ఈ క్రింద పేర్కొన్న ఐడియాలనుకోండి,
సూచనలనుకోండి సమాజానికి ఉపయోగపడతాయని నేను భావించి వ్రాస్తున్నవి. వీటిలో కొన్ని సిల్లీ గానూ, హాస్యాస్పదంగా అనిపిచ్చుండొచ్చు.
మీలో కొంత మందికి వీటికంటే యింకా మంచి ఐడియాలు కలిగివుండవచ్చు. కానీ వీటిమీద మీ అభిప్రాయాలను
నాతో తప్పకుండా పంచుకుంటారు కదూ.
మీకు
ఎన్ని భాషలొచ్చు? తెలుగు, హిందీ, ఇంగ్లీషు. అంతే కదా? చాలా కొద్ది మందికి మాత్రమే యింకో
భాష తెలిసే అవకాశముంది. మీరు గానీ మన పక్క రాష్ట్రాలైన తమిళనాడుకో, కర్ణాటకకో వెళితే
నోరెళ్ళబెట్టాల్సిందే. నా సూచన ఏంటంటే యిప్పుడున్న స్కూల్స్ లో తమిళం, కన్నడ, మలయాళ
భాషలని ప్రాధమిక విద్యా స్థాయి నించే ప్రవేశపెట్టాలి. పిల్లలకి ఏదో ఒక భాషని ఎంచుకొనే
స్వేచ్చనివ్వాలి. ఒక సంవత్సరము ఒక భాషని నేర్చుకోవటం మొదలెడతాడు. అతను కావాలనుకుంటే
తర్వాతి సంవత్సరము కూడా అదే భాషని కొనసాగిస్తాడు లేదా యింకో భాషని ఎంచుకొనే
అవకాశమివ్వాలి. కానీ ఒకటవ తరగతి నుండి పదవ తరగతి లోపు కనీసం రెండు భాషలనైనా నేర్చుకోవాలనే
నిబంధనని పెట్టాలి. తద్వారా అతని విద్యా సంవత్సరాలలో చాలా భాషలు నేర్చుకొనే అవకాశము
లభిస్తుంది. ఆ భాషలకి మార్కులు కూడా అదనంగా యిచ్చి ప్రోత్సహించాలి. ఎలా ఉంది ఐడియా?
No comments:
Post a Comment