Saturday 21 December 2013

ఎవరూ దీన్నించి తప్పించుకోలేరు చాలెంజ్ !

మనందరికీ చిన్నప్పట్నుండీ ఏవో ఒక నిక్ నేములు ఉండే ఉంటాయి. స్కూల్ లోనో లేక ఆఫీసులోనో ఎవరో ఒకరు మనకు నిక్ నేం పెట్టే ఉంటారు. ఎవరూ దీనికి అతీతులు కారు. ప్రతీ ఒక్కరూ ఈ నిక్ నేముల బారిన పడిన వారే (పడాల్సిన వారే). కాకపోతే ఈ పేర్లు మనకి ఇబ్బంది పెట్టనంత వరకూ ఓకే. అలా కాక మనలోని వైకల్యాన్నో లేక జబ్బు పేరో సూచిస్తూ నిక్ నేములు పెడితేనే యిబ్బంది. యింతకీ విషయమేమిటంటే చిన్నప్పుడు అంటే 10 వ తరగతి చదివేటప్పుడు PUMA అనే పేరుగల T-shirt వేసుకొని స్కూల్ కి వెళ్ళాను.
అంతే అప్పట్నించి నా పేరు puma అయిపోయింది. మొదట్లో నాకూ సరదాగానే ఉండేది అందరూ అలా పిలుస్తుంటే, కానీ తర్వాత తర్వాత ఆ పేరు నెమ్మదిగా నేను భయపడే స్టేజికెళ్ళిపోయింది. నా అసలు పేరు అందరూ దాదాపుగా మర్చిపోయారు. ప్రతీ ఒక్కరూ puma అనే పిలిచేవారు. చివరికి అదెంత దూరం వెళ్ళిందంటే నా అసలు పేరు కన్నా ఈ పేరుతోనే గుర్తు పట్టేవారు జనం. చివరికి దీన్నించి తప్పించుకోవటానికి వాళ్ళతో "puma అంటే అర్ధం తెలుసా ? ఇంగ్లీషులో దానికి "సింహం" అని అర్ధం" అని ఓ అబద్ధం చెప్పేవాడిని. అలా అయినా పిలవటం ఆపుతారేమోనని.  ఊహూ! వింటేగా?!

పరాకాష్ట ఏమిటంటే నా కోసం మా యింటికి నా స్కూల్ మేట్ (క్లాస్ మేట్ కాదు) వచ్చి మా అమ్మ గారితో "puma ఉన్నాడాంటీ? అని అడిగాడంట. మా అమ్మ గారికి అర్ధం కాక puma ఎవరు బాబు? అని వాడిని అడిగితే "అదేనండి 10 వ తరగతి చదువుతాడు - అతని పేరు puma అన్నాడంట. మా అమ్మ గారికి విషయం అర్ధమయ్యి కొంచెం కోపంగా "అతని పేరు puma నో ఉమానో కాదు "వర ప్రసాద్" అని చెప్పారంట. అందుకా అబ్బాయి "అవునాండి? నాకు యింతవరకూ తెలీదoడి. మీ అబ్బాయి పేరు నిజంగానే puma అనుకున్నాను" అన్నాడంట. అదీ విషయం.        

5 comments:

  1. "మొదట్లో నాకూ సరదాగానే ఉండేది అందరూ అలా పిలుస్తుంటే, కానీ తర్వాత తర్వాత ఆ పేరు నెమ్మదిగా నేను భయపడే స్టేజికెళ్ళిపోయింది."
    నిజమే వరప్రసాద్ గారు చాలంజ్ కి అవసరం లేదు .... ఏకీభవిస్తున్నాను.
    వరప్రసాద్ దాసరి! శుభోదయం!

    ReplyDelete
  2. ధన్యవాదములు చంద్ర వేముల గారూ

    ReplyDelete
  3. పాటలు బాగా పాడేదాన్నని నన్ను కోకిల అనే నిక్ నేమ్ తో పిలిచేవారు..!:)

    ReplyDelete
  4. హాయ్ ప్రసాద్ . చిన్ననాటి ఙ్ఞాపకాలు బాగున్నాయి

    ReplyDelete