Monday 6 October 2014

మిక్స్ డ్ క్రికెట్

క్రికెట్టంటే పిచ్చ ఉన్న దేశం పేరు చెప్పండి ? మరో మాట లేకుండా అందరూ చెప్పే సమాధానం "భారత దేశం". అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ యిందులో చిన్న సవరణ ఉంది. అదేంటంటే మనోళ్ళు క్రికెట్టంటే పడి చస్తారు గానీ కేవలం మగవాళ్ళు ఆడే క్రికెట్టంటే మాత్రమే పడి చస్తారు. ఆడవాళ్ళు అంటే మహిళా క్రికట్టంటే ఏమాత్రం చూడరు గాక చూడరు. వాళ్ళు ఆడిన ఏ క్రికెట్టు మ్యాచైనా జనాలు లేక వెలవెల పోతుంటాయి. వాళ్ళు ఎన్ని సెంచరీలు కొట్టినా, ఎన్ని కప్పులు గెలిచినా వాళ్ళకు మిగిలేది మాత్రం శూన్యం. మరి వీళ్ళని పమోట్ చేసేదెలా? ఒక్క రోజులో అది సాధ్యం కాదు గానీ నాకొక ఆలోచన ఉంది. అదేంటంటే "IPL మ్యాచుల్లో మహిళా క్రికెటర్లను కూడా భాగస్వామ్యుల్ని చేయాలి". ఎలా ఉంది? అంటే మనకున్న భారత మహిళా క్రికెట్ టీము మెంబర్లు అంటే సుమారు 15 లేక 16 మందిని తలా ఒక టీములో ఆడనిచ్చే అవకాశమివ్వాలి. అలా చేయడం వలన వాళ్ళ ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుంది. వాళ్ళకంటూ ఓ ఇమేజ్ వస్తుంది. తద్వారా వాళ్ళు మహిళా క్రికెట్ ఆడినపుడు ఆ ఇమేజ్ ఉపయోగపడి వాళ్ళు ఆడే మ్యాచుల్ని ఎక్కువమంది చూసే అవకాశముంటుందని నా అభిప్రాయము. ఏమంటారు? 

2 comments:

  1. భారీ ప్రైజ్ మనీతో ఆడవాళ్ళకూ వేరే IPL నిర్వహిస్తే జనం బాగానే చూస్తారు. అసలు భారత మహిళలు పదేళ్ళకో క్రికెట్ టెస్ట్ ఆడేటప్పుడు ఎంత వివక్ష ఉన్నదో తెలియటం లేదా?

    ReplyDelete
  2. శ్యామలరావు గారూ. మీరు చెప్పింది అక్షర సత్యం. వివక్ష ఉంది. దానికి తోడు జనాలు కూడా మహిళా క్రికెట్ ని అంతగా ఆదరించడం లేదు. మీరు చెప్పినట్టు భారీ ప్రైజు మనీతో IPL పెడితే జనాలు చూస్తారా అన్నది నాకైతే సందేహమే. ఏది ఏమైనా నేను చెప్పాలనుకున్నది మహిళా క్రికెట్ ని పాపులర్ చేయడం కోసం మాత్రమే మిక్స్ డ్ క్రికెట్ ఉంటే బాగుంటుందని చెప్పడం. మిక్స్ డ్ టెన్నిస్ ఉన్నప్పుడు క్రికెట్ ఉంటే తప్పు లేదుగా?

    ReplyDelete