యిది చదివిన తరువాత మీకు కొంచెం బాధగా ఉండొచ్చు కానీ నేను చెప్పబోయే విషయం మాత్రం కఠోర వాస్తవం. యింతకీ విషయమేమిటంటే మీరు ఎప్పుడైనా మీ పిల్లలలతో ఎవరైనా తెలిసిన వాళ్ళ యింటికి వెళ్ళడం గానీ లేదా వాళ్ళు మీ యింటికి గానీ రావడం జరిగితే అక్కడ మీకొక సీన్ ఎదురవుతుంది. ఆ సదరు తెలిసిన వాళ్ళు (స్నేహితుడు కావచ్చు బంధువు కావొచ్చు) మీ పిల్లలతో చాలా సరదాగా ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు. మరీ చిన్న పిల్లలైతే 'ఓంటమ్మా నీ పేరేంటమ్మా? ఆం తిన్నావా? లాల తాగావా? ఆచ్చెల్లావా?" లాంటి ప్రశ్నలు వేసి వాళ్ళతో చక్కగా గడుపుతారు. అదే కొంచెం పెద్ద పిల్లలతో అయితే " ఏమ్మా ఏం చదువుతున్నావు? మీ స్కూల్ పేరెంటి? బాగా చదవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలి. మీ డాడీని చూడు ఎంత కష్టపడుతున్నారో మీ కోసం. ఆయనకి మంచి పేరు తీసుకు రావాలి." యిలాంటి మాటలతో చాలా తీయగా మాట్లాడతారు. పిల్లలతో పాటు మిమ్మల్నీ తెగ సంతోషపెడతారు, మంచి సోపేస్తారు.
కానీ యిదంతా నిజమనుకుంటున్నారా? అంటే వాళ్ళు నిజంగానే మీ పిల్లల మీద ప్రేమ వలకబోస్తున్నరనుకుంటున్నారా? పచ్చి అబద్ధం. అదంతా మీ ముందు ప్రదర్శించే నటన మాత్రమే. పిల్లల ప్రక్కన మీరున్నారు కాబట్టే అలా చేస్తారు. నమ్మరా? కావాలంటే మీరు లేనప్పుడు మీ పిల్లలతో వారెలా ప్రవర్తిస్తారో గమనించండి. మీ కళ్ళని మీరే నమ్మలేరు. మీరు ఉన్నప్పుడు అంత ఆప్యాయంగా మాట్లాడిన వీళ్ళేనా అని మీకు అనిపించడం ఖాయం. చాలా సీరియస్ మొహంతో పొడి పొడిగా మాట్లాడతారు. వీలైనంత వరకు వాళ్ళని ఎంత త్వరగా వదిలించుకుందామా అన్నట్లు ప్రవర్తిస్తారు. అంతే కాదండోయ్. మీ గురించి అడిగేటప్పుడు ఏమంటారో తెలుసా? "ఏరా. మీ నాన్నున్నాడా? (కొంచెం నాటుగాడైతే "మీ బాబేడ్రా?") అని అడుగుతారు. మళ్ళీ మీరు అక్కడికి వస్తే మాత్రం మళ్ళీ మామూలే. "ఓంటమ్మా.. స్కూల్ కెళ్ళలేదా? పాలు తాగావా?" .
మీరు నమ్మకపోయినా యిది నిజం.
(యిది అందరి గురించి కాదు. కేవలం కొంత మందిని ఉద్దేశ్యించి వ్రాసింది మాత్రమే.)

true..
ReplyDeletethank you devi garu
Delete