ఈ ప్రపంచం లో మంచివాడూ, చెడ్డవాడూ అంటూ ఎవ్వడూ ఉండడు. ఉండేది కేవలం మనిషి మాత్రమే. కాకపోతే వాడిలో కోపం, కామం, క్రోధం, జాలి, భయం, దానగుణం, నిజాయితీ, కౄరత్వం ఇలాంటివి అన్నీ మిక్సైపోయి ఉంటాయి. ఎప్పుడు ఏది బయటకి తీయాలనేది వాడి విచక్షణ మీద, బేలెన్సింగ్ పవర్ మీద ఆధారపడి ఉంటుది. కొన్నిసార్లు కేవలం "అవకాశం" లేక వాటిలో కొన్ని బయటకి తీయలేకపోతుంటాడు. దాన్ని బట్టే అతన్ని మంచివాడో, చెడ్డవాడో అని నిర్ధారించలేము. అర్ధమయ్యిందనుకుంటా.
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
Monday, 16 September 2013
Subscribe to:
Post Comments (Atom)
Nijamaina manishini chudalante, aa manishini vantariga evaru leni chota vantariga vunchite atani Loni Anni Anni angles chuda vachu. Am I right.
ReplyDelete