Monday, 13 October 2014

'నో బాల్' పడినా నాకు సంబంధం లేదు

యిది క్రికెట్టుకి సంబంధించింది. బౌలరు బాలింగు వేసేటప్పుడు అంపైరు అతడిని 'నో' బాలు వేస్తున్నాడో లేదో చూస్తాడు. ఆ తర్వాత అతను వేసిన బంతిని గమనిస్తాడు. యిదంతా మనకి తెలిసిన విషయమే. కాకపోతే బౌలరు 'నో' బాలు వేస్తున్నాడా లేదా అని చూసి రెప్పపాటులో మళ్ళీ అతను వేసే బంతిని చూడటం అంపైరుకి కొంచెం కష్టమే కదా? దాని బదులు 'నో' బాలు ఒక్క దానిని థర్డ్ అంపైరుకి వదిలేస్తే ఎలా ఉంటుంది? అంటే ఏమీ లేదు. మీరు టెన్నిసు చూస్తుంటారు కదా? టెన్నిస్ బంతి లైను మీద పడిందో లేదా లైను బయట పడిందో చూడటానికి టెలివిజను రీ-ప్లే పద్దతి ఒకటుంది కదా? దాన్నే 'లైను అంపైరు' అని అంటారనుకుంటా నాకు సరిగ్గా తెలీదు. అలాంటి పద్దతి క్రికెట్టులో కూడా ప్రవేశపెడితే బాగుంటుంది కదా?  బౌలరు లైను దాటి బంతి వేసిన వెంటనే 'రెడ్ లైట్' వెలిగితే సరి అతను 'నో' బాల్ వేసినట్టన్నమాట. చక్కగా అంపైరుకి ఏకకాలంలో రెండింటిని చూసే శ్రమ తప్పుతుంది, 'నో' బాలుని ఖచ్చితంగా నిర్ణయించే అవకాశమూ - రెండూ కలిసొస్తాయి. ఏమంటారు? 

2 comments:

  1. మంచి సమస్యనే ప్రస్తావించారు. కాని టెన్నిస్ లో "లైన్ అంపైర్" మనిషేనండీ, యంత్రం / టీవీ కాదు.

    మీరన్నట్లు క్రికెట్ లో మెయిన్ అంపైర్ మాత్రం రెప్పపాటులో అన్నీ గమనించి సకాలంలో నిర్ణయం తీసుకోవాలి. అతని తల చుట్టూ కళ్ళుండాలేమో అనిపిస్తుంది. కష్టతరమైన ఉద్యోగమే పాపం. ఇప్పుడంటే కంప్యూటర్లు, స్టంపుల దగ్గర కెమేరాలు, రీప్లేలు, థర్డ్ అంపైర్ల సహాయం అందుబాటులో ఉన్నాయి మెయిన్ అంపైర్కి. ఇవేవీ లేని రోజుల్లో కూడా అంపైరింగ్ సమర్ధవంతంగా చేసేవారు.

    ఇక "నో బాల్" సంగతి "థర్డ్ అంపైర్" కి అప్పగిస్తే, అతను స్క్రీన్ మీద చూసి మాత్రమే నిర్ణయం తీసుకోగలుగుతాడు (దూరంగా పెవిలియన్ లో కూర్చునుంటాడు కాబట్టి). ఆ పద్ధతిలో తేల్చుకుని, "నో బాల్" అనిపిస్తే మీరు చెప్పిన "రెడ్ లైట్" స్విచ్ నొక్కడానికి టైం ఉండదేమో లైవ్ సిచ్యుయేషన్ లో. అప్పటికే బంతి బాట్స్మన్ని సమీపించేస్తుంది. బాట్స్మన్ కి కనపడేటట్లు "రెడ్ లైట్" మైదానంలో ఎక్కడ అమర్చాలి అన్నది కూడా సమస్యే. మరి ఇంకా సమర్ధవంతమైన టెక్నాలజీ వచ్చి దీనికేమైనా మరింత వేగవంతమైన మార్గం చూపించగలుగుతుందేమో భవిష్యత్తులో?
    "నో బాల్" నిర్ణయం డ్యూటీ "లెగ్ అంపైర్" కి అప్పగించినా ప్రయోజనం ఉండదు, బౌలర్ని ఎదుర్కొంటున్న బాట్స్మన్ లెగ్ అంపైర్ని / అతని సైగల్ని చూడలేడు కాబట్టి.
    అలాగే "ఎల్ బీ డబ్ల్యూ" నిర్ణయం గూడా ఇంత కష్టతరమైనదే, రెప్పపాటులో గమనించవలసినదే (ఈ రోజుల్లో అంటే "థర్డ్ అంపైర్" సహాయం ఉన్నది, అది వేరే సంగతిలెండి).

    ReplyDelete
  2. విన్నకోట నరసిం హారావు గారు ముందుగా మీ కామెంటుకి నా ధన్యవాదములు. యిక నేను ప్రస్తావించిన నో బాలు విషయానికొస్తే ఈ పోస్టుని నేను సరైన రీతిలో పెట్టలేదేమో అనిపించింది. నేను చెప్పాలనుకున్నదేంటంటే "టెన్నిస్ ఆటలో ఆటగాడు సర్వీసు చేస్తున్నప్పుడు అతను పొరపాటున లైను నొక్కితే ఆటోమేటిక్ గా ఒక బీప్ శబ్ధం వస్తుంది. దాంతో అతను తిరిగి సర్వీస్ చేస్తాడు. (లైను అంపైరు అని దాన్నే ప్రస్తావించాను. కానీ నేను చెప్పింది తప్పు అని నాకు అర్ధమయ్యింది). నేను చెప్పాలనుకున్నదేంటంటే సర్వీస్ చేసేటప్పుడు లైను నొక్కితే ఆటోమేటిక్ గా ఎలాగైతే సౌండు వస్తుందో అలాంటి విధానమే బౌలరు లైను దాటగానే ఎర్రలైటు లాంటిది వెలిగితే (సౌండు అంత మంది జనంలో వినబడదు కాబట్టి) బాగుంటుంది అని చెప్పాను.

    ReplyDelete