Wednesday 29 October 2014

FAMILY కి తెలుగులో యింకో అర్ధముంది తెలుసా?

ఫ్యామిలీకి తెలుగులో యింకో అర్ధముంది తెలుసా?
అవును. కొన్ని ఇంగ్లీషు పదాలకు తెలుగులో అర్ధాలు మరోలా ఉంటాయి. కాదు. అలా అన్వయించేస్తుంటారు మన తెలుగోళ్ళు. ఇంగ్లీషులో ఫ్యామిలీ అంటే నాకు తెలిసీ కుటుంబమని అర్ధం. కానీ చాలా మంది పెళ్ళైన వాళ్ళు ఫ్యామిలీకి యింకో అర్ధం చెపుతారు. వాళ్ళ దృష్టిలో ఫ్యామిలీ అంటే "భార్య" అని అర్ధం. అవును. వినడానికి విడ్డూరంగా ఉన్నా యిది నిజం. "నిన్న రాత్రి నేనూ మా ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాము", మా ఫ్యామిలీ ఆఫీసుకెళ్ళింది", "మ ఫ్యామిలీ చాలా స్ట్రిక్టు గురూ". యిలాంటి మాటల్లో "ఫ్యామిలీ" అంటే కుటుంబమనుకుంటున్నారా? కానే కాదు. వాళ్ళ దృష్టిలో ఫ్యామిలీ అంటే భార్య అని. ఇదే దారుణమనుకుంటే కొంత మంది తమ భార్యలను ముద్దుగా "లేడీస్" అని చెపుతుంటారు. "మా లేడీసు వచ్చారు", "మొన్న మా లేడీస్ తో ఊరెళ్ళాను" అంటుంటారు.  మొత్తానికి "భార్య" ని "భార్య"  అని చెప్పుకోవడానికి వచ్చిన తంటాలు యివి.
ఏమిటో.......????!!!!  

3 comments:

  1. అంటే మన సమాజం లో భార్య ను ఏకవచనం తో ఇతరుల దగ్గర సంభోదిస్తే చటుక్కున ఎదుటి వారు ఏదన్నా గొణిగే ప్రమాదం ఉంది .అందుకే ఇలా ఫ్యామిలీ అంటారు .

    ReplyDelete
  2. భార్య అన్నపదం ఏదో గ్రాంధిక పదంలా ఉంటుంది. అసలు అభార్య అన్న పదాన్ని పుస్తకాల్లో రాయడానికి తప్ప, spoken teluguలో ఏప్రాంతంవారైనా వాదుతారో లేదూ!.

    ఇక మిగిలింది "మా ఆవిడ", "నా పెళ్ళాం". మొదతిది వాడుతున్నారు. రెండొది దాదాపు బూతుగా పరిగణిస్తున్నారు. చదువుకున్నోళ్ళు నైసుగా "మై వైఫు", అనో ఇలా ఎనభైల ఇస్టైల్లో "మా ఫ్యామిలీ" అనో అంటున్నారు.

    ReplyDelete