ఇప్పుడు నేను చెప్పబోయేది జరిగే అవకాశం ఉందో లేదో తెలియదు గానీ ఆ వైపుగా ఒకసారి ఆలోచిస్తే మంచిదేమో. విషయం ఏంటంటే ఎక్కడ చూసినా జనమే....రైళ్లలో అయితే మరీను... పొరపాటున జనరల్ బోగీ ఎక్కామా, ఇక అంతే సంగతులు. నరకానికి చిరునామాలా ఉంటుంది. యిన్ని రైళ్లు ఉన్నా జనాల్ని సుఖంగా గమ్యానికి చేర్చలేకపోతున్నాయి. రైళ్ల సంఖ్య పెంచుదామా అంటే అవకాశం లేదంటున్నాయి రైల్వే వర్గాలు. రైళ్ల సంఖ్య పెంచలేరు, ఉన్న రైళ్లల్లో జనాల్ని పట్టించలేరు. మరి ఎలా?
ఒక సారి గూడ్స్ రైళ్లను చూడండి. ప్రతీ స్టేషన్ లోను కనబడతాయి... కాకపొతే సరుకుతో. ఓ చివర డ్రైవరు, మరో చివర గార్డ్ తప్ప మనిషన్నవాడు ఉండడు గూడ్స్ ట్రైన్ లో. మరి ఇదే గూడ్స్ ట్రైన్ కు ఓ జనరల్ భోగీ తగిలిస్తే ఎలా ఉంటుంది? ప్రతీ స్టేషన్ లో ఆగకపోయినా గూడ్స్ ట్రైనుకి కూడా ఓ గమ్య స్థానమంటూ ఉంటుంది కదా! ఎలాగూ దూర ప్రాంతాలకే వెళుతుంది కాబట్టి ప్రతీ గూడ్స్ ట్రైనుకి కనీసం ఓ జనరల్ భోగీని తగిలిస్తే కనీసం పేదవాళ్లన్నా దాంట్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది కదా? ప్రయాణీకుల రద్దీ కొంతైనా తగ్గే అవకాశం ఉంటుందేమో! ఏమంటారు ?

This comment has been removed by the author.
ReplyDeleteమీ ఆలోచన బాగానే ఉంది. అయితే పెద్దగా ఫలితం ఉంటుందా అని నా అనుమానం. ఎందుకంటే జీవితాలలో స్పీడ్ పెరిగింది. దూరాభారాలు పెరిగాయి. వేళ్ళాడుతూనయినా సరే ఎక్స్ప్రెస్ బండే ఎక్కి తమ ఊరికి త్వరగా చేరుకుందామనే ప్రయత్నిస్తారు. పైగా దూరాలు వెళ్ళేవారు మెల్లగా ప్రయాణించడానికి ఇష్టపడకపోవచ్చు కదా. అందువలన గూడ్స్-పాసెంజర్ ఎక్కుతారా అంటే ఆలోచించాలిసిందే. ప్రయాణీకుల రెయిళ్ళు అంతగా తిరగని ఏదైనా ఏజెన్సీ ప్రాంతాల రూట్ల ద్వారా వెడుతుండే గూడ్స్ బళ్ళల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టచ్చు. రైల్వేబోర్డ్ కి / మంత్రికి / వార్తాపత్రికలకి సలహా వ్రాసి చూడచ్చు.
ReplyDeleteమీరన్నట్టు అసలంటూ ఎక్కడో అక్కడ మొదలెడితే సాధకబాధకాలు గురించి ఆలోచించొచ్చు.
Delete