జీవితం కూడా సినిమా లాంటిదే. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని రెండు ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా హేప్పీ గా, ఫన్నీ గా , జాలీ గా, ఉల్లసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. సినిమాలో 'ఇంటెర్వెల్ బ్యాంగ్' ఉనంట్లే లైఫ్ లో కూడా 'ఇంటర్వెల్ బ్యాంగ్' ఉంటుంది. అదే "మ్యారేజ్". ఇక ఆ తర్వాత సెకండ్ హాఫ్ అంతా ట్విస్ట్ లతో, సీరియస్ నెస్ తో, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఆవేశాలు, ఆక్రొశాలు, అన్నీ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో అప్పుడప్పుడు కష్టాలు, కన్నీళ్ళు ఉన్నట్టే సెకండ్ హాఫ్ లో కూడా అప్పుడప్పుడు నవ్వులు, ఆనందాలు ఉంటాయి.
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
Monday, 16 September 2013
Subscribe to:
Post Comments (Atom)
Mari ante kada Adi life. Life teepi chedu vagaru pulupu ela Anni sharuchulu intend kada anandamga undedi. Lekapote anta bore. We can't imagine that life.
ReplyDelete