నాకు
నచ్చలే......
గజం
వంద రూపాయలుండే ఎందుకూ పనికి రాని స్థలము ఇప్పుడు పదివేలయిపోవటం
నాకు
నచ్చలే......
ఎప్పుడూ
ప్రశాంతంగా ఉండే జనాలకి కేబుల్ టీవీలోచ్చి వాళ్ళ ప్రశాంతతని పాడు చేసేయటం
నాకు
నచ్చలే......
అవసరమున్నా
లేకపోయినా పదే పదే రోజంతా సెల్ ఫోను లో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఎదురుగా ఉన్న మనిషితో
మాత్రం పొడిపొడిగా మాట్లాడటం
నాకు
నచ్చలే......
ఖాళీగా
ఉండే రోడ్లన్నీ జనాలతోను, వెహికిల్స్ తోను, ఆటోలతోను నిండిపోయి నడవటానికి కూడా జాగా
లేకపోవటం
నాకు
నచ్చలే......
కొంచెం
తింటే చాలు బీపీ,షుగరు వచ్చెస్తొందేమోనని భయపడి చావటం
నాకు
నచ్చలే......
అవసరం
ఉన్నా లేకపోయినా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో వేలు వేలు ఖర్చు పెట్టేయటం
చక్కగా
రెండు జెళ్ళు వేసుకొని లంగా వోణీ, పైటా పావడాతో ఎంచక్కా పొందికగా అందంగా ఉండాల్సిన
అమ్మాయిలు పంజాబీ డ్రెస్సులు, జీన్ పేంట్లు, ట్-షర్ట్లు వేసుకొని తిరిగేయటం
నాకు
నచ్చలే......
శెలవులొచ్చాయంటే
చక్కగా పళ్ళెటూర్లు వెళ్ళిపోయి చక్కగా కొన్ని రోజులు అక్కడ గడిపి రావటం మానేసి కనీసం
మనూర్లో ఉన్న గోదావరి ని కూడా సంవత్సరానికొక సారి కూడా చూడలేకపోవటం
నాకు
నచ్చలే......
అమ్మా
నాన్నా బాబాయ్ పినీ మవయ్యా తాతయ్యా నానమ్మా అమ్మమ్మా అని నోరారా పిలుచుకోక డాడీ మమ్మీ
అంకుల్ ఆంటీ గ్రానీ అని పిలుచుకోవటం
నాకు
నచ్చలే......
బొమ్మరిల్లు,
బాలమిత్ర, చందమామ, చినబాలశిక్ష, పెదబాలశిక్ష పిల్లల చేత చదివించటం మానేసి కార్టూన్
నెట్ వర్కులూ, పోగోలు చూపించటం
నాకు
నచ్చలే......
అపార్ట్
మెంటుల్లో బ్రతుకుతున్నా పక్క ఫ్లాట్ వాడి ఊరూ పేరూ తెలియకపోవటం
No comments:
Post a Comment