యిది చదివిన తరువాత మీకు కొంచెం బాధగా ఉండొచ్చు కానీ నేను చెప్పబోయే విషయం మాత్రం కఠోర వాస్తవం. యింతకీ విషయమేమిటంటే మీరు ఎప్పుడైనా మీ పిల్లలలతో ఎవరైనా తెలిసిన వాళ్ళ యింటికి వెళ్ళడం గానీ లేదా వాళ్ళు మీ యింటికి గానీ రావడం జరిగితే అక్కడ మీకొక సీన్ ఎదురవుతుంది. ఆ సదరు తెలిసిన వాళ్ళు (స్నేహితుడు కావచ్చు బంధువు కావొచ్చు) మీ పిల్లలతో చాలా సరదాగా ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు. మరీ చిన్న పిల్లలైతే 'ఓంటమ్మా నీ పేరేంటమ్మా? ఆం తిన్నావా? లాల తాగావా? ఆచ్చెల్లావా?" లాంటి ప్రశ్నలు వేసి వాళ్ళతో చక్కగా గడుపుతారు. అదే కొంచెం పెద్ద పిల్లలతో అయితే " ఏమ్మా ఏం చదువుతున్నావు? మీ స్కూల్ పేరెంటి? బాగా చదవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలి. మీ డాడీని చూడు ఎంత కష్టపడుతున్నారో మీ కోసం. ఆయనకి మంచి పేరు తీసుకు రావాలి." యిలాంటి మాటలతో చాలా తీయగా మాట్లాడతారు. పిల్లలతో పాటు మిమ్మల్నీ తెగ సంతోషపెడతారు, మంచి సోపేస్తారు.
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
Wednesday, 29 January 2014
Tuesday, 28 January 2014
ఇంట్లో యింకో రకం టిఫిన్ తయారు చేయరుగా మరి?
ఏదైనా టిఫిన్ హోటల్ కి వెళ్ళండి. అక్కడ జనాలని గమనించండి. వారిలో ఏ ఒక్కరూ ఒక సారి తిన్న టిఫిన్ ని మళ్ళీ తినరు చూడండి. అంటే ఓ ప్లేట్ ఇడ్లీయో పూరీయో తిన్నవాడు అవి ఎంత బాగున్నా రెండో ప్లేట్ మాత్రం తినడు. వేరే రకం టిఫిన్ తింటాడు. కేవలం ఇంట్లో మాత్రమే తిన్నవే ఇంకా తింటాడు.
Monday, 27 January 2014
చిన్న సినిమాని బ్రతికించడం ఎలా?
ఈ క్రింద పేర్కొన్న ఐడియాలనుకోండి,
సూచనలనుకోండి సమాజానికి ఉపయోగపడతాయని నేను భావించి వ్రాస్తున్నవి. వీటిలో కొన్ని సిల్లీ గానూ, హాస్యాస్పదంగా అనిపిచ్చుండొచ్చు.
మీలో కొంత మందికి వీటికంటే యింకా మంచి ఐడియాలు కలిగివుండవచ్చు. కానీ వీటిమీద మీ అభిప్రాయాలను
నాతో తప్పకుండా పంచుకుంటారు కదూ.
"చిన్న సినిమాని బ్రతికించండి"
"చిన్న సినిమా మనుగడకు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి"
"చిన్న సినిమాకు రాష్ట్రంలో థియేటర్లు దొరకడం లేదు."
తరచుగా చిన్న సినిమా నిర్మాతల నుండి మనకు వినిపించే మాటలు. నిజమే. చిన్న సినిమాకు థియేటర్లు దొరకడం లేదు. దొరికినా అరకొర వసతులుండే థియేటర్లు మాత్రమే దొరుకుతున్నాయి. కారణం ఉన్న మంచి థియేటర్లు అన్నీ పెద్ద సినిమాలకే (???) కేటాయించేస్తున్నారు. అవి ఆడినంత కాలం వేరే సినిమాలకి అంటే చిన్న సినిమాలకి రిలీజ్ చేసే పరిస్థితి ఉండడంలేదు. మరి దీన్ని ఎలా అధిగమించాలి? వస్తున్నా. చాలా కాలం క్రితం అంటే ఓ యిరవై ఏళ్ళ క్రితం ఒక థియేటరులో 4 ఆటలుంటే 3 ఆటలు మెయిన్ సినిమా వేసేవారు - మార్నింగ్ షో మాత్రం వేరే సినిమా వేసేవారు. దాన్నే కొంచెం అటూ యిటూ మార్చి ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్లలో రెండు ఆటలు ఒక సినిమాని, రెండు ఆటలు యింకో సినిమాని ఆడిస్తున్నారు. మామూలు థియేటర్లకి కూడా యిదే పద్ధతి లో సినిమాలని ఆడిస్తే బాగుంటుంది కదా. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే 3 ఆటలో లేక రెండు ఆటలో పెద్ద సినిమా ని ఆడించి ఒకటో లేక రెండో ఆటలు చిన్నసినిమాకి కేటాయిస్తే బాగుంటుంది కదా? దాని వల్ల చిన్న సినిమా కూడా మంచి థియేటర్లో ప్రదర్శనకి నోచుకుంటుంది కదా?
Friday, 24 January 2014
ఏం చేస్తాం ! మా కాళ్ళు ఆ విధంగా డిజైన్ చేయబడ్డాయి మరి !
బస్ స్టాపుల్లోనూ రైల్వే స్టేషనులోనూ గంటలు గంటలు నించొని వాటి కోసం అత్యంత ఓపిగ్గా నించొని (కూర్చునే అవకాశమున్నా సరే) నిరీక్షించే జనం బస్సు లేదా రైలు ఎక్కిన తర్వాత మాత్రం సీటు కోసం తెగ హైరానా పడిపోతారు (పదిహేను నిమిషాల ప్రయాణం అయినా సరే)
Tuesday, 21 January 2014
లాభ నష్టాలు
క్రొత్తగా వ్యాపారము చేయాలనుకొనేవాడు ముందుగా చూడాల్సింది అందులో రాబోయే లాభాలను గురించి కాదు - అందులో రాబోయే నష్టాల గురించీ, వాటిని ఎంత వరకు తాను భరించగలిగే సామర్ధ్యమున్నదో అని. ఆ అప్రమత్తత ఉన్నవాడికి లాభాలు వాటంతట అవే వస్తాయి.
Sunday, 12 January 2014
బెబ్బే
మనిషి తన మేధస్సుతో ఎంతో పురోగతి సాధించినా కొన్ని విషయాల్లో మాత్రం యిప్పటికీ పైచేయి సాధించలేకపోయాడు. అందులో మచ్చుకి కొన్ని :
1. ఉప్పు నీటిని మామూలు నీటిగా మార్చలేకపోవడం
2. ఉప్పు వలన, నూనె వలన అనారోగ్య సమస్యలుంటాయని రుజువైనా దానికి ప్రత్యామ్నయము
సృష్టించలేకపోవడం.
3. పెట్రోల్ కి ప్రత్యామ్నయము సృష్టించలేకపోవడం.
1. ఉప్పు నీటిని మామూలు నీటిగా మార్చలేకపోవడం
2. ఉప్పు వలన, నూనె వలన అనారోగ్య సమస్యలుంటాయని రుజువైనా దానికి ప్రత్యామ్నయము
సృష్టించలేకపోవడం.
3. పెట్రోల్ కి ప్రత్యామ్నయము సృష్టించలేకపోవడం.
Sunday, 5 January 2014
సతీ సావిత్రి
'మంచు కొండల్లోన చంద్రమా
చందనాలు చల్లిపో.....'
ఎఫ్ ఎం లో m.m.శ్రీలేఖ పాడిన పాట వస్తోంది. అప్పుడు సమయం ఉదయం ఆరు గంటలు. చిన్నగా హం చేస్తూ స్టౌ మీద కాఫీ పెడుతోంది సావిత్రి. అది తనకెంతో యిష్టమైన పాట. తన భర్త శేఖర్ ఓసారి అన్నాడు 'ఇష్టమైన పాటల్ని అలా కూనిరాగాలు తీసే బదులు సిస్టం లో కాపీ చేసుకోవచ్చు కదా? నీకిష్టమైనప్పుడు వినొచ్చు ' అని.
తను ఒప్పుకోలేదు.
ఏo? ఎందుకు అని అడిగాడు.
'మనకిష్టమైన పాటలు యింట్లోనే ఉంటే ఎప్పుడుబడితే అప్పుడు వినేస్తాం. కొన్నాళ్ళకి బోర్ కొట్టేస్తాయి. యిలా అప్పుడప్పుడు వింటేనే వాటికి విలువ' అంది.
శేఖర్ కి మతి పోయింది ఈ లాజిక్కి. వెంటనే అడిగాడు
'మరి నేను?'
సావిత్రికి అతనేం అడుగుతున్నాడో అర్ధం కాక
'మీరేంటి?'
'నేను యిన్నాళ్ళ నుండి నీతోనే ఉన్నాను కదా? మరి నేను కూడా బోర్ కొట్టేసానా?'
ఒక్క క్షణం శేఖర్ ని చూసి 'నేను చెప్పేది నాకిష్టమిన వాటి గురించి బాస్!' అంది కన్ను కొట్టి.
ఆమె చెప్పింది అర్ధమయ్యేటప్పటికి శేఖర్ కి కొద్ది సమయం పట్టింది. 'ఏయ్ నిన్నూ...... ' అంటూ ఆమె చెవి మెలి తిప్పాడు.'
సావిత్రికి నవ్వుకొంది అది గుర్తొచ్చి.
కాఫీని రెండు కప్పుల్లో పోసి బెడ్ రూం కి వెళ్ళింది. పిల్లలిద్దరూ శేఖర్ కి చెరో వైపున పడుకొనున్నారు. యిద్దరూ శేఖర్ మీద కాళ్ళు వేసుకొని ఉన్నారు. సావిత్రికి ఆ దృశ్యం ఎంతో అపురూపంగా అనిపించింది. యిప్పుడే కాదు ఎన్ని సార్లు చూసినా అలాగే అనిపిస్తుంది.
'ఏమండీ...'
'ఊ' అన్నాడు శేఖర్. అన్నాడే గానీ లేవలేదు.
'ఏమండోయ్' మళ్ళీ లేపింది.
'ఊ.... ఏంటి? అడిగాడు శేఖర్.
'లేవండి కాఫీ తాగండి.'
'కాసేపున్నాక తాగుతాను. పడుకోనీ......' పడుకొనే చెప్పాడు శేఖర్.
'ప్రయాణం ఉంది మర్చిపోయారా?'
వెంటనే లేచి కూర్చున్నాడు. రెండు నిమిషాల్లో కాఫీ తాగేసి బాత్రూం కి వెల్లిపోయాడు శేఖర్.
వాళ్ళిద్దరికీ పెళ్ళయి ఏడేళ్ళవుతోంది. వారిద్దరికీ యిద్దరు పిల్లలు. ఒకమ్మాయి ఒకబ్బాయి. పాపకి ఐదేళ్ళు బాబుకి రెండేళ్ళు. అతనో ప్రభుత్యోద్యోగి. జీతం తో పాటు 'గీతం' కూడా తోడయ్యి వాళ్ళ జీవితం బానే గడిచిపోతోంది మధ్యతరగతికి కాస్త పైనే. ఒక వారం రోజులు ఆఫీసు పని మీద ఉత్తరాఖండ్ వెళుతున్నాడు. పుణ్య క్షేత్రాలు ఉంటాయి కదాని ఫ్యామిలీ ని కూడా తీసుకెల్దామనుకున్నాడు కానీ పాపకి పరీక్షలు ఉండటంతో తానొక్కడే వెళ్ళక తప్పడం లేదు. పదకొండు గంటలకి ట్రైను. అతని ప్రయాణానికి కావల్సినవన్నీ ఏర్పాటు చేసింది. అతనికి సెండాఫివ్వటానికి పిల్లలతో సహా బయల్దేరింది సావిత్రి.

Friday, 3 January 2014
మా'స్టారు'
అదొక గవర్నమెంటు మున్సిపల్ స్కూల్. పేరుకు రాజమండ్రిలోనే ఉంది కానీ ఉంది కానీ లోపలికి వెళితే ఒక రకమైన పళ్ళెటూరి వాతావరణం కనిపిస్తుంది. నిజానికి ఆ స్కూలే కాదు దాదాపు అన్ని మునిసిపల్ స్కూళ్ళలోనూ అదే విధమైన పరిస్థితి ఉంటుంది . ప్రైవేటు స్కూళ్ళకీ ఈ స్కూళ్ళకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళకి లేని స్వేచ్చ ఈ స్కూళ్ళో చదివే వారికి బాగా ఉంటుంది. అలా అని ఈ స్కూళ్ళో చదివే వారుండరనీ కాదు, క్రమశిక్షణ ఉండదనీ అసలే కాదు. గొప్ప గొప్ప వాళ్ళంతా యిలాంటి స్కూళ్ళో చదివిన వారే. కొన్నేళ్ళ క్రితం ప్రైవేట్ స్కూళ్ళు ప్రభంజనం లేనపుడు ఈ మునిసిపల్ స్కూళ్ళే రాజ్యమేలాయి. పేదా గొప్ప అనే భేదం లేదుండా అందరి పిల్లలు ఇక్కడే చదివేవారు. క్రమేణా ప్రైవేటు స్కూళ్ళ హడావిడి పెరిగాక వీటి ప్రాబల్యం తగ్గిపోయి డబ్బున్నోళ్ళంతా తమ పిల్లల్ని వాటిలో చేర్చేసారు. ఫలితం- మున్సిపల్ స్కూళ్ళు కేవలం పేదవారి బడిగా మిగిలిపోయింది. అరకొర వసతులతో అలాగే నెట్టుకోస్తున్నారు అక్కడి మాస్టార్లు.
అది పదో గరగతి A సెక్షన్. పిల్లలంతా ఓ వ్యక్తి కోసం ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ వ్యక్తి కొత్తగా రాబోయే లెక్కల మాస్టారు. పేరు 'శంకర నారాయణ'. యింతకు ముందు లెక్కల మాస్టారిగా పని చేసిన భాస్కర రావు మాస్టారికి వేరే ఊరికి ట్రాన్స్ ఫర్ అవటంతో కొత్త మాస్టారు వచ్చారు. తెల్లగా ఎత్తుగా ఆకట్టుకొనే రూపంతో ఉన్నారు 'శంకర నారాయణ' మాస్టారు.

Wednesday, 1 January 2014
2014 నూతన సంవత్సర శుభాకాంక్షలు
పాఠక దేవుళ్ళకి మరియు మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నూతన సంవత్సర
శుభాకాంక్షలు.
గత సంవత్సరము సెప్టెంబరులో మొదలు పెట్టిన నా బ్లాగు మీ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళ్ళిపోతోంది. మీ ఆదరణ, అభిమానము ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ.............
మీ
వరప్రసాద్ దాసరి.
గత సంవత్సరము సెప్టెంబరులో మొదలు పెట్టిన నా బ్లాగు మీ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళ్ళిపోతోంది. మీ ఆదరణ, అభిమానము ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ.............
మీ
వరప్రసాద్ దాసరి.
Subscribe to:
Posts (Atom)