కాశీనాధుని విశ్వనాధ్.....ఈ పేరు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించడం ద్వారా...... తెలుగులో అతికొద్దిమంది గొప్ప దర్శకుల్లో ఆయనొకరు. యిప్పటికీ ఆయన ఒప్పుకుంటే సినిమా తీయడానికి కొంత నిర్మాతలు (ముఖ్యంగా ఎన్నారై లు) ఉన్నారు. కాకపోతే తీయడానికి ఆయనే సిధ్ధంగా లేరనుకోండి. ఆరోగ్యం సహకరించకపోవడం కావొచ్చు లేదా మారిన పరిస్తితుల్లో తీయలేక కావొచ్చు. కారణాలు ఏమైనా ఒక మంచి దర్శకుడిని కోల్పోతున్నారు తెలుగు ప్రేక్షకులు.
సరే... విశ్వనాధ్ తీసిన ఒక సినిమా యిప్పటికీ రిలీజ్ అవలేదంటే నమ్ముతారా? అవును నిజం. 1990 లో షూటింగ్ పూర్తయిపోయినా ఆర్ధిక కారణాల వలనో మరే ఇతర కారణాల వలనో ఆ సినిమా యిప్పటికీ విడుదలకి నోచుకోలేదు. సినిమా పేరు "సిరిమువ్వల సింహనాదం". బాగుంది కదూ?! నాకేమనిపిస్తుందంటే ఆయనతో సినిమా తీయడానికి సిధ్ధపడిన నిర్మాతలు ఈ సినిమానే విడుదల చేయడానికి ప్రయత్నించ్చొచు కదా? సాధ్యం కాదంటారా? కనీసం యిప్పుడు వెబ్ సిరీస్ అంటూ ఒక ట్రెండు మొదలయ్యింది కదా...కనీసం ఆ పధ్ధతిలోనైనా ఈ సినిమాని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే ఆ సినిమా చూసే భాగ్యం మనకి కలుగుతుంది కదా!...
సరే ఆ సినిమా లో నటించిన నటీనటులు ఎవరనే కదా మీ అనుమానం?! చంద్రమోహన్, ఓంపురి....కేవలం వీళ్ళిద్దరే మనకి పరిచయమున్న నటులు.....మిగతా వాళ్ళంతా కొత్తవారే, పరిచయం లేని వారే.
అన్నట్టు ఈ సినిమా షూటింగ్ నేను చూసానండోయ్. నేను నెల్లూరులో EAMCET కోచింగ్ తీసుకుంటున్న సమయంలో ఈ సినిమా షూటింగ్ కస్తూర్బా కళాక్షేత్రం ఆడిటోరియం లో జరిగింది. నాకున్న సినిమా పిచ్చి వల్ల క్లాసులు ఎగ్గొట్టి ఎంచెక్కగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులూ ఆడిటోరియంకు వెళ్ళిపోయేవాడిని. విశ్వనాధ్ గారు ఖాకీ డ్రెస్ వేసుకొని నటీనటులకి సూచనలిచ్చేవారు. హీరో హీరోయిన్లు ఎవరా అని చూస్తే ఒక అందమైన అమ్మాయి కూచిపూడి డ్రెస్ వేసుకొని, ఒక అబ్బాయి కృష్ణుడి డ్రెస్ వేసుకొని స్టేజ్ మీద ఉన్నారు. అది ఒక పాట సన్నివేశం. ఆ అమ్మాయిని చూసి "అబ్బ ఎంత అందంగా ఉందిరా" అనుకొన్నా. దానికి తోడు గొప్ప డాన్సర్. కృష్ణుడి వేషం లో ఉన్న అతడు కూడా బానే ఉన్నా నా దృష్టి అంతా ఆ హీరోయిన్ మీదే ఉండేదనుకోండి. ఓ రెండురోజులు పోయాక పొద్దున్నే అంటే ఉదయం ఏడు గంటలకి షూటింగ్ స్పాట్ లో వెళితే ఓ మతి పోయే దృశ్యం కనిపించింది (అంత పొద్దున్నే ఎందుకెళ్ళానంటారా? మన సినిమా పిచ్చి ఆ రేంజ్ లో ఉండేది మరి) ఒకాయన ఒక చేత్తో టీ తాగుతూ మరో చేత్తో పేపర్ చదువుతున్నాడు. ఆయన మొహం ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. కానీ ఎవరో అర్ధం కాలేదు. ఆ మరుసటి రోజు ఆయన ఇంటర్వ్యూ చదివాక అర్ధమయ్యింది. ఆయన ఆ సినిమాలో హీరో అని.....ముందు రోజు అమ్మాయి గెటప్ లో ఉన్నది కూడా ఆయనే అని. ఆయన పేరు కళాకృష్ణ . అమ్మాయి గెటప్ లో సత్యభామ నృత్యానికి ఆయన ఫేమస్ అని తెలిసింది. యింకో గమ్మత్తేమిటంటే కృష్ణుడి వేషంలో ఉన్న అతను అమ్మాయట. ఆవిడే ఈ సినిమాకి హీరోయిన్ అంట. పేరు మాధవీమాల. అదీ విషయం!
ఈ షూటింగులో చంద్రమోహన్, సాక్షి రంగారావు, నవభారత్ బాలాజీ, కళ్ళు చిదంబరం వీళ్ళందరినీ రోజూ చూసేవాడిని. చంద్రమోహన్ సినిమాల్లోలాగే బయట కూడా చాలా హ్యూమర్ గా ఉండేవాడు. ఒక పెద్దావిడ షూటింగ్ గ్యాప్ లో ఈ సినిమా పేరు ఏమిటి అని చంద్రమోహన్ ని అడిగింది. దానికి ఆయన "సిరిమువ్వల సింహనాదం" అని చెప్పాడు. ఆవిడకి అర్ధం కాక "షినిమూకలా...అదేం పేరు? అని అంది. దాంతో చంద్రమోహన్ ఆవిడకి అర్ధం అయ్యేటట్టు మళ్ళీ సినిమా పేరు చెప్పటానికి ప్రయత్నించాడు...కానీ ఆవిడకి బొత్తిగా అర్ధం అయి చావలేదు. దాంతో చంద్రమోహన్ ఆవిడకి అర్ధమయ్యేటట్టు ఆ సినిమా పేరు మార్చి చెప్పాడు. ఈసారి ఆవిడకి ఎంచక్కా అర్ధమయ్యింది. యింతకీ ఆయన చెప్పిన ఆ సినిమా పేరు ఏంటో తెలుసా ? "సింహపురిలో సింగినాధం". సింహపురి అంటే తెలుసు కదా... నెల్లూరుకి మరో పేరు. సినిమా పేరు బాగుంది కదూ! క్యాచీగా....హ హ హ హ
యింకో అతను వచ్చాడు చంద్రమోహన్ దగ్గరకి (కొంచెం యూత్ కాని యూత్ అన్నమాట) సార్ మీ "చిన్నారి స్నేహం" సినిమా మన నెల్లూరులోనే షూటింగ్ అయ్యింది కదా.. అందుకే పెద్ద హిట్ అయ్యింది. యిప్పుడు ఈ సినిమా కూడా యిక్కడే షూటింగ్ జరుగుతుంది కాబట్టి యిది కూడా పెద్ద హిట్ అవుతుంది సార్" (ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదనుకోండి..అది వేరే విషయం) అన్నాడు. దానికి చంద్రమోహన్ "ఆ నా మొహం! ఏం హిట్టు. కనీసం ఏవరేజ్ గా కూడా ఆడలేదు" అన్నాడు. దానికి ఆ 'యూత్ ' చిన్నబుచ్చుకున్నాడు. కానీ చంద్రమోహన్ చెప్పింది నిజమే. ఆ సినిమా పెద్దగా పోలేదు. ఖచ్చితంగా చెప్పాలంటే "ఫ్లాప్". ఆ సినిమా ఊసు వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఆ సినిమా లో నటించింది ఎవరంటే చంద్రమోహన్, సీత, రఘు అనబడే రెహ్మన్ రాజు తదితరులు. వీళ్ళంతా కాలేజ్ స్టూడెంట్స్ అన్నమాట. హహహహ్హాహ....భలే ఫన్నీ కదూ! ఎప్పుడైనా యూట్యూబ్ లోనో ఇంకెక్కడైనా చూడండి. వీళ్ళు కాలేజ్ కి స్టూడెంట్ల గెటప్ లో.....పుస్తకాలు చేతపట్టుకొని.......భలే ఉంటుంది!
విషయం పక్కదారి పట్టిందనుకుంటాను.... ఈ షూటింగ్ జరుగుతున్ననాళ్ళు విశ్వనాధ్ నే గమనించేవాడిని. ఆయనే నటించి చూపేవారు ....డాన్స్ చేసి చూపేవారు .... మొత్తం అంతా ఆయనే....ఎంతో అంకిత భావమున్న దర్శకుడు.....ఎవరైనా ఆ సినిమాని మనకి చూపించే భాగ్యం కలిపిస్తే బాగుండును!

No comments:
Post a Comment