అప్పుడెప్పుడో రజనీకాంత్ నటించిన ఓ తమిళ సినిమాని తెలుగులో డబ్ చేసి వదిలారు. దాని పేరు "ముత్తు". భలే విచిత్రంగా అనిపించింది. ఒక తమిళ పేరుతో తెలుగు సినిమా ఏంటి అని? అసలు మన తెగులు... క్షమించండి తెలుగు జనాల స్పందన ఎలా ఉంటుందో అనుకున్నా. కానీ మన తెగులు(ఎన్ని సార్లు ప్రయత్నించినా మళ్ళీ అదే వచ్చేస్తోంది.. సర్థుకుపోండి ) ప్రజలు దాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా దాన్ని సూపర్ హిట్ చేసి పారేశారు. మన దెబ్బకి అరవోళ్ళకే మతి పోయింది. అక్కడ్నించి మొదలు... ఏ మాత్రం అవకాశమున్నా ఓ తమిళ పేరుతో ఓ సినిమాని మన మీదకి వదలడం.... ఎప్పుడెప్పుడు అలాంటి సినిమా వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా చూసి చివరికి దాన్ని ఆదరించిపారేయడం మనకి అలవాటైపోయింది. నిక్కరు కనిపించేలా పై లుంగీలు కట్టుకొని వేసే తమిళ నృత్యాలకి మన వాళ్ళు పులకరించిడం అటుంచి నరనరాన తమిళతనం ఎక్కేస్తోంటే మనవాళ్ళ ఆనందమే ఆనందం! ఒకసారి తమిళ పేర్లతో వచ్చిన సినిమాలు చూడండి ఎంత బాగున్నాయో!
"ఈ" (తమిళం లో దీని అర్ధం ఈగ అని. అదే పేరుతో దీన్ని వదిలారు తెగులోళ్ళ మీద)
"రాఘవన్"
"సూర్య s/o కృష్ణన్"
"రఘువరన్ btech"
"ఐ"
"కబాలి"
ఇవి కాకుండా త్వరలో మన తెగులు వాళ్ళ మీదకు ఓ క్రొత్త సినిమాని వదలబోతున్నారు. దాని పేరు విని తరించండి. ఏంటంటారా "కాదలి" (అర్ధం మాత్రం అడక్కండి (అడగరనుకోండి ఎలాగూ) తెలీదు)
రాబోయే రోజుల్లో శుభ్రంగా తమిళ సినిమాలే వచ్చేస్తాయేమో! (అదే బెటరేమో)
ఇంతకీ బాహుబలి అమ్మ శివగామా? శివకామినా?
లోగుట్టు రాజమౌళికెరుక!
"ఈ" (తమిళం లో దీని అర్ధం ఈగ అని. అదే పేరుతో దీన్ని వదిలారు తెగులోళ్ళ మీద)
"రాఘవన్"
"సూర్య s/o కృష్ణన్"
"రఘువరన్ btech"
"ఐ"
"కబాలి"
ఇవి కాకుండా త్వరలో మన తెగులు వాళ్ళ మీదకు ఓ క్రొత్త సినిమాని వదలబోతున్నారు. దాని పేరు విని తరించండి. ఏంటంటారా "కాదలి" (అర్ధం మాత్రం అడక్కండి (అడగరనుకోండి ఎలాగూ) తెలీదు)
రాబోయే రోజుల్లో శుభ్రంగా తమిళ సినిమాలే వచ్చేస్తాయేమో! (అదే బెటరేమో)
ఇంతకీ బాహుబలి అమ్మ శివగామా? శివకామినా?
లోగుట్టు రాజమౌళికెరుక!
This comment has been removed by the author.
ReplyDeleteఆమ సార్. తెలుంగుకార్ల అదిరిష్టం సార్ వాడూ 😬.
ReplyDelete# " నిక్కరు కనిపించేలా పై లుంగీలు కట్టుకొని వేసే తమిళ నృత్యాలకి ... " # 😀😀😀😀.
అవునూ, మన సినిమాలు (బాహుబలి సంగతి వదిలెయ్యండి) - పవర్లు, కిరీటులు, రెండోతరం సామ్రాట్లు, రత్నలు నటించిన సినిమాలు - తమిళనాడులో ఇంతే విజయవంతంగా ఆడతాయా అని నాకు తరచూ కలిగే సందేహం సుమండీ 🤔.
ఆమ సార్. మన లైట్లు యిక్కడ తప్ప యింకెక్కడా వెలగవు.
Delete😊😊😊
ReplyDelete:-)☺😊😢😊😊
Delete