'ఫలానా' మినిస్టర్ తెలుసా? ఆయనకు నేను బాగా దగ్గర చుట్టాన్ని.....
'ఫలానా' ఏక్టర్ నాకు బాగా క్లొజ్ ఫ్రెండ్.....మొన్నే మా యింటికొచ్చాడు.....ఏ సినిమా అయినా ముందు నా సలహా తీసుకొని గాని నటించడు.....
మీరు బీఎసెన్నెల్లా? మీకు 'ఫలానా' డీయీ (ఖచ్చితంగా మన కంటే పెద్ద క్యాడరు వాడి పేరే చెపుతారు) తెలుసా? ఆయన మనకి బాగా డీపెస్ట్ ఫ్రెండ్...మీకేమైనా పనులు కావాలంటే చెప్పండి.... వెంటనే చేయించేద్దాం....
'ఫలానా' డాక్టరు తమ్ముడి భార్య నా బామ్మర్ది కి మేనత్త వరసవుతుంది....
'ఫలానా' రౌడీ నాకు లెఫ్ట్ హాండు.... అవసరమైతే నాకోసం ఎవరి శాల్తీనైనా లేపేయడానికి రెడీ....
యిలా 'ఫలానా' బాకాలు, బడాయి కబుర్లతో మన బుర్ర తినేసే వాళ్ళు ఎవడో ఒకడు తగులుతూనే ఉంటారు ఎక్కడో చోట. ఫలానా వాడు తెలిస్తే ఏంటట? వీడు చెప్పే ఆ ఫలానా వాడు గొప్పోడయ్యుండచ్చు గానీ వీడు కాదు కదా?! ఆ ఫలానా వాడు ఆ స్ఠాయికి చేరుకోవడానికి ఎన్ని కష్టాలు పడుంటాడు? వీడికిలాగ 'వాడు తెలుసు', 'వీడు తెలుసు' అని అనకుండా తన కష్టాన్ని నమ్ముకొనే ఆ స్థాయికి చేరుకుంటాడుగా? అసలు ఫలానా వాడి గురించి మాట్లాడుతున్నాడంటేనే ఆ చెప్పేవాడు తనను తాను తగ్గించుకునట్టేగా? అది మాత్రం వాడికి ఈ జన్మకి అర్ధం కాదు గాక కాదు..... పైగా వాడు చెప్పే ఈ 'ఫలానా' బడాయి సొల్లు విని మనం వాడిని చాలా గొప్పవాడని అనుకుంటామేమోనని ఓ పిచ్చి భ్రమలో ఉంటాడు పాపం.... యిది చదివైనా కనీసం ఈ 'ఫలానా' సుత్తి మన మీద ప్రయోగించకుండా ఉంటే అంతే చాలు!

సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాస రావు గారు ఇటువంటివారిని "ఐ నో సిఎమ్, ఐ నో పిఎమ్" అని చెప్పుకుంటుండే రకాలు అని తన బ్లాగ్ లో తరచు అంటుంటారు 😀.
ReplyDeleteకొంతమంది ఇటువంటి "సుత్తి" వేయడం మాత్రమే కాదండి, వాళ్ళ కబుర్లు నమ్మినవారి దగ్గరనుంచి డబ్బులు లాగేద్దామని కూడా ప్రయత్నిస్తుంటారు. అందువల్ల జాగ్రత్తగానే ఉండాలి ☝️.
నిజమే సార్.
Delete