Tuesday 5 November 2013

మరి సమోసాలకి బదులు ఏమి అమ్మాలి?

ఈ క్రింద పేర్కొన్న ఐడియాలనుకోండి, సూచనలనుకోండి సమాజానికి ఉపయోగపడతాయని నేను భావించి వ్రాస్తున్నవి. వీటిలో  కొన్ని సిల్లీ గానూ, హాస్యాస్పదంగా అనిపిచ్చుండొచ్చు. మీలో కొంత మందికి వీటికంటే యింకా మంచి ఐడియాలు కలిగివుండవచ్చు. కానీ వీటిమీద మీ అభిప్రాయాలను నాతో తప్పకుండా పంచుకుంటారు కదూ. 

కూల్ డ్రింక్స్ ఎక్కువ సేల్ అయ్యేది ఎక్కడో మీకు తెలుసా? గుర్తొచ్చిందా? అవును. సినిమా థియేటర్లలో. ఇంటెర్వెల్ టైములో కూల్ డ్రింక్ కి మొఖం వాచిపోయినట్టు తెగ తాగేస్తారు జనం. ఎగబడి ఎగబడీ మరీ కొనుక్కుంటారు. మామూలుగా బయట పద్నాలుగు రూపాయలుండే కూల్ డ్రింక్ అక్కడ మాత్రం యిరవై రూపాయలకు అమ్మినా ఏ మాత్రం ఖాతరు చేయరు.  కానీ ఈ కూల్ డ్రింకుల వలన ఆరోగ్యం పాడవటం తప్ప ఏ విధమైన ప్రయోజనమూ లేదు. అందుకని నాకొచ్చిన ఐడియా చెపుతాను. కూల్ డ్రింక్ స్థానం లో కొబ్బరి బొండాలు అమ్మితే ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యానికి ఆరోగ్యమూ, అమ్మకాలకి అమ్మకాలూ.  ఎలా ఉంది?  

3 comments:

  1. bodi idea evadi kavalu,,,,cool drink companies vurakuntayaa,,,,swamy

    ReplyDelete
    Replies
    1. రతి గారూ మీ అభిప్రాయానికి ధన్యవాదములు. కూల్ డ్రింక్స్ కంపెనీల సంగతి ప్రక్కన పెట్టండి. మీకు ఈ ఐడియా నచ్చిందో లేదో చెప్పండి. అయినా మ(జ)నం తల్చుకొంటే కూల్ డ్రింక్ కంపెనీలు ఏం చేయగలవు చెప్పండి.
      - వరప్రసాద్ దాసరి.

      Delete
  2. Hhaa....oka idea, nee arogyanne marchestundi:-):-):-)

    ReplyDelete