Monday, 6 October 2014

ప్రవేశం నిషిద్దం!

ఓ ప్రక్కన ఆఫీసుకి టైమైపోతుంటుంది. ట్రాఫిక్కుని దాటుకుంటూ ఓ సందులోకి ఎంటరవుతాము. ఎందుకంటే ఆ సందు గుండా వెళితేనే ఆఫీసు వస్తుంది మరి. ఆ సందెమ్మటే వెళుతుంటే దారికి అడ్డుగా ఓ టెంటు వేసి ఉంటుంది. అక్కడ ఏ అన్న దాన కార్యక్రమమో, పెళ్ళో, లేక రజస్వల వేడుక లాంటిదేదో జరుగుతుంటుంది. పోనీ ఓ ప్రక్కనించి వెళ్ళిపోదామా అంటే ఏ మాత్రం వీలు లేకుండా బల్లలు కుర్చీలు అడ్డుగా పెట్టేసుంటారు. అది దాటుకొని వెళ్ళాలంటే మీరు మళ్ళీ వెనక్కొచ్చి యింకో నాలుగు సందులు దాటి చుట్టూ తిరిగెళితే గానీ ముందుకి వెళ్ళ లేరు. యిలాంటివి నెలకి కనీసం రెండైనా జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు రోడ్డుకి అడ్డంగా యిలా టెంటులు గట్రా వేసేయడం వలన ఆ రోడ్డులో వెళ్ళే వాళ్ళకి ఎంత యిబ్బందిగా ఉంటుందో ఏమాత్రం ఆలోచించరు సరికదా అడిగితే అడ్డంగా వాదనకు దిగుతారు. ఆ రోజంతా - అంటే ఆ ఫంక్షను జరుగుతున్నంత సేపూ జనాలు నరకం చూడాల్సిందే. తప్పదు.    

3 comments:

  1. దీనినే ప్రజల్లో సామాజికబాధ్యత కొరవడటం అంటాము.

    ReplyDelete
  2. దీన్ని మనం భారతీయత అనవచ్చు. ఎందుకంటే దీన్ని మనం ఏ పాశ్చాత్య దేశంలోనూ చూడం (లాటిన్ అమెరికాలు దక్క).

    ReplyDelete