Monday, 16 September 2013

అప్పు కప్పురంబు.....

పొలం లో పంట కోసం ముప్పైవేలు అప్పు చేసాడో రైతు. దాన్ని తీర్చలేక పొయాడు. అప్పులోళ్ళు అతని మీద పడి పీక్కు తిన్నారు బాకీ కోసం. వాళ్ళ కాళ్ళా వేళ్ళా పడ్డాడు కొంచెం టైం ఇవ్వమని. ససేమిరా అన్నారు వాళ్ళు. దిగులుతో అదే పొలం లో ఎండ్రిన్ తాగి చచ్చిపోయాడు ఆ రైతు. ముప్పైవేలు అప్పు మిగిలిపోయింది. అతని ఇంట్లో వాళ్ళు అతని దహన సంస్కారాలు చేసి ఘనంగా ఊరందరికీ భోజనాలు గట్రా పెట్టారు "ఇంకో ముప్పై వేలు అప్పు చేసి మరీ".  ( ఇది మా ఫ్రైండ్ వాళ్ళ నాన్న విషయంలో నిజంగా జరిగింది)    

3 comments:

  1. దాసరిగమలు. చక్కటి భావన తో అందిస్తున్నందుకు అభినందనలు

    ReplyDelete
  2. రైతు కథలు అని ఓకే మంచి పుస్తకం ఉంది విశాలాంద్ర లో దొరుకుతుంది దాని నిండా రైతు కథలే అన్ని ఇలాంటివే, కాని దాని ధర 500 , అంత ధర పెట్టి కొని చదివేవాడు, రైతును ఎం అర్థం చేసుకొంటాడు.మీరు చెప్పిన సంఘటనలు మా జిల్లలో నిత్య కృత్యము.

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్లు చూసి సంతోషంగా అనిపించింది హేమకుమార్ గారు. ధన్యవాదములు

      Delete