కామెడీ సినిమాలకి మొఖం వాచిపోయిన సినీ ప్రేక్షకులకో శుభవార్త. మిమ్మల్ని కడుపుచెక్కలయ్యేలా నవ్వించటానికో సినిమా వస్తోంది. గతంలో తమ గెటప్పుల ద్వారా, ఏక్షన్ ద్వారా (ఓవర్) మనల్ని తెగ నవ్వించిన రాజశేఖర్ (ఆగ్రహం), సాయికుమార్ ( పోలీస్ స్టోరీ), బాలకృష్ణ (ఒక్క మగాడు), చిరంజీవి (స్నేహం కోసం), వెంకటేష్ (సూర్య వంశం) లాగానే ఇప్పుడు రాజ్ కుమార్ (గుర్తుందా?) 'బారిస్టర్ శంకర్ నారాయణ్ ' అనే సినిమాలో ఓల్డ్ ఏజ్ గెటప్ ద్వారా మనల్ని కడుపు చెక్కలయ్యేలా నవ్వించటానికి వస్తున్నాడు. టీజర్స్ ఆల్రెడీ తెగ నవ్విస్తున్నాయి.
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
No comments:
Post a Comment