Monday, 22 May 2017

షాకింగ్ కామెంట్స్

"ఫలానా సినిమా గురించి ఫలానా నటుడి షాకింగ్ కామెంట్స్"
"టాప్ హీరోయిన్ పరిస్థితి ప్రస్తుతం ఎంత ఘోరంగా ఉందొ చూడండి"
"ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ దుర్మరణం"
"వీరిద్దరి భాగోతం చూడండి. సరిగ్గా 23 సెకన్ల తర్వాత అస్సలు మిస్ కాకండి"

ఫేసుబుక్ తెరిచిన వెంటనే మనకు పైన కనబడే కామెంట్స్ చూడటం, నిజమేమో అని ఆతృతగా చూడటం, తీరా చదివాక(చూసాక) విషయం ఆవగింజంత కూడా లేకపోవడం....మోసపోయామని అర్ధం అయినా మళ్లీ ఇంకో పోస్ట్ చూసి మళ్లీ ఓపెన్ చేయడం... ఉసూరుమనడం మనకి పరిపాటి అయిపోయింది. సదరు కామెంట్లకు అర్ధాలు ఏంటో యిప్పుడు చూద్దాం.

'షాకింగ్ కామెంట్స్' అంటే మెచ్చుకోవడం(మామూలుగా కాదు విపరీతంగా) అన్నమాట.

టాప్ హీరోయిన్ అంటే తెలుగులో కాదండోయ్. ఏ మళయాలమో, తమిళం లో ఓ మోస్తరు హీరోయిన్ అన్నమాట. ఆవిడే ఎవరో తెలియదు.. మళ్లీ ఆవిడ ఇప్పటి పరిస్థితి మనకేం అర్ధమవుతుంది? మనకెందుకు?

టాప్ కమెడియన్ దుర్మరణం అంటే....ఎప్పుడో ఓ పాతికేళ్ల క్రితం అప్పటి కమెడియన్ సాధారణ మరణం అన్నమాట.

భాగోతం అంటే ఇంకేదో వ్యవహారం అని తెరిచారా .....భాగోతానికి వారిచ్చిన అర్ధం "నటించడం, లేదా డాన్స్ చేయడం"

ఇలా మన సహనానికి పరీక్ష పెడుతూ మనల్ని హింసించే ఈ పోస్టుల నుండి మనల్ని కాపాడేదెవరు?!



4 comments:

  1. comments andi.comment manamu ivvali.chudali..basing on that you can decide whether to watch or not

    ReplyDelete
  2. ఫేస్ బుక్ లో కూడా ఇలా ఉంటుందన్నమాట (నేను ఆ పుస్తకంలో లేనులెండి) !! షాకింగ్, షాక్ అవుతారు లాంటి హెడింగ్ లు కనిపించే బ్లాగొకటి తెలుగు బ్లాగ్ లోకంలో కూడా ఉంది కదా. "శోధిని" సంకలినిలో తరచు కనిపిస్తుంది.

    ReplyDelete
  3. Varammmm nice blog keep writing

    ReplyDelete
    Replies
    1. Thank you very much narendar. Happy to see your comment in my blog.

      Delete