Monday, 15 May 2017

భలే కనిపెట్టావే!

"లీటరుకు 490 కిలోమీటర్లు నడిచే వాహనాన్ని తయారు చేసిన IIT విద్యార్ధులు"
"నాచు నుంచి పెట్రోల్ తయారు చేసిన ఫలానా సంస్థ"
"ఉప్పు నీటిని మంచి నీటిగా తయారు చేయడానికి అతి తక్కువ ఖరీదుతో యంత్రం తయారీ"
"ఒక్క సారి ఛార్జింగ్ పెడితే 5 రోజులపాటు నిలుచుండే అద్భుతమైన మొబైల్ ని కనిపెట్టిన ఫలానా మొబైల్ కంపెనీ"
"ఎయిడ్స్ కు మందు కనిపెట్టిన ఫలానా డాక్టర్లు"
"పాము విషం నుంచి ఎయిడ్స్ కు మందు కనిపెట్టారు"

యిలాంటి వార్తలు చాలాకాలం నుంచి పేపర్లలోనూ యిప్పుడైతే సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము....చూస్తూనే ఉన్నాము. యిలాంటి వార్తలు చదివి సంతోషం, గర్వంతో ఉప్పొంగిపోతాం. యివన్నీ నిజమైతే ఎంతో ముందుకెళ్ళిపోతాం అనే ఆలోచన మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది....

కానీ మీరు గమనించారో లేదో కానీ యిలాంటి వార్తలు అలా వస్తూనే ఉంటాయి తప్ప ఏ ఒక్కటీ ఆచరణలో వచ్చినట్టు కనబడదు. మరి ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధం కాదు. సదరు వార్తలు చూసి గర్వపడిపోవడం.....కొన్నాళ్ల తరువాత అది మర్చిపోయి మళ్లీ ఇంకో వార్త చూసి మురిసిపోవడం మనకు నిత్య కృత్యంగా మారిపోయింది. 

2 comments:

  1. హ్హ, హ్హ, హ్హ, హ్హ. అటువంటి వార్తలు చదివినప్పుడు నేనూ ఆనందిస్తుంటాను ఇక కష్టాలు తీరబోతున్నాయి కదా అని. కానీ మీరన్నట్లు అవేవీ ప్రొడక్షన్ లోకి తర్జుమా అవుతున్నట్లు లేదు. మరి ఎన్నో సక్సెస్ కథలు వినిపిస్తుంటాయి ఒక ఐడియా జీవితాన్నే మార్చేసిందని. బహుశః ఇవి స్కూల్ సైన్సు లాబ్ లోనో, ప్రాజెక్ట్ వర్క్ కోసమో చేసే లెవెల్ వేమో !? మీడియా చేసే హంగామా ఎక్కువనుకుంటాను.

    ReplyDelete
    Replies
    1. అవును సార్. ప్రతీసారీ ఇదే తంతు

      Delete