Thursday, 2 October 2014

మీ పాలిట ప్రతినాయకులం మేము

సంపత్
ఆశిష్ విద్యార్ధి
ప్రదీప్ రావత్
ముఖేష్ రుషి
రాహుల్ దేవ్
షాయాజి షిండే
నాజర్ 
సాయి కుమార్ (తెలుగు సాయికుమార్ కాదు)
ఆదిత్య మీనన్
సోనూ సూద్...................
ఎవరు వీళ్ళంతా? వీరిలో కొంత మందినైనా గుర్తు పట్టారా? ఒకరిద్దరి పేర్లు విన్నట్టు, చూసినట్టు అనిపిస్తున్నాయి కదూ? అవునండి. వీళ్ళంతా మన తెలుగు సినిమా లో ప్రతినాయక పాత్రలు పోషిస్తోన్న నటులు. ఓ దశాబ్దం నుండి మన తెలుగు సినిమాని ఏలేస్తున్నారు మన ఖర్మ కొద్దీ. వీళ్ళలో ఏ ఒక్కరికీ తెలుగు రాదు. తెలుగు రాకపోతే పోయింది కనీసం డైలాగులన్నా తెలుగులో చెప్తారా అంటే అదీ లేదు. చక్కటి హిందీలో చెపుతారు. దాన్ని చక్కగా కవర్ చేయడానికి మన డబ్బింగు ఆర్టిస్టులు ఉండనే ఉన్నారుగా. యింకో దారుణమైన విషయమేమిటంటే సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమాలో నటించిన అందరూ ప్రమోషనుకి వస్తారు గానీ ఈ సదరు పర భాషా ప్రతినాయకులు మాత్రం అస్సలు రారు. పోనీ నటనలో విరగదీస్తారా అంటే అదీ లేదు. అందరిదీ ఒకటే మూస నటన. ఒక రావు గోపాలరావు, ఒక కైకాల సత్యనారాయణ, ఒక ప్రభాకర్ రెడ్డి, ఒక రాజనాల లాంటి వారిని చూసి, వారి నటన తో పులకరించిపోయిన మనం మన దరిద్రం కొద్దీ ఈ పర భాషా విలన్లను కూడా భరించేస్తున్నాం.

2 comments:

  1. మీ బాధ పోగొట్టడానికే జగపతిబాబు సాహసం చేస్తున్నాడు కదా ?

    ReplyDelete
    Replies
    1. ప్రతీ సినిమాలోనూ జగపతిబాబు సాహసమే కనిపిస్తోంది. యింకెవరూ లేరంటారా?!

      Delete