సెల్ ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటడం వలన ఏక్సిడెంట్ జరిగిందని చెపుతున్నారు పిల్లలు. నా ఉద్దేశ్యం ప్రకారము బస్ డ్రైవరుది తప్పు ఉన్నా ఈ పాపం లో ఎక్కువ భాగము రైల్వే డిపార్ట్మెంటుదేనని నా అభిప్రాయము. ఎందుకంటే ఆ ప్రదేశం లో అంటే రైల్వే క్రాసింగు ప్రదేశంలో సిగ్నల్ గేట్ లేకపోవడమే ప్రధాన కారణము. కాదాంటారా?  
సరే. మరి మరి ప్రతీ రైల్వే క్రాసింగు ప్రదేశంలో ఆ గేటులు పెట్టొచ్చు కదా? ఎందుకు వాటిని కొన్ని చోట్ల మాత్రమే పెడుతున్నారు? అని ప్రశ్నిస్తే మనకు ఓ సమాధానం వస్తుంది "నిధుల కొరత " అని. భారతదేశమంతా సిగ్నల్ గేటుల్ని పెట్టాలంటే కనీసం 30 వేల కోట్లు అవసరమవుతాయంట. అంతే కాదు ప్రస్తుతమున్న పరిస్తితుల్లో రైల్వే కు అంత సొమ్ము భరించే శక్తి లేదట.  మరి అయితే ఈ విషయంలో ప్రైవేటు భాగస్వామ్యము తీసుకోవచ్చు కదా?  
ఎలా అంటే "రైల్వే టోల్ గేట్" లను ఏర్పాటు చేయడం ద్వారా. అవును ఇప్పుడు జాతీయ రహదారుల్లో మనకు చాల చోట్ల కనిపించే టోల్ గేట్ ల మాదిరిగానే రైల్వే టోల్ గేట్ లను ఏర్పాటు చేయాలి. అంటే టోల్ గేట్లు దాటినపుడు టికెట్ ఎలా తీసుకొని వెళతామో అలాగే రైల్వే క్రాసింగు గేట్ దాటేటప్పుడు టికెట్ తీసుకొని దాటాలన్న మాట. ఈ పద్దతిలో వెళితే రైల్వేకు 30 వేల కోట్ల రూపాయలను స్వంతంగా భరించే అవసరముండదు. ప్రైవేటు పార్టీల ద్వారా ఈ రైల్వే టోల్ గేటు లను ఏర్పాటు చేయించి,  తిరిగి ఆ సొమ్ముని ప్రజల ద్వారా తిరిగి పొందే అవకాశం కలిపిస్తే రాబోయే కాలంలో మరెన్నో ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఏమంటారు?  

6 comments:

  1. Replies
    1. ధన్యవాదములు రెడ్డి గారూ. - వరప్రసాద్ దాసరి

      Delete
  2. Dont we have common sense when crossing railway track, when we driving on raod while taking truning and cross roads we will see two sides then pass further, it is 100% driver and school management falt but now a days its fashion that for everything we will point but governament, but we will forget about ethics basic responsibility

    ReplyDelete
    Replies
    1. వీరేష్ గారూ మీ అభిప్రాయానికి నా ధన్యవాదాలు. మీరు చెప్పినట్టు రైల్వే పట్టాలు క్రాస్ చేసేటప్పుడు ముందూ వెనుకా అటూ యిటూ చూసుకొని దాటాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాదనను. నేను కూడా మొన్న జరిగిన ఏక్సిడెంటులో డ్రైవరు బాధ్యత లేదు అని కానీ, స్కూల్ మేనజ్ మెంట్ తప్పు లేదు అని కానీ అనటం లేదు. కానీ మనము ఒక విషయం మాత్రం మర్చిపోకూడదు. రైల్వే క్రాసింగు ఉన్న ప్రతీ చోటా రైల్వే గేటు ఉండి తీరాల్సిందే. దాన్ని రైల్వే తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందే. ఆ విషయములో అది తప్పించుకోజాలదు. కాకపోతే నేను చెప్పిందల్లా ఏంటంటే రైల్వేకు అంత సొమ్ము భరించే శక్తి లేదు కనక ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకుంటే బాగుంటుందని చెప్పాను. ఐతే ప్రతీ చోటా రైల్వే గేట్లు ఏర్పాటు చేసినా దాని క్రిందకు దూరి పట్టాలు దాటే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ అలాంటి వారు ఉన్నారని రైల్వే గేట్లు పెట్టకుండా ఉండగూడదు కదా? ఏమంటారు? - వరప్రసాద్ దాసరి

      Delete
  3. chala chotla raillu vastunna kuda station lalo pattalapai datutu vuntaru. mari vallanu ela control chestaru.Ullalo gate padda kuda paipu kindauga cykilu, motaru cycles veskuni mari veltuntaru villanem cheyali.Railway tappa? asahanama?e 5 nimishalu agalera?

    ReplyDelete
    Replies
    1. మహేషుడు గారూ మీ అభిప్రాయానికి నా ధన్యవాదాలు. ఇంచుమించు మీలాంటి అభిప్రాయమే వెలిబుచ్చిన వీరేష్ గారికి నేను పైన ఇచ్చిన జవాబు చూడగలరు - వరప్రసాద్ దాసరి

      Delete