మార్కెట్ లోకి క్రొత్త సబ్బు వచ్చిందా?
టీవీల్లో, పత్రికల్లో ఆ సబ్బు గురించి తెగ అడ్వర్టైజ్ మెంటులు వచ్చేస్తున్నాయా?
మీరు ఆ సబ్బు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ మీకు ఆ సబ్బు ఎలా ఉంటుందో మీకు సలహా గానీ అభిప్రాయము గానీ చెప్పే వారు లేరా?
ఒక్క సబ్బే కాదు. క్రొత్త ప్రొడక్ట్ ఏది వచ్చినా అది ఎలా ఉంటుందో మీరు స్వయంగా వాడితే గానీ మీకు దాని గురించి తెలిసే అవకాశమే లేదు. కాదంటారా?
వాటిమీద సలహా గానీ, రివ్యూలు గానీ వ్రాసే చాన్సే లేదు.
కానీ ప్రపంచంలో ఒకే ఒక్క ప్రొడక్ట్ కి మాత్రం అది మార్కెట్ లోకి వచ్చిన వెంటనే అది ఎలా ఉంటుందో వెంటనే - అంటే ఆ ప్రొడక్ట్ వచ్చిన గంటల్లోనే దాని మీద రివ్యూలు వచ్చేస్తాయి. అది బాగుందో లేదో చెప్పటమే కాకుండా దానికి రేటింగులు కూడా తెలియచేస్తాయి. అదేంటో మీకు తెలుసా?
అవును. మీ ఊహ నిజమే. ఆ ప్రొడక్ట్ పేరు
' సినిమా'
అది రిలీజైన ఓ గంట సేపటికే దాని మీద రివ్యూలు రాసి పాడేస్తున్నారు. యివి నిజంగా అవసరమా? ప్రపంచంలో మరే యితర ప్రొడక్ట్ కీ లేని రివ్యూలు సినిమాకి మాత్రం ఎందుకు? ఒక సబ్బుని కొని అదెలా ఉందో తెలుసుకుంటున్నప్పుడు సినిమాని మాత్రం రివ్యూ చదివి ఎందుకు చూడాలి? ఆ సినిమాని తీయడానికి ఆ నిర్మాత ఎంత డబ్బు పెట్టుంటాడు? ఎంత శ్రమ? మరెంతో క్రియేటివిటీ? యివన్నీ కలబోస్తే గానీ ఓ సినిమా తయారవ్వదు. మరలాంటి సినిమా రిలీజైన ఓ గంటలోనే దాని భవిష్యత్తుని నిర్ధారించేస్తే ఎలా?
నా ఉద్దేశ్యం చెత్త సినిమాల్ని ప్రోత్సహించడం కాదు. కానీ ఆ చెత్త సినిమాని కూడా ఎంతో డబ్బు పెట్టే తీస్తారు నిర్మాతలు. కాబట్టి సినిమా బాగుందో లేదో ప్రేక్షకుడినే నిర్ణయించుకొనే అవకాశమివ్వాలి. కేవలం రివ్యూలు చదివో, చూసో సినిమా చూసే విధానం ఆగిపోవాలి.
ఆపలేమంటారా? సరే. కనీసం సినిమా రిలీజైన ఓ వారం పాటన్నా రివ్యూలని నిషేధించాలి. సినిమా కలెక్షన్లకి కీలకమైనది ఆ మొదటి వారమే. కనీసం ఆ వారం రోజులపాటైనా రివ్యూలని నిషేధించాలి.
ఓ సినిమా బాగుందనో లేక చెత్తగా ఉందనో రివ్యూలు రాసి పారేసే పత్రికలు ఐదుకి ఇంత అని రేటింగులు ఇచ్చి పారేసే చానల్సు ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఆ సదరు పత్రికలూ, చానెల్సు మీద ఎవరైనా రివ్యూలు వ్రాస్తేనో, రేటింగులు ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. సదరు పత్రిక చెత్తగా ఉందనో, లేదా ఫలానా చానలు పని తీరు ఐదుకి ఇంత అని రేటిగు ఇస్తే వాటి పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించండి.

రివ్యూలు కేవలం సినిమాలకేకాదు సెల్ఫోన్లకూ ఉంటాయి. కొన్నిదేశాల్లో రివ్యూలు చదివాకే సబ్బులైనా కొంటారు.
ReplyDeleteఅసలు advertisements కూడా ఒకరకైమైన రివ్యూలే (self-review)! వాటిల్నికూడా ఒకవారం నిషేధిస్తే దరిద్రం వదిలిపోతుంది. నిర్మాత డబ్బుపెడతాడు సరే, ప్రేక్షకులు డబ్బుతోబాటు రెండున్నరగంటల సమయాన్నికూడా వెచ్చిస్తారు. ఒక పదిలక్షలమంది ప్రేక్షకులు ఒక సినిమాచూస్తారనుకుంటే ఇర్వయ్యఒదు లక్షల గంటల సమయం ఆసినిమా చూడడానికి ఖర్చు అవుతుందన్నమాట. దీన్నే చెత్త సినిమా విషయంలో 'వృధా' అనుకోవాల్సొస్తుంది. పెట్టిన పెట్టుబడికి తగిన ఫలాన్ని రాబట్టుకొనే హక్కు నిర్మాతకున్నట్లే. కొనబోయే వస్తువు (చూడబోయే సినిమా) ఆశించిన ప్రతిఫలాన్ని ఇస్తుందాలేదా అని తెలుసుకొనే హక్కు ప్రేక్షకుడికీ ఉంటుంది.
రివ్యూ అనేది నిజజీవితంలో ప్రతిచోటా జరిగేదే. అమ్మచేసిన కూరలో ఉప్పెక్కువైందని కొడుకుచేసేది రివ్యూ. పిల్లవాడు బాగా చదవడంలేదని మాస్టారు చేసేది రివ్యూ. భార్యకట్టుకున్న చీరపై, చేసుకున్న సింగారంపై భర్త రివ్యూ, భర్త తెచ్చిన కూరగాయలపై భార్య రివ్యూ. పక్క వాళ్ళు మనకి మంచి రివ్యూ ఇవ్వాలని మనం అందంగా తయారవ్వడం. ఇన్ని రివ్యూలమధ్య ఒక్క సినిమా రివ్యూనే ఎందుకు కానివైపోయాయి? రివ్యూలుకూడదన్నారుకాబట్టి ఈసారి మీరు ఇలా ప్రయత్నించండి ఎవరైనా సినిమా ఎలా ఉంది అనడిగితే మొదటి వారమ్రోజులూ "నాకు తెలియదు" అని neutral stance మెయింటైన్ చెయ్యండి (వారంరోజుల తరువాత ఎలాగూ సినిమా ఆడదుకాబట్టి ఆతరువాత మెంటెయిన్ చేసినా చెయ్యకపోయినా పెద్ద తేడా ఉండదు).
Iconoclast గారూ మీ అభిప్రాయానికి నా ధన్యవాదాలు. మీరు చెప్పింది కొంత వరకూ నిజమే. అంటే ఒక ప్రేక్షకుడు తన డబ్బునీ, విలువైన సమయాన్ని ఒక 'చెత్త' సినిమా కోసం ఎందుకు వెచ్చించాలి? అని. నిజమే. కానీ యిక్కడ ప్రశ్నల్లా ఏది 'చెత్త ' సినిమా అన్నదే. మీకు నచ్చిన సినిమా నాకు నచ్చదు. నాకు ఆ సినిమా చెత్తగా అనిపించొచ్చు. అలాగే నాకు నచ్చింది మీకు 'పరమ చెత్త' గా అనిపించొచ్చు. మనిద్దరికీ నచ్చింది యింకొకరికి 'చెత్త' గా అనిపించొచ్చు. కాబట్టి 'చెత్త ' సినిమాకు నిర్వచనం ఏంటో మనం చెప్పగలగాలి. సరే. మీరు చెప్పినట్టు రివ్యూ తప్పనిసరిగా ఉండాలి అనే అనుకున్నా అది ఓ వారం రోజుల తర్వాత ఉంటే బాగుంటుందని మాత్రమే నేను చెప్పాను.
Deleteయిక మీరు నన్ను ఓ వారం రోజులపాటు 'న్యూట్రల్ స్టేన్స్' మైంటైన్ చేయమన్నారు. మీరు చెప్పకపోయినా ప్రస్తుతము నేను చేస్తోంది అదే. నా బ్లాగులో యింతవరకూ ఏ సినిమా రివ్యూ వ్రాయలేదని గమనించాలి.
మీకొక చిత్రమైన విషయమొకటి చెప్పాలి. ప్రస్తుతము సూపర్ డూపర్ హిట్టైన ఓ సినిమా (పేరు చెప్పను) ఈ మధ్య చూసాను. ఆ సినిమా చూసినంత సేపూ ఎప్పుడెప్పుడెళ్ళిపోదామా అన్నంత బోర్ కొట్టింది. ఆ సినిమా టికెట్లు యిప్పటికీ బ్లాకులో అమ్ముతున్నారు. మరి దాన్నేమంటారు? నాకు ఆ సినిమా 'చెత్త' అనిపించింది కానీ మిగతా ప్రేక్షకులందరికీ నచ్చింది కదా?. యిప్పుడు నేను ఆ సినిమా గురించి 'చెత్త ' గా ఉందని వ్రాస్తే ఎలా ఉంటుందో చెప్పండి ?
దారుణమైన విషయమేమిటంటే ఓ సినిమా రిలీజైన మొదటి షోకే వీళ్ళు రివ్యూలు వ్రాసేస్తున్నారు. అంటే ఆ షోనుంచే లాప్ టాప్ ద్వారా
"సినిమా యిప్పుడే మొదలయ్యింది. హీరో ఇంట్రడక్షను సీండక్షన్ సాంగు వస్తోంది."
"మదర్ సెంటిమెంటు సీన్లు ఫర్వాలేదు. కానీ మదర్ పాత్రలో కొంచెం ఓవరేక్షను ఎక్కువయ్యింది."
"మూడో పాట రెండో చరణం బాగుంది"
యిలా వ్రాస్తున్నారు. వీరినేమనాలి? యిలాంటి రివ్యూలు వ్రాసేవారు సినిమాని ఏమి ఆస్వాదిస్తారు? ఎంతసేపూ సినిమా లో ఏమేమి లోపాలున్నాయో వెతకటమే పనిగా పెట్టుకోవటం తప్ప.
మీరింకా తెలుగు సినిమాలు చూస్తున్నారా? నేను మూడేళ్లక్రితమే మానేసాను. పెద్ద పెద్ద కధానాయకులంటే ఆ ఛాయలక్కూడా వెళ్ళను. విశ్వసనీత అనేది ఒకటుంటుంది కదండీ. ఒకప్పుడు రివ్యూలతో సినిమాల భవిష్యత్తును శాసించగల స్థాయున్న పేద్ద సైటుని ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు? రివ్యూలు పూర్తిగా లేకుండా ఉండేకంటే multiple రివ్యూయర్స్ ఉంటేనే బెటరని నా అభిప్రాయం. ప్రేక్షకులుకూడా వారు ఎవర్ని విశ్వసిస్తారో వారినే చదువుకొని వెళతారు.
Deleteన్యూట్రల్ స్టాన్స్ని గురించిన నా వ్యాఖ్య మిమ్మల్ని విమర్శించడానికుద్దేశ్యించినదికాదు. మనం నోటిమాటద్వారా ఒక సినిమాని చూడమని ఎలాగైతే స్నేహితులకి సలహా ఇస్తామో అలాగే రివ్యూసైట్లు ఆన్లైన్లో సలహా ఇస్తున్నాయి అని చెప్పడమ్మాత్రమే. అది ఎలా సరైనదో ఇదీ అలాగే సరైంది. ఇక మీరుదహరించిన సినిమాహాళ్ళలోంచి రివ్యూలురాసే సంస్కృతి నాకూ నచ్చదు. కానీ వాటినీ ఆదరించేవారున్నారన్న విషయం వాటిని రాసేవారినిచూస్తే అర్ధమవుతుంది. రివ్యూ అన్నదికూడా ఒక వ్యాపారంకాబట్టి దాన్ని శాసించగలిగే అధికారంకూడా వినియోగదారులకు అనగా మనకేఉంటుంది. మనలోని character faultsని వాళ్ళలా డబ్బుచేసుకుంటున్నారు. తెలుసుకోవాల్సింది మనమే. మారాల్సిందీ, మార్చాల్సిందీ మనమే అంతేగానీ నిషేధించడం పరిస్కారంకాదు. ఒకవేళ రివ్యూఅనేది ఒక ఆర్టనుకుంటే అక్కడ తప్పొప్పుల ప్రస్తావనే ఉండదు. సినిమాను మెచ్చే అభిరుచున్నవారికి, సినిమాని మెచ్చిన రివ్యూ సరైనదిగానే అనిపిస్తుంది అలాకానివారికి మీలాగే వెగటూ కలుగుతుంది.
ఏది మంచి సినిమా అన్న ప్రశ్నవేశారు కాబట్టి ఒక చిన్న పిట్టకధ. మొన్నీమధ్య విడుదలైన కమల్ హాసన్ సినిమాకి ఒకానొక సైటువారు ఒక రేటింగు ఇచ్చారు. ఆ ఇచ్చినరేటింగు ఒక పెద్దహీరోగారి పుత్రుడి ప్రధమసినిమాకన్నా బహుతక్కువట. వాసి పరంగా కమల్ హాసన్ సినిమానే మంచిదికదా, దానికి ఎందుకు తక్కువ రేటింగు ఇచ్చావు అంటే అని ఎవరో ఆదిగితే, సైటాయన కమల్ సినిమాలో కామెడీ లోపించింది కాబట్టి అని సమాధానమిచ్చాడట. ఒక్కసారి ఊహించండి శంకరాభరణాన్ని అదే సైటాయన రివ్యూచేస్తే గగుర్పాటుకు గురిచేసే పోరాట దృశ్యాలులేవుకాబట్టి రేటుంగు ఒకటిస్తాడేమో!