కారణమేమిటో తెలీదుగానీ జుట్టు ఉన్నవాళ్ళకంటే జుట్టులేనివాళ్ళే (బట్టతల వాళ్ళు) దువ్వెన ఎక్కువ పెట్టుకొని తిరుగుతారు జేబులో. నెత్తిమీద జుట్టు లేకపోయినా ఎక్కువగా అద్దంలో చూసుకొనేదీ, తల దువ్వుకొనేదీ కూడా వాళ్ళే !!
నాలోనూ ఒక రచయిత ఉన్నాడు అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకూ నాకూ తెలీదు. అంటే యిప్పుడేదో గొప్ప రచయితనైపోయానని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ బ్లాగులో యిన్ని పోస్టులు పెట్టబోతున్నానీ, పెడతాననీ, అసలేమాత్రం ఊహించలేదు. యిది నిజం. నేను పెట్టే ప్రతీ పోస్టూ మీకు నచ్చుతుందనే నా ఆశ. మరొక్క మాట. మీ స్పందన నాకు అత్యంత ప్రాణప్రదం. మీ స్పందనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపి మరిన్ని పోస్టులతో నా బ్లాగుని నింపటానికి ఆక్సిజన్ లా పనిచేస్తాయి. మీ స్పందనలనీ, అభిప్రాయాలని తెలియచేస్తారు కదూ. - వరప్రసాద్ దాసరి.
Friday, 28 November 2014
Monday, 24 November 2014
Sunday, 23 November 2014
యిచ్చట మీ స్థలాలు భద్రపరచబడును
ఒక స్థలం కొనే ముందు మనము వంద ఎంక్వయిరీలు చేసి వెయ్యి మందిని అడిగి మరో లక్ష సార్లు డాక్యుమెంట్లూ గట్రా చదువుకుని గానీ కొనము. యిదంతా ఎందుకంటే మోసపోయే అవకాశముంది కాబట్టి. కదా? యింతా చేసి స్థలం కొన్నాక మనము మరో చోటికి ట్రాన్స్ ఫరు అవ్వడము గానీ, లేదా దాన్ని పట్టించుకొనే తీరిక గానీ లేకపోవడం జరగొచ్చు. లేదా ఫారినుకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యే అవకాశం రావొచ్చు. మరి మన స్థలానికి రక్షణ ఏది? ఈ లోపు ఎవరైనా కబ్జా చేస్తే? లేక మనకు తెలియకుండా నకిలీ దస్తావేజులు సృష్టించి అమ్మేస్తేనో? మరెలా?
వస్తున్నా. మనం రైల్వే స్టేషను లో క్లాక్ రూం చూసాము కదా. అది మన సామాను భద్ర పరిచే గది. మన సామానుని అక్కడ పెట్టుకున్నందుకు వాళ్ళు గంటకు యింత అని వసూలు చెస్తారు మన దగ్గర. అదే పద్దతిని మన స్థలాల్ని భద్ర పరిచే వ్యవస్థ ఒకటుంటే బాగుంటుంది కదూ? మన స్థలాల్ని ఎవరి కబ్జాకి గురి అవనీయకుండా, మన ప్రమేయం లేకుండా యింకొకరికి అమ్మేయకుండా భద్ర పరిచే ఏజెన్సీ గానీ లేదా అలాంటిదే మరొకటో ఉంటే బాగుంటుంది కదూ? దాని కోసం సంవత్సరానికి యింత అని వసూలు చేసినా మనం ఆనందంగా యిస్తాం. ఏమంటారు? యిలాంటి బిజినెస్ ఎవరైనా మొదలు పెడితే డబ్బులే డబ్బులు అని నా అభిప్రాయం.

Sunday, 16 November 2014
హిందీ చానల్ కే డబ్బింగు చెప్పేస్తే పోలా?
యిప్పుడు షేర్ల వ్యాపారం చేసేవాళ్ళకి ఓ తెలుగు న్యూస్ చానల్ ఉంటే బాగుండును కదా? అటువంటివి కేవలం హిందీ లో మాత్రమే ఉన్నాయి యిప్పుడు. తెలుగులో కూడా ప్రారంభిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
Saturday, 8 November 2014
సునీల్ డైలాగు డెలివరీ మారిపోవడానికి కారకుడు ఎవరు?
ఈ మధ్య సునీల్ ని గమనించారా? కమెడియను గా ఉన్నప్పటి అతని నటననీ, హీరో అయ్యాక యిప్పటి నటనని పోల్చి చూడండి. చాలా తేడా కనిపిస్తోంది కదూ? కమెడియన్ గా ఉన్నప్పుడు అతని నటనలో చాలా 'ఈజ్' ఉండేది. కామెడీలో చెలరేగిపోయేవాడు. కానీ హీరో అయ్యాక పట్టి పట్టి నటిస్తున్నాడు రాముడు మంచి బాలుడు అనే తరహాలో. అతనిలోని ఈజ్ ఎగిరిపోయి నటనలో కృత్విమత్వము కనిపిస్తోంది. యిలా అతనిలోని మార్పుకి కారణమేమిటి? హీరో అయ్యాడు కాబట్టి ఫక్తు కమెడియనులా నటించడము కుదరదన్న మాట నిజమే. కానీ సునీల్ పరిస్థితి అది కాదు. మరీ బిగదీసుకుపోయి నటిస్తున్నాడు. ఆ తరహా నటన 'అందాల రాముడు' సినిమా లో లేదు. కానీ ఆ తర్వాత వచ్చిన 'మర్యాద రామన్న ' సినిమాలో అతని నటన పూర్తిగా మారిపోయింది. అతని మాట తీరు ఏదో తెచ్చి పెట్టుకున్నట్టుగా మారిపోయింది. దీనికి కారణం రాజమౌళి. అతని డైలాగ్ డెలివరీని పూర్తిగా మార్చిపాడేసాడు. ఆ సినిమా పెద్ద హిట్టయ్యింది. దాంతో అక్కడ్నించి సునీల్ ప్రతీ సినిమాలో అదే తరహా డైలాగు డెలివరీతో నటించేస్తున్నాడు. పాత సునీల్ ని ఎప్పుడు చూస్తామో??
Thursday, 6 November 2014
మరి దివాన్ చెరువుని దివాన్ టాంక్ అనరెందుకో !
మీరు గమనించారో లేదో గానీ మన తెలుగు వాళ్ళంతా చాలాకాలం నుండి "దీపావళి" ని ఆ పేరుతో పిలవడం మానేసారు. "దీవాలి" అని పిలుస్తున్నారు. అలాగే "వినాయక చవితి"ని "గణే ష్ చతుర్ధి" అని పిలుస్తున్నారు. ఏ పేరుతో పిలిచినా అర్ధం ఒకటే. కానీ నోరారా తెలుగు పేర్లతో పిలవడం మానేసారనే నేను చెప్పదల్చుకుంది. అన్నట్టు మా రాజమండ్రి లో "కంబాల చెరువు" ని కూడా "కంబాల టాంక్" అని పిలిచేస్తున్నారండోయ్!
Monday, 3 November 2014
తప్పిపోయిన పిల్లల్ని వారి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడమెలా?
యిప్పుడు నేను వ్రాయబోయేది నిజంగా జరిగే అవకాశముందో లేదో నాకు తెలీదు. అయినా నాకు వచ్చిన ఆలోచనని మీతో పంచుకోవాలనుకుంటున్నా. మీరు బస్ స్టాండుల్లోనూ, రైల్వేయ్ స్టేషనుల్లోనూ 'కనబడుట లేదు. ఈ క్రింది ఫోటోలోని అబ్బాయి వయసు 6 సంవత్సరాలు. ఆ అబ్బాయి ఆచూకి తెలిపినవారికి బహుమతి"...... యిలాంటివి చూస్తూనే ఉంటాము. యిలా తప్పిపోయిన పిల్లలు తమ తల్లి దండ్రులకి తిరిగి చేరువవుతున్నారా? తప్పిపోయిన వాళ్ళే కాదు కిడ్నాపులకి గురి అయిన వాళ్ళు, యితర కారణాల వలన చిన్నతనంలో తలిదండ్రులనుండి దూరమైన పిల్లలు తలిదండ్రుల ప్రేమకి దూరంగా ఎక్కడో అనాధలుగా పెరుగుతున్నారు. పెద్దయ్యాక తమ తలిదండ్రులకి దగ్గర్లో ఉన్నా వారు గుర్తు పట్టలేరు. మరి యిలాంటి వారిని కలపడమెలా?
యిప్పుడు ఆధార్ కార్డ్ దేశంలో ప్రతీ ఒక్కరూ తీసుకోవడం తప్పనిసరి. ఆ కార్డులో ఏముంటున్నాయి? మన కనుబొమ్మలు, వేలిముద్ర , ఫోటో యిలాంటివి ఉంటున్నాయి. కదూ? వీటితో పాటు మన DNA వివరాలు కూడా ఉంటే?
అవును ప్రతీ ఒక్కరి DNA వివరాలు కూడా ఆ కార్డులో పొందుపరిస్తే తప్పిపోయిన పిల్లల్ని తమ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడం సులువు అవుతుందేమో???!!! ఆలోచించండి.

Friday, 31 October 2014
మేం వయసుకి వచ్చాం !
నటుడు జేడీ చక్రవర్తి, బ్రహ్మాజీ, భానుచందర్, దర్శకుడు ఏస్ వీ కృష్ణా రెడ్డి, నటి సితార, కమెడియన్ అలీ, మళయాళ నటుడు రఘు (రెహ్మాన్ రాజు).... వీళ్ళందరినీ ఒక సారి గమనించండి. వీళ్ళంతా ఓ యిరవై యిరవై ఐదు ఏళ్ళుగా సినిమా రంగంలో ఉన్నారు. వచ్చిన క్రొత్తలో ఎలా ఉన్నారో యిప్పుడూ అలాగే ఉన్నారు. వయసు పెరిగిన ప్రభావం వీరి మీద అస్సలు పడలేదు యిప్పటికీ. ఏ గుళికలు మింగుతున్నారో మరి?!!
Wednesday, 29 October 2014
FAMILY కి తెలుగులో యింకో అర్ధముంది తెలుసా?
ఫ్యామిలీకి తెలుగులో యింకో అర్ధముంది తెలుసా?
అవును. కొన్ని ఇంగ్లీషు పదాలకు తెలుగులో అర్ధాలు మరోలా ఉంటాయి. కాదు. అలా అన్వయించేస్తుంటారు మన తెలుగోళ్ళు. ఇంగ్లీషులో ఫ్యామిలీ అంటే నాకు తెలిసీ కుటుంబమని అర్ధం. కానీ చాలా మంది పెళ్ళైన వాళ్ళు ఫ్యామిలీకి యింకో అర్ధం చెపుతారు. వాళ్ళ దృష్టిలో ఫ్యామిలీ అంటే "భార్య" అని అర్ధం. అవును. వినడానికి విడ్డూరంగా ఉన్నా యిది నిజం. "నిన్న రాత్రి నేనూ మా ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాము", మా ఫ్యామిలీ ఆఫీసుకెళ్ళింది", "మ ఫ్యామిలీ చాలా స్ట్రిక్టు గురూ". యిలాంటి మాటల్లో "ఫ్యామిలీ" అంటే కుటుంబమనుకుంటున్నారా? కానే కాదు. వాళ్ళ దృష్టిలో ఫ్యామిలీ అంటే భార్య అని. ఇదే దారుణమనుకుంటే కొంత మంది తమ భార్యలను ముద్దుగా "లేడీస్" అని చెపుతుంటారు. "మా లేడీసు వచ్చారు", "మొన్న మా లేడీస్ తో ఊరెళ్ళాను" అంటుంటారు. మొత్తానికి "భార్య" ని "భార్య" అని చెప్పుకోవడానికి వచ్చిన తంటాలు యివి.
ఏమిటో.......????!!!!

Saturday, 18 October 2014
కామెడీయే కాదు డాన్సులు కూడా విరగదీస్తాం
హీరోలు డాన్సులు చేయడం మామూలే. అందులో కూడా బాగా చేసేవాళ్ళు కొంత మంది ఉంటే చేయని వాళ్ళు కొంత మంది ఉంటారు. అది మనకి తెలిసిన విషయమే. ఈ హీరోల విషయం ప్రక్కన పెడితే అప్పుడప్పుడు కమెడియన్లూ, క్యారెక్టరు ఆర్టిస్టులూ, విలన్లు కూడా డాన్సులు చేస్తూ ఉంటారు. వీళ్ళల్లో కమెడియన్లు చాలా మంది డాన్సులు చాలా బాగా చేస్తుంటారు. నిజం చెప్పాలంటే కొంత మంది హీరోల కన్నా బాగా చేస్తారు. ఆ తరం నటుల్లో రాజబాబు, నగేష్, చలం ....... యిలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కమెడియన్లు డాన్సులు బాగా చేసేవాళ్ళు. యిప్పటి కమెడియన్లను గమనించండి.... బాబూమోహన్, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్.. వీళ్ళంతా మంచి డాన్సర్లే. బాబూమోహన్ డాన్సులు ఎంత క్రేజ్ సంపాదించాయంటే ఆయన కోసమే సినిమాలో ఓ ప్రత్యేక గీతం పెట్టేవారంటే ఆలోచించండి డాన్సుల్లో ఆయన ఎంత పేరు సంపాదించుకున్నాడో!. ఒక పేరు చెప్పలేదనుకుంటున్నారు కదూ? అవును - అతని పేరు 'సునీల్ '. సునీల్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాక యిప్పుడు హీరో కూడా అయ్యాడు. సునీల్ ఎంత మంచి డాన్సరో మనకి తెలిసిన విషయమే. ఏతా వాతా నేను చెప్పేదేంటంటే కమడియన్లు కామెడీయే కాదు డాన్సులు కూడా బాగా చేసారు-చేస్తున్నారు. అసలు విషయమేమిటంటే కామెడీ చేసేవాళ్ళు అన్నీ చేయగలరని నా నమ్మకం. అంతా బాగుంది. కానీ యింకొక విషయం చెప్పుకోవాలి విలన్ వేషాలు వేసేవాళ్ళు మాత్రం మంచి డాన్సర్లు కాదు. రావుగోపాలరావు, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, చలపతిరావు వీళ్ళెవరికీ అస్సలు డాన్సులు రావు. పాపం.
మన సినిమాటోగ్రాఫర్లు కూడా సినిమాల్లో నటించారండోయ్
మన సినిమాటోగ్రాఫర్లు కూడా అప్పుడపుడూ ఆటవిడుపుగా కొన్ని సినిమాల్లో నటించారండోయ్. చోటా K నాయుడు 'నిర్ణయం' సినిమాలో మురళీమోహన్ అనుచరుడిగా నటించాడు. ఆ పాత్ర విలన్ల చేతిలో చనిపోతుంది. అలాగే యింకో సినిమాటోగ్రాఫర్ S. గోపాల్ రెడ్డి కూడా "గోవిందా గోవింద" సినిమాలో CBI ఆఫీసరు పాత్రలో నటించాడు. గమ్మత్తేంటంటే ఆ సినిమాలో ఆ పాత్ర కూడా చనిపోతుంది విలన్ల చేతిలో.
Wednesday, 15 October 2014
మణిరత్నం మోసం చేసాడు
మణిరత్నం మోసం చేయడమేంటనుకుంటున్నారా? అవును. మోసం చేసింది మాత్రం మనల్నే. రోజా సినిమా చూసారా? కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమా అది. ఆ సినిమా షూటింగ్ అంతా ఎక్కడ తీసారో తెలుసా? కాశ్మీర్ అనుకుంటున్నారు కదూ. కానే కాదు. ఆ సినిమాని మొత్తం ఊటీ లో తీసేసాడు మణిరత్నం. మొన్నా మధ్య ఊటీ వెళ్ళినప్పుడు అర్ధమయ్యింది నాకు. ఊటీ ని ఏమాత్రం తెలియనియ్యకుండా కాశ్మీర్ అనే విధంగా భ్రమింపచేసాడు మణిరత్నం. ఈ సినిమానే కాదు 'దిల్ సే' సినిమా కూడా అంతే.
Monday, 13 October 2014
'నో బాల్' పడినా నాకు సంబంధం లేదు
యిది క్రికెట్టుకి సంబంధించింది. బౌలరు బాలింగు వేసేటప్పుడు అంపైరు అతడిని 'నో' బాలు వేస్తున్నాడో లేదో చూస్తాడు. ఆ తర్వాత అతను వేసిన బంతిని గమనిస్తాడు. యిదంతా మనకి తెలిసిన విషయమే. కాకపోతే బౌలరు 'నో' బాలు వేస్తున్నాడా లేదా అని చూసి రెప్పపాటులో మళ్ళీ అతను వేసే బంతిని చూడటం అంపైరుకి కొంచెం కష్టమే కదా? దాని బదులు 'నో' బాలు ఒక్క దానిని థర్డ్ అంపైరుకి వదిలేస్తే ఎలా ఉంటుంది? అంటే ఏమీ లేదు. మీరు టెన్నిసు చూస్తుంటారు కదా? టెన్నిస్ బంతి లైను మీద పడిందో లేదా లైను బయట పడిందో చూడటానికి టెలివిజను రీ-ప్లే పద్దతి ఒకటుంది కదా? దాన్నే 'లైను అంపైరు' అని అంటారనుకుంటా నాకు సరిగ్గా తెలీదు. అలాంటి పద్దతి క్రికెట్టులో కూడా ప్రవేశపెడితే బాగుంటుంది కదా? బౌలరు లైను దాటి బంతి వేసిన వెంటనే 'రెడ్ లైట్' వెలిగితే సరి అతను 'నో' బాల్ వేసినట్టన్నమాట. చక్కగా అంపైరుకి ఏకకాలంలో రెండింటిని చూసే శ్రమ తప్పుతుంది, 'నో' బాలుని ఖచ్చితంగా నిర్ణయించే అవకాశమూ - రెండూ కలిసొస్తాయి. ఏమంటారు?
Saturday, 11 October 2014
ఆంధ్రప్రదేశ్ లో బ్లాకులో టికెట్లు అమ్మని థియేటరు పేరు తెలుసా?
నేను యింతవరకూ చూసిన ప్రతీ థియేటర్ల బయట బ్లాకులో టికెట్లు అమ్మడం చూశాను చూస్తున్నాను. ప్రతీ థియేటరు బయట యిది సర్వ సాధారణం. కానీ నా చిన్నప్పటినిండీ బ్లాకులో అమ్మని ఒక థియేటరుని చూశాను. ఆ థియేటరులో బ్లాకులో టికెట్లు అమ్మరు. అమ్మడానికి అవకాశమే లేదు. ఎందుకంటే టికెట్ల కోసం అందరూ క్యూలో నించున్నాక వాళ్ళకు ఒక టికెట్ మాత్రమే యిచ్చేవారు. ఆ టికెట్ తీసుకున్నాక సరాసరి లోపలికి - అంటే థియేటరులోకి వెళ్ళిపోవలసిందే. సినిమా మొదలయిన అరగంట వరకూ ఎవరినీ బయటకి వదిలేవారు కాదు. స్కూటర్లూ, బండ్లూ, సైకిల్లూ గట్రా ముందే స్టాండులో పెట్టేసుకోవాలి. ఒక వేళ టికెట్టు దొరకకపోతే మాత్రం వాళ్ళకి బండి తాలూకు డబ్బులు తిరిగిచ్చేసే వాళ్ళు. కానీ నేను చెపుతోన్న విషయము ఓ యిరవై యేళ్ళ క్రితం మాట. అప్పట్లో ఆ థియేటరులో కేవలం ఇంగ్లీషు సినిమాలు మాత్రమే ఆడేవి. యిప్పుడు తెలుగు సినిమాలు కూడా ఆడేస్తున్నాయనుకోండి. యింతకీ ఆ థియేటరు పేరు చెప్పకుండా ఊదరగొట్టేస్తున్నాననుకుంటున్నారు కదూ. వస్తున్నా. ఆ థియేటరు కాకినాడలో ఉంది. పేరు "సత్యగౌరి"
Friday, 10 October 2014
ఆ రోజుల్లో
కొంత మంది పెద్దవాళ్ళు అంటే ఓ యాభై అరవై యేళ్ళ వాళ్ళు ఓ మాట అంటూ ఉంటారు. అదేంటంటే "నేను ఆ రోజుల్లో ఐదో తరగతి చదివాను. ఆ రోజుల్లో అయిదో తరగతి అంటే యిప్పుడు డిగ్రీ తో సమానం. తెలుసా?". నాకు యిప్పటికీ అర్ధం కాని విషయమేమిటంటే ఆ రోజుల్లో చదివిన అయిదో తరగతి యిప్పటి డిగ్రీ తో ఎలా సమానమవుతుందీ అని ! రోజు రోజుకీ చదువు స్టాండార్డ్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో అలాంటి మాటలు విని నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు.
Thursday, 9 October 2014
మీమీదొట్టు...మేము జరగమంతే !
కిక్కిరిసిపోయున్న బస్సుని ఓ సారి గమనించండి. జనాలు ఫుట్ బోర్డ్ మీద వేలాడుతూ ప్రయాణిస్తుంటారు. వాళ్ళందరూ అలా ప్రయాణం చేయడానికి కారణమేంటో తెలుసా? లోపల జనాలు నిండిపోవడం వలన అనుకుంటున్నారా? అది కొంతవరకు మాత్రమే నిజం. అంటే??? నిజానికి లోపల నుంచున్న జనాలు కొంచెం వెనక్కి జరిగి నించుంటే ఫుట్ బోర్డ్ మీద నిలబడ్డ జనాలు లోపలికి వచ్చే అవకాశముంటుంది. కానీ లోపల నించున్న జనాలు అస్సలు వెనక్కి జరగరు గాక జరగరు - కండక్టరు చెప్పినా యింకెవరు చెప్పినా సరే అలా మొద్దుల్లా నించొని చూస్తుంటారు. ఫుట్ బోర్డ్ మీద నిలబడ్డ జనాలు ఎంత యిబ్బంది పడుతున్నా సరే. కావాలంటే ఈ సారి చూడండి.
Monday, 6 October 2014
ప్రవేశం నిషిద్దం!
ఓ ప్రక్కన ఆఫీసుకి టైమైపోతుంటుంది. ట్రాఫిక్కుని దాటుకుంటూ ఓ సందులోకి ఎంటరవుతాము. ఎందుకంటే ఆ సందు గుండా వెళితేనే ఆఫీసు వస్తుంది మరి. ఆ సందెమ్మటే వెళుతుంటే దారికి అడ్డుగా ఓ టెంటు వేసి ఉంటుంది. అక్కడ ఏ అన్న దాన కార్యక్రమమో, పెళ్ళో, లేక రజస్వల వేడుక లాంటిదేదో జరుగుతుంటుంది. పోనీ ఓ ప్రక్కనించి వెళ్ళిపోదామా అంటే ఏ మాత్రం వీలు లేకుండా బల్లలు కుర్చీలు అడ్డుగా పెట్టేసుంటారు. అది దాటుకొని వెళ్ళాలంటే మీరు మళ్ళీ వెనక్కొచ్చి యింకో నాలుగు సందులు దాటి చుట్టూ తిరిగెళితే గానీ ముందుకి వెళ్ళ లేరు. యిలాంటివి నెలకి కనీసం రెండైనా జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు రోడ్డుకి అడ్డంగా యిలా టెంటులు గట్రా వేసేయడం వలన ఆ రోడ్డులో వెళ్ళే వాళ్ళకి ఎంత యిబ్బందిగా ఉంటుందో ఏమాత్రం ఆలోచించరు సరికదా అడిగితే అడ్డంగా వాదనకు దిగుతారు. ఆ రోజంతా - అంటే ఆ ఫంక్షను జరుగుతున్నంత సేపూ జనాలు నరకం చూడాల్సిందే. తప్పదు.
మిక్స్ డ్ క్రికెట్
క్రికెట్టంటే పిచ్చ ఉన్న దేశం పేరు చెప్పండి ? మరో మాట లేకుండా అందరూ చెప్పే సమాధానం "భారత దేశం". అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ యిందులో చిన్న సవరణ ఉంది. అదేంటంటే మనోళ్ళు క్రికెట్టంటే పడి చస్తారు గానీ కేవలం మగవాళ్ళు ఆడే క్రికెట్టంటే మాత్రమే పడి చస్తారు. ఆడవాళ్ళు అంటే మహిళా క్రికట్టంటే ఏమాత్రం చూడరు గాక చూడరు. వాళ్ళు ఆడిన ఏ క్రికెట్టు మ్యాచైనా జనాలు లేక వెలవెల పోతుంటాయి. వాళ్ళు ఎన్ని సెంచరీలు కొట్టినా, ఎన్ని కప్పులు గెలిచినా వాళ్ళకు మిగిలేది మాత్రం శూన్యం. మరి వీళ్ళని పమోట్ చేసేదెలా? ఒక్క రోజులో అది సాధ్యం కాదు గానీ నాకొక ఆలోచన ఉంది. అదేంటంటే "IPL మ్యాచుల్లో మహిళా క్రికెటర్లను కూడా భాగస్వామ్యుల్ని చేయాలి". ఎలా ఉంది? అంటే మనకున్న భారత మహిళా క్రికెట్ టీము మెంబర్లు అంటే సుమారు 15 లేక 16 మందిని తలా ఒక టీములో ఆడనిచ్చే అవకాశమివ్వాలి. అలా చేయడం వలన వాళ్ళ ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుంది. వాళ్ళకంటూ ఓ ఇమేజ్ వస్తుంది. తద్వారా వాళ్ళు మహిళా క్రికెట్ ఆడినపుడు ఆ ఇమేజ్ ఉపయోగపడి వాళ్ళు ఆడే మ్యాచుల్ని ఎక్కువమంది చూసే అవకాశముంటుందని నా అభిప్రాయము. ఏమంటారు?
Friday, 3 October 2014
'జెయింట్ వీల్' భయపడకుండా ఎక్కాలంటే?
'జెయింట్ వీల్' ఎక్కుతున్నారా? భయమేస్తోందా? ముఖ్యంగా 'జెయింట్ వీల్' పైకి వెళుతున్నప్పుడు కన్నా క్రిందకు దిగేటప్పుడు గుండె ఝల్లుమన్నట్టనిపిస్తుంది కదూ? ఆ ఫీలింగు కొంతవరకూ తగ్గాలంటే ఓ పని చేయండి 'జెయింట్ వీల్' క్రిందకి దిగుతున్నప్పుడు ముందు వైపుకి చూడకండి వెనుక వైపు చూడండి. అంత భయం వేయదు.
యిచ్చట శ్రేష్ఠమైన బూతులు నేర్పబడును
మీ పిల్లలకి మంచి శ్రేష్టమైన బూతులు నేర్పించాలనుకుంటున్నారా? మీ పిల్లలే కాదు మీరు కూడా నేర్చుకోవటానికి మంచి అవకాశం. యిందు కోసం మీరు చేయవలసిందల్లా ఒక్కటే. ఓ మంచి తెలుగు సినిమాకి వెళ్ళిపోవడమే. మన అగ్ర హీరోలు అనిపించుకుంటున్న నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్, రవితేజ..... వీళ్ళంతా చక్కటి బూతులతో తెలుగు సినిమాని మరింత అభివృద్ది పధంలోకి తీసుకెళ్ళడానికి తమ వంతు చేయూతనిస్తున్నారు. వీళ్ళు విలన్లని తిట్టడానికో లేక వెటకారం చేయడానికో ఓ మాటని చక్కగా వాడేస్తున్నారు "పిచ్చి పూ".......(వాళ్ళు అంటున్నారు అని చెప్పడం కోసమైనా ఈ పదం వాడవలసినందుకు క్షమించాలి). ఆ పదాన్ని సగం వాడి మిగతాది మింగేయడం. యింక కొంతమంది హీరోలు మరో విధంగా "పిచ్చి వూక.....పూహా".....యిలా బూతుల్ని చక్కగా తెలివిగా వాడేస్తున్నారు. మరో నటుడైతే ఒక అడుగు ముందుకేసి "మాకే లాల్" అంటాడు. ఈ పరిణామం దేనికి సంకేతం? పిల్లల నుండి ముసలివారిదాకా అందరూ ఎంతో అభిమానించే హీరోల నోటి నుండి యింత అసభ్యకరమైన బూతులు వస్తుంటే వారిని ఏ విధంగా అభిమానించాలి? అసలు సెన్సారు వాళ్ళు ఏ విధంగా అనుమతిస్తున్నారు? ఈ బూతులన్నీ ఆడవారి మర్మాంగాల మీదే ఉంటున్నా ఏ ఒక్క మహిళ నుండి కూడా ప్రతిఘటన ఎదురు కాకపోవడమే అత్యంత దారుణమైన విషయం!
Thursday, 2 October 2014
మరీ సూటిగా చెప్తే దూరదర్శన్ అంటారేమో బెదరూ!
టీవీలో అంటే న్యూస్ చానల్లో ఏదైనా ఒక నటుడి గురించో లేదా నటి గురించో లేక ఓ దర్శకుడి గురించో చెప్తున్నారనుకోండి. గమనించండి - వాళ్ళ గురించి చెప్పే విషయం ఓ రెండు నిమిషాలే. మిగతా పావుగంట వాళ్ళు నటించిన సినిమాళ్ళోని పాటలు, డైలాగులు గట్రా చూపించేస్తూ మన సహనానికి పరీక్ష పెడుతున్నారు. వాళ్ళ గురించి విషయం సూటిగా చెప్పేయక మధ్యలో ఈ కచేరీ ఏంటి సిరాగ్గా????!!!!
ఈ టీవీలో 'క్యాష్' ప్రోగ్రాం చూస్తున్నారా?
ఈ టీవీలో 'క్యాష్' ప్రోగ్రాం చూస్తున్నారా? యిప్పుడు నేను చెప్పబోయే విషయం ఆ గేం షో ఎలా ఉంది అన్నదాని గురించి కాదు. ఆ షో లో చివరాఖరులో జరిగే వస్తు నాశనం గురించి. అందులో పాల్గొనే సెలబ్రిటీలు సుమ అడిగే ప్రశ్నలకు జవాబు చెపితే సరి. లేకపోతే కొన్ని వస్తువులు నెమ్మదిగా జరుగుతూ క్రిందకి పడిపోతుంటాయి. ఎంతో విలువైన సామనులు మన కళ్ళ ముందే క్రింద పడిపోతుంటే అయ్యో అనిపిస్తుంది. వాటిని అలా క్రింద పారేసే బదులు ఓ ప్రక్కన పెట్టేస్తే సరిపోతుంది కదా?
రైలు బస్సులు
జనం......జనం.....జనం...... ఎక్కడ చూసినా జనం. సినిమా హాళ్ళల్లో, రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండుల్లో, ఎక్కడ చూసినా జనమే. మరి పెరుగుతున్న జనానికి తగ్గట్టుగా వారికి కావలసినవి ఉంటున్నాయా? అంటే ట్రైనులు, సినిమా హాళ్ళూ, బస్సులు వగైరా వగైరాలన్నమాట. లేవు కదూ? సినిమా హాళ్ళు రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి. వాటి స్థానం లో మల్టీప్లెక్సులు పుట్టుకొస్తున్నాయి. ట్రైనుల సంఖ్య పెంచడం కష్టం అని ఓ ప్రక్కన కేంద్ర ప్రభుత్వమంటోంది. ఎందుకంటే ఇప్పుడున్న ట్రాఫిక్ పెరిగిపోయి ట్రైనులని నడపడం కష్టమట. సరే. మరి చివరాఖరుగా బస్సుల విషయానికొద్దాం. ఏ బస్సు చూసినా కిక్కిరిసిపోయుంటున్నాయి. బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. మరెలా? అవే బస్సులు. వాటికే యింకో రెండు లేదా మూడు భోగీలని తగిలిస్తే? భోగీలుండేది రైళ్ళలో అనే కదా మీ అనుమానం? నిజమే. బస్సులకి కూడా రైళ్ళ లాగ యింకో రెండు మూడు భోగీల్లాంటి వాటిని జోడిస్తే బాగుంటుందేమో కదా? అంటే బస్సులని ఆ విధంగా డిజైను మారిస్తే ఎలా ఉంటుంది? రద్దీ కాస్తైనా తగ్గుతుందేమో?!
మీ పాలిట ప్రతినాయకులం మేము
సంపత్
ఆశిష్ విద్యార్ధి
ప్రదీప్ రావత్
ముఖేష్ రుషి
రాహుల్ దేవ్
షాయాజి షిండే
నాజర్
సాయి కుమార్ (తెలుగు సాయికుమార్ కాదు)
ఆదిత్య మీనన్
సోనూ సూద్...................
ఎవరు వీళ్ళంతా? వీరిలో కొంత మందినైనా గుర్తు పట్టారా? ఒకరిద్దరి పేర్లు విన్నట్టు, చూసినట్టు అనిపిస్తున్నాయి కదూ? అవునండి. వీళ్ళంతా మన తెలుగు సినిమా లో ప్రతినాయక పాత్రలు పోషిస్తోన్న నటులు. ఓ దశాబ్దం నుండి మన తెలుగు సినిమాని ఏలేస్తున్నారు మన ఖర్మ కొద్దీ. వీళ్ళలో ఏ ఒక్కరికీ తెలుగు రాదు. తెలుగు రాకపోతే పోయింది కనీసం డైలాగులన్నా తెలుగులో చెప్తారా అంటే అదీ లేదు. చక్కటి హిందీలో చెపుతారు. దాన్ని చక్కగా కవర్ చేయడానికి మన డబ్బింగు ఆర్టిస్టులు ఉండనే ఉన్నారుగా. యింకో దారుణమైన విషయమేమిటంటే సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమాలో నటించిన అందరూ ప్రమోషనుకి వస్తారు గానీ ఈ సదరు పర భాషా ప్రతినాయకులు మాత్రం అస్సలు రారు. పోనీ నటనలో విరగదీస్తారా అంటే అదీ లేదు. అందరిదీ ఒకటే మూస నటన. ఒక రావు గోపాలరావు, ఒక కైకాల సత్యనారాయణ, ఒక ప్రభాకర్ రెడ్డి, ఒక రాజనాల లాంటి వారిని చూసి, వారి నటన తో పులకరించిపోయిన మనం మన దరిద్రం కొద్దీ ఈ పర భాషా విలన్లను కూడా భరించేస్తున్నాం.

Tuesday, 23 September 2014
నటుడు 'మాడా' పతనానికి కారకులు ఎవరో తెలుసా?
నటుడు 'మాడా' పతనానికి కారకులు ఎవరో తెలుసా? దర్శకుడు స్వర్గీయ 'E.V.V.సత్యనారాయణ'. అవును. వినడానికి కొంచెం 'యిది'గా ఉన్నా అది నిజం. 'మాడా వెంకటేశ్వర రావు' 'చిల్లరకొట్టు చిట్టెమ్మ ' సినిమా లో 'ఆ' టైపు క్యారెక్టరు చేసి ఉండవచ్చు. కానీ ఆ సినిమాకు ముందూ, ఆ తర్వాత సినిమాలు చాలా వాటిల్లో కమెడియనుగానూ, సహాయనటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్నాడాయన. కానీ ఈవీవీ దర్శకత్వము మొదలుపెట్టిన తర్వాత ఆయన కొన్ని సినిమాల్లో 'మాడా' పేరుని ఆడా మగా కాని వారికి పర్యాయ పదంగా మార్చేసాడు ఈవీవీ. 'నేనేమైనా ఆడా మగా కాని మాడా గాడిని అనుకున్నావా?' లాంటి డైలాగులు పలికించడం ద్వారా 'మాడా వెంకటేశ్వర రావు' లాంటి మంచి నటుడి స్థాయిని దిగజార్చాడు. యిక అక్కడినించి ఆయనకి దాదాపు అన్ని సినిమాల్లో 'ఆ' టైపు పాత్రలు మాత్రమే వచ్చాయి. ఈవీవీ వలన బలైపోయిన మరో నటుడు గునుపూడి విశ్వనాధ శాస్త్రి. ఎవరో అర్ధమయ్యిందా? లేదు కదూ?. అదే 'ఐరన్ లెగ్ శాస్త్రి ' అంటే అర్ధమవుతుంది. అతనికి ఆ పేరు పెట్టడమే కాకుండా అతన్ని ఆ పేరుతో తెగ పాపులర్ చేసేశాడు ఈవీవీ. వృత్తి రీత్యా పౌరోహిత్యం చేసుకొనే విశ్వనాధ శాస్త్రి సినిమాల్లో 'ఐరన్ లెగ్ శాస్త్రి'గా పేరు తెచ్చుకోవడం వలన అతనికి పౌరోహిత్య అవకాశాలు రావడమే కరువయ్యాయి. ఆ క్రమము లోనే చివరికి చావుని కొని తెచ్చుకున్నాడు విశ్వనాధ శాస్త్రి...... అదే ఐరన్ లెగ్ శాస్త్రి. ప్చ్ !
Monday, 22 September 2014
మీ వయసెంత?
మీ వయసెంత అని ఎవరైనా అడిగారనుకోండి. ఎంత చెపుతారు? అదేం ప్రశ్న ? నా వయసెంతో అంతే చెపుతాను. అని చిరాకు పడుతున్నారు కదూ? ఆగండాగండి. యిందులో ఒక చిన్న తిరకాసుంది. ఎలాగో చూద్దాం. మీరు 1-1-1974 సంవత్సరములో పుట్టారనుకుందాము. యిప్పుడు చెప్పండి మీ వయసెంత చెపుతారు?
40 సంవత్సరాలా? లేక 41 సంవత్సరాలా?
చాలా మంది చెప్పే జవాబు 41. కానీ యిది తప్పు. ఎందుకంటే మనము చెప్పాల్సింది మనము ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసాము అని. అంతే గానీ పూర్తి చేయాల్సిన వయసు చెప్పగూడదు. యింకా కొంచెం లోతులోకి వెళ్ళి చెప్పుకుంటే ఓ మూడు నెలల క్రితం మీకు ఒక అబ్బాయి పుట్టాడనుకొనడి ఆ అబ్బాయి వయసు ఎంత చెపుతారు? మూడు నెలలు చెపుతారా లేక సంవత్సరమా? అర్ధమయ్యిందనుకుంటా?!

Friday, 19 September 2014
మళ్ళీ చప్పట్లు !
అప్పుడెప్పుడో వచ్చిన హిందీ సినిమా "తేజాబ్" గుర్తుందిగా? అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ నటించారు. మాధురీ 'ఏక్ దో తీన్ పాట ఒక ఊపు ఊపేసింది అప్పట్లో. దాన్ని తెలుగులో కూడా తీసారు. వెంకటేష్, రాధ హీరో, హీరోయిన్లు. యిదంతా తెలిసిన విషయమే. బానే ఉంది. ఆ సినిమాకి సంబంధించిన యింకో విషయం చెప్పనా? తేజాబ్ సినిమాని తెలుగులో మళ్ళీ యింకో సారి తీసారు. కాకపోతే మక్కీకి మక్కీ కాకుండా దాదాపు అదే కధతో అన్నమాట. ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లు. సినిమా గుర్తొచ్చిందా? సరే చెప్పేస్తున్నా. "వర్షం". అవును. "వర్షం" సినిమా తేజాబ్ కధాంశంతో తీసిన సినిమానే. M.S.రాజు మంచి తెలివిగా తీసాడు, ఎక్కడా తేజాబ్ సినిమా గుర్తు రాకుండా. ఆయన తీసిన యింకో సినిమా "నువ్వొస్తానటే నేనొద్దంటానా?" సినిమా కూడా అదే బాపతు. హిందీ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా "మైనే ప్యార్ కియా" సినిమా కధాంశంతో తీసిన సినిమా అది. భలే ఉంది కదా?!
Friday, 5 September 2014
ఇంటెర్వెల్ లేని తెలుగు సినిమాలు
నాకు తెలిసీ ఇంటర్వెల్ లేని తెలుగు సినిమా గతం లో ఒకటొచ్చింది. దాని పేరు "ఆఖరి పోరాటం". నాగార్జున, శ్రీదేవి నటించిన సినిమా అది. ఆ సినిమా కి ఇంటెర్వెల్ లేదు. యిప్పుడు చాలా కాలం తర్వాత అలాంటి ఇంటెర్వెల్ లేని సినిమా ఒకటి రాబోతోంది. దాని పేరు "అనుక్షణం". మంచు విష్ణు హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తోంది. గమ్మత్తేమిటంటే ఈ రెండు సినిమాలు ఇంగ్లీష్ అక్షరం 'A' తో మొదలవ్వడం. రెండు సినిమాల దర్శకుల పేర్లు కూడా R అక్షరం తో మొదలవుతాయి.
Saturday, 30 August 2014
కాలనీ బస్సులు
'పల్లె వెలుగు' బస్సుల స్థానం లో మినీ బస్సులు ప్రవేశపెడతారంట. ఎందుకో మరి? యిప్పుడున్న బస్సుల్లోనే కిక్కిరిసిపోయేంత జనముంటున్నారు. మరి మినీ బస్సుల్లో యింత మంది జనాన్ని ఎలా పట్టిస్తారు? పోనీ బస్సుల సంఖ్య పెంచుతారా అంటే ఖచ్చితంగా పెంచరు గాక పెంచరు. ఎందుకంటే బస్సుల్ని పెంచగలరేమో గానీ డ్రైవర్లు, కండక్టర్ల సంఖ్యని పెంచలేరు కదా? అంటే ఎన్ని పల్లె వెలుగు బస్సులు పోతాయో అన్ని మినీ బస్సులు వస్తాయన్న మాట. దీనికి పరిష్కారమొక్కటే. ముందు డ్రైవర్ల సంఖ్యని పెంచాలి. పల్లె వెలుగు బస్సులని అలాగే ఉంచాలి. మినీ బస్సులని కూడా ప్రవేశపెట్టాలి. కాకపోతో వాటిని దూర ప్రాంతాలకు కాకుండా అదే ఊరిలో ఆటోలు, రిక్షాలు తిరిగే కాలనీల్లో తిరిగేటట్టు చేయాలి. అంటే సిటీ బస్సుల్లా అన్నమాట. కాకపొతే అవి కాలనీల్లో తిరగవు, ఇవి తిరుగుతాయి. దాని వలన ఆదాయానికి ఆదాయం - ఆటోల్లో యిరుక్కొని కూర్చునే బాధా తప్పుతుంది. ఈ విధానము అంటే కాలనీల్లో బస్సులు తిరగడమన్నది తమిళనాడులో సంవత్సరం నుండి విజయవంతంగా నడుపుతున్నారు.
Friday, 29 August 2014
స్కిట్లు చూస్తోంటే వస్తున్నాయి నోట్లోంచి తిట్లు !
ఈ మధ్య టీవీల్లో కామెడీ స్కిట్స్ అంటూ తెగ హడావిడి చేసేస్తున్నారు. బానే ఉంది. కానీ అందులో విపరీత పోకడలే మరీ ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. మగ వాళ్ళకి ఆడవేషం వేయాల్సిన అవసరమేంటో నాకైతే అర్ధం కాలేదు. ఆ అవతారాలు మరీ జుగుప్సాకరంగా రోత పుట్టించేలా ఉంటున్నాయి. యింత మంది లేడీ ఆర్టిస్టులుండగా వాళ్ళనొదిలేసి మగవారే ఆడ వేషాల్సిన అవసరమేంటో మరి ! వేస్తే వేసారు గానీ అందులో కూడా వెకిలితనమే. యింకో విషయమేమిటంటే వీళ్ళు చేసే కామెడీ కొన్ని నవ్వు పుట్టిస్తున్నాయి గానీ కొన్ని మాత్రం కితకితలు పెట్టుకున్నా నవ్వు రావడం లేదు సరి కదా డోకొస్తున్నాయి. అయినా ఆ జడ్జిల స్థానంలో కూర్చున్న వారు మాత్రం విరగబడి నవ్వేస్తున్నారు. ఆ స్కిట్టు అయిపోయాక చివరాఖరులో అందరు నటులూ (యాంకరుతో సహా) కలిసి డాన్సు వేయడం ఒకటి. హతోస్మీ !
ఓ చిన్న చిట్కా
బాటిల్ తో గానీ గ్లాస్ తో గానీ నీళ్ళు తాగుతున్నారా? ఆగండి. మీరు బాటిల్ ని గానీ గ్లాస్ ని గానీ ఎత్తిపెట్టుకొని తాగితే నీళ్ళు ఎక్కువ తాగలేరు. అదే బాటిల్ ని గానీ గ్లాస్ ని గానీ నోటితో కరిచిపెట్టుకొని తాగండి. నీళ్ళు ఎక్కువ తాగగలరు. అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం. ప్రయత్నించి చూడండి.
Tuesday, 26 August 2014
మరి మంచివాడు పోగిడేదెప్పుడో
మంచివాడి తిట్టు లో నిజాయితీ ఉంటుంది. చెడ్డవాడి పొగడ్త లో కపటత్వం ఉంటుంది.
Sunday, 24 August 2014
మన హీరోలకి అలా పడుకుంటే గానీ నిద్ర రాదేమో ?!
తరతరాలుగా మన తెలుగు సినిమాలో ఓ దృశ్యము మాత్రం తప్పనిసరిగా చూస్తూనే ఉంటాము. బ్లాక్ అండ్ వైటు సినిమాల నుండి నేటి సినిమాల వరకూ అదే తీరు. యింతకీ ఆ దృశ్యమేమిటంటారా?
"హీరో నీట్ గా ఇన్ షర్ట్ చేసుకొని షూ తొడుక్కుని అదే గెటప్పుతో మంచం మీద పడుకోవడం."
ఎంత తల బాదుకున్నా ఈ గెటప్పుతో బెడ్ మీద పడుకోవడమేంటో మనకస్సలు అర్ధం కాదు. ఈ హీరోలు ఎప్పుడు మారతారో మరి.
"హీరో నీట్ గా ఇన్ షర్ట్ చేసుకొని షూ తొడుక్కుని అదే గెటప్పుతో మంచం మీద పడుకోవడం."
ఎంత తల బాదుకున్నా ఈ గెటప్పుతో బెడ్ మీద పడుకోవడమేంటో మనకస్సలు అర్ధం కాదు. ఈ హీరోలు ఎప్పుడు మారతారో మరి.
Sunday, 17 August 2014
ఆ ముగ్గురూ...
నాకు తెలిసీ మొదటి సినిమాతోనే ఉర్రూతలూగించిన హీరోయిన్లు ముగ్గురున్నారు మన తెలుగు సినీ పరిశ్రమలో. వాళ్ళు ఎవరంటే " దివ్య భారతి, ఇలియానా, నిత్యా మీనన్ '. కేవలం వీళ్ళు ముగ్గురు మాత్రమే "మొదటి సినిమా ద్వారా విపరీతమైన పేరు, పాపులారిటీ తెచ్చుకున్నారు. బాగా పాపులరైన హీరోయిన్లు చాలా మంది ఉండొచ్చు. కానీ వాళ్ళంతా తరువాతి సినిమాల ద్వారానే పేరు తెచ్చున్నవాళ్ళే. ఉదహారణకి దివ్యభారతిని గుర్తు తెచ్చుకోండి. "బొబ్బిలి రాజా" సినిమాలో అందరినీ ఎంత సమ్మోహనపరిచిందో. ఆ సినిమా ఆడుతున్నంత సేపూ ఆమె గురించి టాపిక్ లేని ప్రాంతము, రోజు లేదంటే నమ్మండి. కేవలం ఆమె కోసమే బొబ్బిలి రాజా సినిమాని పది సార్లు యిరవై సార్లు చూసిన వాళ్ళున్నారు. ఆమె రెండో సినిమా ఎప్పుడొస్తుందాని కళ్ళు కాయలు కాచేలా చూసారు జనం. అలాగే ఇలియానా. తన అందచందాలతో ప్రేక్షకుల్ని కట్టిపారేసిందామె. యిక నిత్యా మీనన్ సంగతి వేరు. అందం, అభినయం, గాత్రం ఈ మూడింటిని కలిగలిపి ప్రేక్షకులని సంభ్రమాశ్చర్యపరిచిన నటి ఈమె. కాజల్, అనుష్క, తమన్నా, శృతి హాసన్, కాజల్, సమంతా లాంటి వాళ్ళు అందం, నటనతో పైకొచ్చిన వాళ్ళే. కానీ కేవలం హిట్టు సినిమాల కారణంగానే పైకొచ్చారు తప్ప నేను చెప్పిన ఆ ముగ్గురిలాగ "ఫస్ట్ సినిమా" వండరు కాదు.
Tuesday, 12 August 2014
శెలవిక నేస్తం
ఎక్కడ్నించో వచ్చాము
ఒక్కటిగా కలిసాము
బాధల్ని పంచుకున్నాము
కష్టాల్లో ఓదార్చుకున్నాము
మూడు నెలల ఈ సావాసాన్ని యిట్టే గడిపేసాము
నవ్వుకుంటూ- నవ్వించుకుంటూ
చివరికి వచ్చింది
ఆ రోజు
మనమంతా విడిపోయే రోజు
రానే వచ్చింది
తడబడుతూ వచ్చినా
తడి నిండిన గుండెతో తిరిగెళుతున్నాము
మది నిండా తీపి గురుతులతో
మరెన్నో మధుర జ్ఞాపకాలతో
వీలుంటే
మళ్ళీ అవకాశముంటే
మళ్ళీ కలుద్దాము
లేదంటే వాట్సప్ లోనో
జీమెయిల్ లోనో టచ్ లో ఉందాము
ఉంటాను మరి
శెలవిక నేస్తం
(ఈ కవిత కూడా మైసూరు ట్రైనింగు లో చివరి రోజు వ్రాసాను.)

Sunday, 10 August 2014
బ్యాచ్ నెంబరు ఆరు
ట్రైనింగుకి వచ్చాము మైసూరు
ఎంతో బాగుందిగా ఈ ఊరు
యిచ్చారు బ్యాచ్ నెంబరు ఆరు
ఎల్ ఓ ఏమో కర్రి కిషోరు
యింటికి దూరమయ్యి తగ్గింది హుషారు
శెలవొచ్చిందంటే చాలు మనసు జోరు జోరు
చేసేస్తాం తెగ షికారు
తినలేక చస్తున్నాము రోజూ చారూ సాంబారు
ముక్క లేక కడుపేమో క్యారు క్యారు
పాఠాలు అర్ధం కాక కొట్టుకుంటున్నాం నెత్తీ నోరు
పుస్తకాలు చదవలేక అవుతున్నాము బేజారు
పరీక్షలంటే పుడుతోంది కంగారు
సరిగా వ్రాయకపోతే సీనియారిటీ చేజారు
ఏమో నారు పోసినవాడే పోయడా నీరు !
తిరుగు ప్రయాణానికి టికెట్లు మాత్రం ఖరారు
అవుతాములే చివరికి జూనియరు టెలికం ఆఫీసరు!
(యీ సరదా కవిత నేను మైసూరులో ట్రైనింగు సమయములో వ్రాసాను. ఈ కవిత వ్రాయడములో సహకరించిన నా స్నేహితుడు మరియు రూమ్మేటు అయిన భీమిశెట్టి రంజిత్ కుమార్ కు నా కృతజ్ఞతలు - వరప్రసాద్ దాసరి )

Saturday, 9 August 2014
రివ్యూలు వద్దు బాబోయ్
మార్కెట్ లోకి క్రొత్త సబ్బు వచ్చిందా?
టీవీల్లో, పత్రికల్లో ఆ సబ్బు గురించి తెగ అడ్వర్టైజ్ మెంటులు వచ్చేస్తున్నాయా?
మీరు ఆ సబ్బు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ మీకు ఆ సబ్బు ఎలా ఉంటుందో మీకు సలహా గానీ అభిప్రాయము గానీ చెప్పే వారు లేరా?
ఒక్క సబ్బే కాదు. క్రొత్త ప్రొడక్ట్ ఏది వచ్చినా అది ఎలా ఉంటుందో మీరు స్వయంగా వాడితే గానీ మీకు దాని గురించి తెలిసే అవకాశమే లేదు. కాదంటారా?
వాటిమీద సలహా గానీ, రివ్యూలు గానీ వ్రాసే చాన్సే లేదు.
కానీ ప్రపంచంలో ఒకే ఒక్క ప్రొడక్ట్ కి మాత్రం అది మార్కెట్ లోకి వచ్చిన వెంటనే అది ఎలా ఉంటుందో వెంటనే - అంటే ఆ ప్రొడక్ట్ వచ్చిన గంటల్లోనే దాని మీద రివ్యూలు వచ్చేస్తాయి. అది బాగుందో లేదో చెప్పటమే కాకుండా దానికి రేటింగులు కూడా తెలియచేస్తాయి. అదేంటో మీకు తెలుసా?
అవును. మీ ఊహ నిజమే. ఆ ప్రొడక్ట్ పేరు
' సినిమా'
అది రిలీజైన ఓ గంట సేపటికే దాని మీద రివ్యూలు రాసి పాడేస్తున్నారు. యివి నిజంగా అవసరమా? ప్రపంచంలో మరే యితర ప్రొడక్ట్ కీ లేని రివ్యూలు సినిమాకి మాత్రం ఎందుకు? ఒక సబ్బుని కొని అదెలా ఉందో తెలుసుకుంటున్నప్పుడు సినిమాని మాత్రం రివ్యూ చదివి ఎందుకు చూడాలి? ఆ సినిమాని తీయడానికి ఆ నిర్మాత ఎంత డబ్బు పెట్టుంటాడు? ఎంత శ్రమ? మరెంతో క్రియేటివిటీ? యివన్నీ కలబోస్తే గానీ ఓ సినిమా తయారవ్వదు. మరలాంటి సినిమా రిలీజైన ఓ గంటలోనే దాని భవిష్యత్తుని నిర్ధారించేస్తే ఎలా?
నా ఉద్దేశ్యం చెత్త సినిమాల్ని ప్రోత్సహించడం కాదు. కానీ ఆ చెత్త సినిమాని కూడా ఎంతో డబ్బు పెట్టే తీస్తారు నిర్మాతలు. కాబట్టి సినిమా బాగుందో లేదో ప్రేక్షకుడినే నిర్ణయించుకొనే అవకాశమివ్వాలి. కేవలం రివ్యూలు చదివో, చూసో సినిమా చూసే విధానం ఆగిపోవాలి.
ఆపలేమంటారా? సరే. కనీసం సినిమా రిలీజైన ఓ వారం పాటన్నా రివ్యూలని నిషేధించాలి. సినిమా కలెక్షన్లకి కీలకమైనది ఆ మొదటి వారమే. కనీసం ఆ వారం రోజులపాటైనా రివ్యూలని నిషేధించాలి.
ఓ సినిమా బాగుందనో లేక చెత్తగా ఉందనో రివ్యూలు రాసి పారేసే పత్రికలు ఐదుకి ఇంత అని రేటింగులు ఇచ్చి పారేసే చానల్సు ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఆ సదరు పత్రికలూ, చానెల్సు మీద ఎవరైనా రివ్యూలు వ్రాస్తేనో, రేటింగులు ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. సదరు పత్రిక చెత్తగా ఉందనో, లేదా ఫలానా చానలు పని తీరు ఐదుకి ఇంత అని రేటిగు ఇస్తే వాటి పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించండి.

Thursday, 7 August 2014
రైల్వే టోల్ గేట్
మొన్న జరిగిన స్కూల్ బస్ ఏక్సిడెంట్ వార్త యిప్పటికీ ఏదో చానల్ లో వస్తూనే ఉంది. కానీ అది చూడాలన్నా ఆ వార్త చదవాలన్నా ధైర్యం సరిపోవడంలేదు. ఏమి తప్పు చేసారు ఆ పిల్లలు? అసలు ఎందుకు జరిగింది? ఎవరి తప్పు? రైల్వేదా లేక బస్ డ్రైవర్ దా? డ్రైవరు సెల్ ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటడం వలన ఏక్సిడెంట్ జరిగిందని చెపుతున్నారు పిల్లలు. నా ఉద్దేశ్యం ప్రకారము బస్ డ్రైవరుది తప్పు ఉన్నా ఈ పాపం లో ఎక్కువ భాగము రైల్వే డిపార్ట్మెంటుదేనని నా అభిప్రాయము. ఎందుకంటే ఆ ప్రదేశం లో అంటే రైల్వే క్రాసింగు ప్రదేశంలో సిగ్నల్ గేట్ లేకపోవడమే ప్రధాన కారణము. కాదాంటారా?
సరే. మరి మరి ప్రతీ రైల్వే క్రాసింగు ప్రదేశంలో ఆ గేటులు పెట్టొచ్చు కదా? ఎందుకు వాటిని కొన్ని చోట్ల మాత్రమే పెడుతున్నారు? అని ప్రశ్నిస్తే మనకు ఓ సమాధానం వస్తుంది "నిధుల కొరత " అని. భారతదేశమంతా సిగ్నల్ గేటుల్ని పెట్టాలంటే కనీసం 30 వేల కోట్లు అవసరమవుతాయంట. అంతే కాదు ప్రస్తుతమున్న పరిస్తితుల్లో రైల్వే కు అంత సొమ్ము భరించే శక్తి లేదట. మరి అయితే ఈ విషయంలో ప్రైవేటు భాగస్వామ్యము తీసుకోవచ్చు కదా?
ఎలా అంటే "రైల్వే టోల్ గేట్" లను ఏర్పాటు చేయడం ద్వారా. అవును ఇప్పుడు జాతీయ రహదారుల్లో మనకు చాల చోట్ల కనిపించే టోల్ గేట్ ల మాదిరిగానే రైల్వే టోల్ గేట్ లను ఏర్పాటు చేయాలి. అంటే టోల్ గేట్లు దాటినపుడు టికెట్ ఎలా తీసుకొని వెళతామో అలాగే రైల్వే క్రాసింగు గేట్ దాటేటప్పుడు టికెట్ తీసుకొని దాటాలన్న మాట. ఈ పద్దతిలో వెళితే రైల్వేకు 30 వేల కోట్ల రూపాయలను స్వంతంగా భరించే అవసరముండదు. ప్రైవేటు పార్టీల ద్వారా ఈ రైల్వే టోల్ గేటు లను ఏర్పాటు చేయించి, తిరిగి ఆ సొమ్ముని ప్రజల ద్వారా తిరిగి పొందే అవకాశం కలిపిస్తే రాబోయే కాలంలో మరెన్నో ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఏమంటారు?

Tuesday, 5 August 2014
కొంచెం ముందూ వెనకా చూద్దురూ !
ఈ మధ్య ప్రతీ సినిమా క్లైమాక్స్ తర్వాత - అంటే సినిమా పూర్తయ్యాక వచ్చే తంతు గమనించండి. ఆ సినిమా తాలూకు షూటింగ్ జరిగిన సన్నివేశాలను చూపుతూ దాని ప్రక్కన టైటిల్స్ వస్తూ ఉంటాయి. చూట్టానికి ఆ సన్నివేశాలు మంచి ఆశక్తిగా ఉంటుంటాయి. బానే ఉంది. కానీ సినిమా మొదట్లో రావలసిన టైటిల్స్ చివర్లో, అదీ ఆ సన్నివేశాల ప్రక్కన వేస్తోంటే ఆ టైటిల్స్ ని ఎవరు చూస్తారు చెప్పండి? దృష్టి అంతా ఆ నటీనటుల షూటింగ్ విన్యాసాలపై ఉంటుంది గానీ ఆ సినిమా కోసం తెర వెనుక కష్టపడిన సాంకేతిక నిపుణులపై ఎలా ఉంటుంది? ఆ టైటిల్సు వేసేదేదో సినిమా మొదట్లోనే వేస్తే అందరూ చూసే అవకాశముంటుంది కదా?
Wednesday, 23 July 2014
పైత్యం బయట పడేది అప్పుడేగా!
చాలా మంది ఇంట్లోనో లేక వంటరిగా ఉన్నప్పుడు సాధారణంగా చేసే పని యిష్టమైన పాటలు పెట్టుకొని వినడం. అదీ చాలా ప్రశాంతంగా. చివరికి అది ఎంత హుషారైన పాటైనా సరే. కానీ విచిత్రమేమిటంటే అదే పాటని స్నేహితులు లేదా కొంచెం క్లోజ్ గా ఉండేవాళ్ళు ఉన్నప్పుడు అంతకు ముందు ఎప్పుడూ విననట్టు, గట్టిగా పాడేస్తూ, పిచ్చి పిచ్చిగా డాన్సు మూమెంట్లు యిస్తూ ఉంటారు. వంటరిగా ఉన్నప్పుడు కుదురుగా వినే వాళ్ళు జనాలున్నప్పుడు అలా ఎందుకు ప్రవర్తిస్తారో మరి?
Tuesday, 22 July 2014
ఒక్క మెతుకు చూస్తే చాలదా మరి?
ఒకే ఒక్క రోజులో, ఒకే ఒక్క సంఘటనతో అవతలి వ్యక్తిని మంచివాడు అని భావించేస్తాం దురదృష్టవశాత్తూ. కానీ ఆ ఒక్క రోజు - వేరే దారి లేక అతను మంచితనం నటించిన రోజు అయి ఉండవచ్చు.
Sunday, 20 July 2014
విక్టరీ వెంకటేష్ ఏ సినిమాలోనూ చేయనిది ఏంటి?
యిది కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు గానీ, కానీ నిజం. విషయమేమిటంటే, నాకు గుర్తుండీ, వెంకటేష్ యింతవరకూ ఏ సినిమాలోనూ పరిగెత్తలేదు (రన్ చేయలేదు). అటువంటి సీను ఏ సినిమాలోనూ లేదు. నిజమే కదూ?
(ఈ పోస్టు పెట్టిన తర్వాత నాకు తెలియవచ్చిన విషయమేమిటంటే వెంకటేష్ కొన్ని సినిమాల్లో పరిగెత్తాడు (కలిసుందాం రా, ప్రేమించుకుందాం రా, జయం మనదేరా వగైరా వగైరా..... ఈ విషయాన్ని 'చందు తులసీ గారు తన కామెంటు ద్వారా తెలియచేసారు. జరిగిన పొరపాటుకి చింతిస్తున్నాను. యిక మీద పెట్టే పోస్టులకు జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇస్తున్నాను)

Wednesday, 16 July 2014
ఓ పజిల్
యిప్పుడు నేను చెప్పబోయేది ఓ పజిల్. ఈ పజిల్ని నేను ఇంటర్మీడియట్ లో ఉండగా నా స్నేహితుడు అడిగాడు. కానీ ఎంత కొట్టుకున్నా సమాధానమివ్వలేకపొయను. చివరికి సమాధానము అతనే చెప్పేసాడనుకోండి. కానీ సమాధానము తెలిసి అవాక్కైపోయాను. అప్పట్నించీ ఈ పజిల్ని చాలా మంది మీద ప్రయోగించాను. కానీ ఎవ్వరూ సరైన సమాధానమివ్వలేకపోయారు. మీరేమైనా చెప్పగలరేమో ప్రయత్నించి చూడండి. యింతకీ పజిల్ ఏంటంటే.....
"ఒక డాక్టరు, ఒక వ్యాపారవేత్త, ఒక ఇంజనీరు కలిసి ఓ హోటల్ లో రూము తీసుకున్నారు. ఆ రాత్రి వారి మధ్య ఏమి జరిగిందో గానీ తెల్లారేసరికి ఇంజనీరు కత్తి గాయాలతో కొన ఊపిరితో ఉన్నాడు. రూములో వారు ముగ్గురే ఉన్నారు. పోలీసులొచ్చారు. ఎస్సై చావు బ్రతుకుల్లో ఉన్న ఇంజనీరు దగ్గరకొచ్చి 'ఎవరు పొడిచారు మిమ్మల్ని ?'
ఇంజనీరు అతి కష్టం మీద కూడబలుక్కొని 'వాడే పొడిచాడు ' అని చెప్పి ప్రాణం వదిలేసాడు. ఇంజనీరు యిద్దరి వంకా ఎవరినీ చేత్తో చూపించలేదు. ఇంజనీరు కాకుండా రూములో ఉన్నది యిద్దరే. డాక్టరూ, వ్యాపారవేత్త. అయినా పోలీసులు వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యాపారవేత్తని అరెస్ట్ చేసేసారు.
పోలీసులు అంత ఖచ్చితంగా వ్యాపారవేత్తనే ఎందుకు అరెస్ట్ చేసారు? డాక్టరుని ఎందుకు అరెస్ట్ చేయలేదు?"

Tuesday, 15 July 2014
అసలే నా యింటి అడ్రసు దొరక్క చస్తుంటే నీ గోలేంటెహె
మీరు ఓ అడ్రసు కోసం తెలియని ప్రదేశానికెళ్ళరనుకోండి. అక్కడ ఎవరినైనా మీరు చెప్పిన అడ్రసు గురించి వాకబు చేయండి. అందులో కొంత మంది అడ్రసు గురించి అడగ్గానే వెంటనే "ఈ అడ్రసా? ఏ ఏరియా అని చెప్పారు? ఏ సందని చెప్పారు? యిలాంటి ప్రశ్నలు వేసి మిమ్మల్ని ఇంటరాగేట్ చేస్తారు. వారు అలాంటి ప్రశ్నలు వేస్తున్నారంటే దానర్ధం వారికి ఆ అడ్రసు గురించి ఏ మాత్రం తెలియదని. కానీ వారు ఆ విషయం అస్సలు ఒప్పుకోరు. 'తెలియదు ' అని ఎంత మాత్రం చెప్పరు సరి కదా 'ఇలా తిన్నగా వెళ్ళి ఆ లెఫ్ట్ కి వెళ్ళండి.'... అని చెపుతారు. వారు చెప్పింది నమ్మి ఆ రూటులో వెళ్ళారంటే అంతే సంగతులు. మీ టైమంతా వృధా చేసుకున్నట్లే. "తెలియదు" అనే చిన్న మాట చెప్పటానికి వచ్చిన తంటాలు యివి.
అందులోనే ఆనందముందేమో మరి !
మనల్ని
మోసగించేవాడిని లేదా
మోసగించాలనుకున్నవాడినైనా
నమ్ముతాము గానీ మనల్ని "మోసగాడు"
అని భావించేవాడిని
మాత్రం జీవితం లో నమ్మము -
దగ్గరికి చేరనివ్వము.
అదేంటో మరి !
Sunday, 13 July 2014
అరిస్తే పోతుందా భయం ?
హర్రర్ సినిమాకి వెళ్ళారు కదా? గమనించండి సినిమా చూస్తున్న జనల్లో చాలా మంది హర్రర్ సీను మొదలవడానికి ముందు గట్టి గట్టిగా అరుస్తుంటారు. అవి విని మిగతా వాళ్ళు గట్టిగా నవ్వుతుంటారు. అదంతా కామెడీ చేయడానికి అనుకుంటున్నారా? కానే కాదు. వారు లోలోపల చాలా భయపడుతుంటారు. తమ భయాన్ని పోగొట్టుకోవడానికి ఆ విధంగా అరుస్తుంటారన్న మాట. ఈ సారి వెళ్ళినప్పుడు గమనించండి.
Tuesday, 20 May 2014
'దిల్' లేని 'దిల్ రాజు'
కొంతమంది సినిమా నటులు, దర్శకులు, పాటల రచయితలు, నిర్మాతల పేర్లు గమనించండి. వారు నటించిన లేదా నిర్మించిన సినిమా పేరుతో కలిపి ఉంటాయి వారి పేర్లు. ఉదాహరణకి 'షావుకారు జానకి ', 'సిరివెన్నెల సీతా రామశాస్త్రి", కళ్ళు చిదంబరం, 'శుభలేఖ సుధాకర్ ', మహర్షి రాఘవ ', 'దిల్ రాజు ', 'అల్లరి నరేష్', 'వెన్నిరాడై నిర్మల ', 'నిళళ్గల్ రవి ', యిలా చెప్పుకుంటూ పోతే చాలా మంది లిస్టు తయారవుతుంది. యిదంతా మీకు తెలిసిన విషయమే. చెప్పుకోవలసిన విషయమేమిటంటే 'దిల్ రాజు ' ని అందరూ పిలిచినట్టు ఆయన అసలు పేరు 'రాజు' కాదు - 'వెంకట రమణా రెడ్డి'. 'రాజు ' అన్నది ఆయన ముద్దు పేరు మాత్రమే. 'దిల్' ఆయన తీసిన మొదటి సినిమా. ఆ సినిమా హిట్ అయ్యాక అందరూ ఆయన్ని 'దిల్ రాజు ' అని పిలవడం మొదలు పెట్టారు. బానే ఉంది. కానీ ఆయన తన సినిమాల్లో తన పేరుని 'రాజు' అని మాత్రమే వేసుకుంటాడు. 'దిల్ ' ని ఎక్కడా తన పేరు ముందు చేర్చడు. అయినా సరే అందరూ ఆయన్ని 'దిల్ రాజు' అనే పిలుస్తారు.
Thursday, 1 May 2014
ఎందుకో మరి !
అదేంటో తెలీదు గానీ చాలామంది సినిమాలు చూస్తారు గానీ ఆ సినిమాల్లో ఏదైనా సన్నివేశం గుర్తొచ్చినప్పుడు దాని గురించి చెప్పాలంటే 'అదేదో సినిమాలో ఫలానా హీరో అలా అన్నాడనో లేక ఫలానా కమెడియను అలా చేసాడనో చెపుతారు తప్ప సినిమా పేరు మాత్రం చెప్పరు. ఈ మధ్యే రిలీజైన సినిమా అయినా సరే. ఎందుకో తెలీదు మరి !
Wednesday, 23 April 2014
నా సీటు నాకే సొంతం
మీరు క్రొత్తగా రిలీజైన సినిమాకి వెళితే టిక్కెట్లు అయిపొయాయా? హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టేసారా? మీరు గానీ అదే సినిమా చూడాలంటే యింకో షోకి టికెట్లయినా సంపాదించాలి లేదా అదే షో కి బ్లాకులో కొనుక్కునయినా చూడాలి. అంతే గానీ ఉన్న టిక్కెట్ల కన్నా ఒక్క టిక్కెట్టు కూడా ఎక్కువ అమ్మరు గాక అమ్మరు. మీరు నించొని చూస్తానన్నా లేదా ఓ ప్రక్కన నుంచొని చూస్తానన్నా అస్సలు అప్పుకోరు గాక ఒప్పుకోరు.
అంటే దానర్ధమేంటి? మీరు టికెట్టుకు సరిపడిన డబ్బు చెల్లించినా అదనపు సీట్లు ఆ హాలులో లేవు కాబట్టి మిమ్మల్ని లోపలికి అనుమతించడం లేదు. మీరు నించొని చూస్తానన్నా అంగీకరించడం లేదు. అంటే మీరు చెల్లించిన డబ్బుకి పూర్తి న్యాయం జరుగుతోందన్నట్టే కదా?

Thursday, 20 March 2014
చేతిలో చెయ్యేసి లగెత్తు రాధా !
హీరోయిన్ని విలన్ బారి నుండి రక్షించడానికొచ్చిన హీరో వెంటనే ఆమె చేయి పట్టుకొని పరిగెడతాడు - అక్కిడికేదో ఆమెకి పరిగెట్టడం రాదన్నట్టుగా. నిజ జీవితంలో అలా ఇంకొకరి చేయి పట్టుకొని పరిగెట్టడం ఎంత కష్టమో కదా.
ఏ సినిమా చూసినా అదే వరస.
ఏ సినిమా చూసినా అదే వరస.
Monday, 10 March 2014
మీరు చేస్తే పైరసీ మేము చేస్తే పాలసీ
పైరసీ. మన సినిమా వాళ్ళు ఈ పదం వినగానే ఉలిక్కిపడతారు.
'పైరసీని నిరోధించండి.'
'పైరసీ బారినుండి పరిశ్రమని రక్షించండి.'
'పైరసీ సీడీలని చూడకండి.'
'థియేటరుకొచ్చి సినిమా చూడండి.'
తరచుగా సినిమా హీరోలు, నిర్మాతలు, దర్శకులు మనకు నీతులు చెపుతుంటారు. నిజమే. పైరసీని ప్రోత్సాహించకూడదు. దానిని ఎవరూ తప్పు పట్టరు. కానీ యిది కేవలం ప్రేక్షకులకే వర్తిస్తుందా? హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు వర్తించవా? వేరే భాష నుండి సినిమా కాపీ కొట్టి సినిమా తీయొచ్చా? అందులో మనకు నీతులు చెప్పే సదరు హీరోలు నటించొచ్చా? దాన్ని పైరసీ అనరా? సరే ఆ విషయం ప్రక్కన పెడితే పైరసీ గురించి అరిచి గగ్గోలు పెట్టే మన సినిమా వాళ్ళు సినిమా హాలు బయట జరిగే 'బ్లాకు మార్కెట్' గురించి మాట్లాడరేం? బ్లాకు లో టికెట్టు కొని సినిమా చూడొద్దని ఎవడూ చెప్పడేం? కనీసం అది నేరమనే విషయం కూడా చెప్పరేం? అంటే జనాల సొమ్ము లూటీ అయినా ఫర్లేదా? తమ సొమ్ము పోతోందని మనకు తెగ నీతులు చెప్పే వాళ్ళు మన సొమ్ము గురించి కూడా మాట్లాడాలిగా? మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ జేబులు నిండితే చాలు.

హీరోతో కాక విలన్ తో చిందులేస్తుందా మరి?
హీరో హీరోయిన్ ని టీజ్ చేస్తూ ఓ పాట పాడతాడు. హీరోయిన్ హీరో మీద చిర్రుబుర్రులాడుతుంటుంది. కానీ హీరో ఎలా చేయిపిస్తే అలా స్టెప్పులేస్తూ అతనికి పూర్తి సహకారం అందిస్తుంటుంది డాన్సుల్లో- మన తెలుగు సినిమాలో.
Friday, 7 March 2014
మరి ఏడుస్తున్నట్టు చూపించమంటావా?....
మన తెలుగు సినిమాలని గమనించండి. సినిమా మొదలైన కాసేపటికి హీరోయిన్ ఇంట్రడక్షను సీనులో హీరోయిన్ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఆ చుట్టు ప్రక్కల ఎవరూ లేకపోయినా కూడా. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే - కారులో వంటరిగా వెళుతున్నా, చివరికి ఎడారిలో నడిచొస్తున్నా సరే.
ఫాదరంటే చర్చి ఫాదరు కాదండోయ్.....
ఎందుకో తెలీదు గానీ తెలుగు ప్రేక్షకులు 'యాంటీ ఫాదర్ సెంటిమెంటుతో కూడిన సినిమాలను ఆదరించరు. కావాలంటే గమనించండి తెలుగులో వచ్చిన 'ధర్మచక్రం (వెంకటేష్), యమధర్మరాజు M.A (మోహన్ బాబు), మున్నా (ప్రభాస్), బ్రదర్స్ (సూర్య), ఓం 3D ( కళ్యాణ్ రామ్ ) యివేవీ సరిగ్గా ఆడలేదు. అదే ఫాదర్ సెంటిమెంటు తో వచ్చిన సినిమాలు మాత్రం అన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
Monday, 17 February 2014
ఎటెల్లిపోనాడు ?
సందేలకి సంతకెళ్ళి వొంజరమట్టుకొత్తానని
ఎల్లిన సచ్చినోడేటైపోనాడు
సుక్కేసుకొని ఏ రంకులాడి కాడికైనా పోనాడా
లేకేతోవలోనైనా ఒగ్గేసినాడా
ఓలమ్మో ఏటీ సచ్చినోడి పైత్తకం
మాపటేల కట్టుకోమని తెల్ల సీర సూపి
మల్లెపూలెట్టుకోమని మురిపించి
అగరెత్తులంటీమని సెవిలో సెప్పి
ఏటైపోనాడీడు మరెటెల్లిపోనాడీడు
ఎల్లిన సచ్చినోడేటైపోనాడు
సుక్కేసుకొని ఏ రంకులాడి కాడికైనా పోనాడా
లేకేతోవలోనైనా ఒగ్గేసినాడా
ఓలమ్మో ఏటీ సచ్చినోడి పైత్తకం
మాపటేల కట్టుకోమని తెల్ల సీర సూపి
మల్లెపూలెట్టుకోమని మురిపించి
అగరెత్తులంటీమని సెవిలో సెప్పి
ఏటైపోనాడీడు మరెటెల్లిపోనాడీడు
Thursday, 6 February 2014
అనుకోలేదు
అనుకోలేదు నువ్వు దూరమవుతావని
అయినా తగ్గలేదు యిసుమంతైనా నీమీద ప్రేమ
అనుకోలేదు నీ రూపం కనుమరుగవుతుందని
అయినా పోలేదు నీమీద నాకు ఉన్న యిష్టం
అనుకోలేదు యింత ఎడబాటు ఉంటుందని
అయినా చావలేదు నీమీద మమకారం
అనుకోలేదు నీ నవ్వులు ఇక కానరావని
అయినా తొలగిపోలేదు నీమీద నా ఆశలు
అనుకోలేదు నీ మాటలు మూగబోతాయని
అయినా వదల్లేదు నీమీద నాకున్న పిచ్చి
అనుకోలేదు నీవిక కనబడవని
అయినా రాలేదు నీమీద తిరస్కారభావం
అనుకోలేదు నువ్వు నన్ను మర్చిపోతావని
అయినా ఇనుమడించలేదు నీమీద గౌరవం
అనుకోలేదు యింత నిర్దయ చూపుతావని
అయినా చేరలేదు నీకోసం ఎదురు చూడటంలో అలసత్వం

Wednesday, 29 January 2014
నాన్నా వీడు చూడు నిన్నేమంటున్నాడో?!
యిది చదివిన తరువాత మీకు కొంచెం బాధగా ఉండొచ్చు కానీ నేను చెప్పబోయే విషయం మాత్రం కఠోర వాస్తవం. యింతకీ విషయమేమిటంటే మీరు ఎప్పుడైనా మీ పిల్లలలతో ఎవరైనా తెలిసిన వాళ్ళ యింటికి వెళ్ళడం గానీ లేదా వాళ్ళు మీ యింటికి గానీ రావడం జరిగితే అక్కడ మీకొక సీన్ ఎదురవుతుంది. ఆ సదరు తెలిసిన వాళ్ళు (స్నేహితుడు కావచ్చు బంధువు కావొచ్చు) మీ పిల్లలతో చాలా సరదాగా ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు. మరీ చిన్న పిల్లలైతే 'ఓంటమ్మా నీ పేరేంటమ్మా? ఆం తిన్నావా? లాల తాగావా? ఆచ్చెల్లావా?" లాంటి ప్రశ్నలు వేసి వాళ్ళతో చక్కగా గడుపుతారు. అదే కొంచెం పెద్ద పిల్లలతో అయితే " ఏమ్మా ఏం చదువుతున్నావు? మీ స్కూల్ పేరెంటి? బాగా చదవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలి. మీ డాడీని చూడు ఎంత కష్టపడుతున్నారో మీ కోసం. ఆయనకి మంచి పేరు తీసుకు రావాలి." యిలాంటి మాటలతో చాలా తీయగా మాట్లాడతారు. పిల్లలతో పాటు మిమ్మల్నీ తెగ సంతోషపెడతారు, మంచి సోపేస్తారు.
Tuesday, 28 January 2014
ఇంట్లో యింకో రకం టిఫిన్ తయారు చేయరుగా మరి?
ఏదైనా టిఫిన్ హోటల్ కి వెళ్ళండి. అక్కడ జనాలని గమనించండి. వారిలో ఏ ఒక్కరూ ఒక సారి తిన్న టిఫిన్ ని మళ్ళీ తినరు చూడండి. అంటే ఓ ప్లేట్ ఇడ్లీయో పూరీయో తిన్నవాడు అవి ఎంత బాగున్నా రెండో ప్లేట్ మాత్రం తినడు. వేరే రకం టిఫిన్ తింటాడు. కేవలం ఇంట్లో మాత్రమే తిన్నవే ఇంకా తింటాడు.
Monday, 27 January 2014
చిన్న సినిమాని బ్రతికించడం ఎలా?
ఈ క్రింద పేర్కొన్న ఐడియాలనుకోండి,
సూచనలనుకోండి సమాజానికి ఉపయోగపడతాయని నేను భావించి వ్రాస్తున్నవి. వీటిలో కొన్ని సిల్లీ గానూ, హాస్యాస్పదంగా అనిపిచ్చుండొచ్చు.
మీలో కొంత మందికి వీటికంటే యింకా మంచి ఐడియాలు కలిగివుండవచ్చు. కానీ వీటిమీద మీ అభిప్రాయాలను
నాతో తప్పకుండా పంచుకుంటారు కదూ.
"చిన్న సినిమాని బ్రతికించండి"
"చిన్న సినిమా మనుగడకు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి"
"చిన్న సినిమాకు రాష్ట్రంలో థియేటర్లు దొరకడం లేదు."
తరచుగా చిన్న సినిమా నిర్మాతల నుండి మనకు వినిపించే మాటలు. నిజమే. చిన్న సినిమాకు థియేటర్లు దొరకడం లేదు. దొరికినా అరకొర వసతులుండే థియేటర్లు మాత్రమే దొరుకుతున్నాయి. కారణం ఉన్న మంచి థియేటర్లు అన్నీ పెద్ద సినిమాలకే (???) కేటాయించేస్తున్నారు. అవి ఆడినంత కాలం వేరే సినిమాలకి అంటే చిన్న సినిమాలకి రిలీజ్ చేసే పరిస్థితి ఉండడంలేదు. మరి దీన్ని ఎలా అధిగమించాలి? వస్తున్నా. చాలా కాలం క్రితం అంటే ఓ యిరవై ఏళ్ళ క్రితం ఒక థియేటరులో 4 ఆటలుంటే 3 ఆటలు మెయిన్ సినిమా వేసేవారు - మార్నింగ్ షో మాత్రం వేరే సినిమా వేసేవారు. దాన్నే కొంచెం అటూ యిటూ మార్చి ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్లలో రెండు ఆటలు ఒక సినిమాని, రెండు ఆటలు యింకో సినిమాని ఆడిస్తున్నారు. మామూలు థియేటర్లకి కూడా యిదే పద్ధతి లో సినిమాలని ఆడిస్తే బాగుంటుంది కదా. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే 3 ఆటలో లేక రెండు ఆటలో పెద్ద సినిమా ని ఆడించి ఒకటో లేక రెండో ఆటలు చిన్నసినిమాకి కేటాయిస్తే బాగుంటుంది కదా? దాని వల్ల చిన్న సినిమా కూడా మంచి థియేటర్లో ప్రదర్శనకి నోచుకుంటుంది కదా?
Friday, 24 January 2014
ఏం చేస్తాం ! మా కాళ్ళు ఆ విధంగా డిజైన్ చేయబడ్డాయి మరి !
బస్ స్టాపుల్లోనూ రైల్వే స్టేషనులోనూ గంటలు గంటలు నించొని వాటి కోసం అత్యంత ఓపిగ్గా నించొని (కూర్చునే అవకాశమున్నా సరే) నిరీక్షించే జనం బస్సు లేదా రైలు ఎక్కిన తర్వాత మాత్రం సీటు కోసం తెగ హైరానా పడిపోతారు (పదిహేను నిమిషాల ప్రయాణం అయినా సరే)
Tuesday, 21 January 2014
లాభ నష్టాలు
క్రొత్తగా వ్యాపారము చేయాలనుకొనేవాడు ముందుగా చూడాల్సింది అందులో రాబోయే లాభాలను గురించి కాదు - అందులో రాబోయే నష్టాల గురించీ, వాటిని ఎంత వరకు తాను భరించగలిగే సామర్ధ్యమున్నదో అని. ఆ అప్రమత్తత ఉన్నవాడికి లాభాలు వాటంతట అవే వస్తాయి.
Sunday, 12 January 2014
బెబ్బే
మనిషి తన మేధస్సుతో ఎంతో పురోగతి సాధించినా కొన్ని విషయాల్లో మాత్రం యిప్పటికీ పైచేయి సాధించలేకపోయాడు. అందులో మచ్చుకి కొన్ని :
1. ఉప్పు నీటిని మామూలు నీటిగా మార్చలేకపోవడం
2. ఉప్పు వలన, నూనె వలన అనారోగ్య సమస్యలుంటాయని రుజువైనా దానికి ప్రత్యామ్నయము
సృష్టించలేకపోవడం.
3. పెట్రోల్ కి ప్రత్యామ్నయము సృష్టించలేకపోవడం.
1. ఉప్పు నీటిని మామూలు నీటిగా మార్చలేకపోవడం
2. ఉప్పు వలన, నూనె వలన అనారోగ్య సమస్యలుంటాయని రుజువైనా దానికి ప్రత్యామ్నయము
సృష్టించలేకపోవడం.
3. పెట్రోల్ కి ప్రత్యామ్నయము సృష్టించలేకపోవడం.
Sunday, 5 January 2014
సతీ సావిత్రి
'మంచు కొండల్లోన చంద్రమా
చందనాలు చల్లిపో.....'
ఎఫ్ ఎం లో m.m.శ్రీలేఖ పాడిన పాట వస్తోంది. అప్పుడు సమయం ఉదయం ఆరు గంటలు. చిన్నగా హం చేస్తూ స్టౌ మీద కాఫీ పెడుతోంది సావిత్రి. అది తనకెంతో యిష్టమైన పాట. తన భర్త శేఖర్ ఓసారి అన్నాడు 'ఇష్టమైన పాటల్ని అలా కూనిరాగాలు తీసే బదులు సిస్టం లో కాపీ చేసుకోవచ్చు కదా? నీకిష్టమైనప్పుడు వినొచ్చు ' అని.
తను ఒప్పుకోలేదు.
ఏo? ఎందుకు అని అడిగాడు.
'మనకిష్టమైన పాటలు యింట్లోనే ఉంటే ఎప్పుడుబడితే అప్పుడు వినేస్తాం. కొన్నాళ్ళకి బోర్ కొట్టేస్తాయి. యిలా అప్పుడప్పుడు వింటేనే వాటికి విలువ' అంది.
శేఖర్ కి మతి పోయింది ఈ లాజిక్కి. వెంటనే అడిగాడు
'మరి నేను?'
సావిత్రికి అతనేం అడుగుతున్నాడో అర్ధం కాక
'మీరేంటి?'
'నేను యిన్నాళ్ళ నుండి నీతోనే ఉన్నాను కదా? మరి నేను కూడా బోర్ కొట్టేసానా?'
ఒక్క క్షణం శేఖర్ ని చూసి 'నేను చెప్పేది నాకిష్టమిన వాటి గురించి బాస్!' అంది కన్ను కొట్టి.
ఆమె చెప్పింది అర్ధమయ్యేటప్పటికి శేఖర్ కి కొద్ది సమయం పట్టింది. 'ఏయ్ నిన్నూ...... ' అంటూ ఆమె చెవి మెలి తిప్పాడు.'
సావిత్రికి నవ్వుకొంది అది గుర్తొచ్చి.
కాఫీని రెండు కప్పుల్లో పోసి బెడ్ రూం కి వెళ్ళింది. పిల్లలిద్దరూ శేఖర్ కి చెరో వైపున పడుకొనున్నారు. యిద్దరూ శేఖర్ మీద కాళ్ళు వేసుకొని ఉన్నారు. సావిత్రికి ఆ దృశ్యం ఎంతో అపురూపంగా అనిపించింది. యిప్పుడే కాదు ఎన్ని సార్లు చూసినా అలాగే అనిపిస్తుంది.
'ఏమండీ...'
'ఊ' అన్నాడు శేఖర్. అన్నాడే గానీ లేవలేదు.
'ఏమండోయ్' మళ్ళీ లేపింది.
'ఊ.... ఏంటి? అడిగాడు శేఖర్.
'లేవండి కాఫీ తాగండి.'
'కాసేపున్నాక తాగుతాను. పడుకోనీ......' పడుకొనే చెప్పాడు శేఖర్.
'ప్రయాణం ఉంది మర్చిపోయారా?'
వెంటనే లేచి కూర్చున్నాడు. రెండు నిమిషాల్లో కాఫీ తాగేసి బాత్రూం కి వెల్లిపోయాడు శేఖర్.
వాళ్ళిద్దరికీ పెళ్ళయి ఏడేళ్ళవుతోంది. వారిద్దరికీ యిద్దరు పిల్లలు. ఒకమ్మాయి ఒకబ్బాయి. పాపకి ఐదేళ్ళు బాబుకి రెండేళ్ళు. అతనో ప్రభుత్యోద్యోగి. జీతం తో పాటు 'గీతం' కూడా తోడయ్యి వాళ్ళ జీవితం బానే గడిచిపోతోంది మధ్యతరగతికి కాస్త పైనే. ఒక వారం రోజులు ఆఫీసు పని మీద ఉత్తరాఖండ్ వెళుతున్నాడు. పుణ్య క్షేత్రాలు ఉంటాయి కదాని ఫ్యామిలీ ని కూడా తీసుకెల్దామనుకున్నాడు కానీ పాపకి పరీక్షలు ఉండటంతో తానొక్కడే వెళ్ళక తప్పడం లేదు. పదకొండు గంటలకి ట్రైను. అతని ప్రయాణానికి కావల్సినవన్నీ ఏర్పాటు చేసింది. అతనికి సెండాఫివ్వటానికి పిల్లలతో సహా బయల్దేరింది సావిత్రి.

Friday, 3 January 2014
మా'స్టారు'
అదొక గవర్నమెంటు మున్సిపల్ స్కూల్. పేరుకు రాజమండ్రిలోనే ఉంది కానీ ఉంది కానీ లోపలికి వెళితే ఒక రకమైన పళ్ళెటూరి వాతావరణం కనిపిస్తుంది. నిజానికి ఆ స్కూలే కాదు దాదాపు అన్ని మునిసిపల్ స్కూళ్ళలోనూ అదే విధమైన పరిస్థితి ఉంటుంది . ప్రైవేటు స్కూళ్ళకీ ఈ స్కూళ్ళకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళకి లేని స్వేచ్చ ఈ స్కూళ్ళో చదివే వారికి బాగా ఉంటుంది. అలా అని ఈ స్కూళ్ళో చదివే వారుండరనీ కాదు, క్రమశిక్షణ ఉండదనీ అసలే కాదు. గొప్ప గొప్ప వాళ్ళంతా యిలాంటి స్కూళ్ళో చదివిన వారే. కొన్నేళ్ళ క్రితం ప్రైవేట్ స్కూళ్ళు ప్రభంజనం లేనపుడు ఈ మునిసిపల్ స్కూళ్ళే రాజ్యమేలాయి. పేదా గొప్ప అనే భేదం లేదుండా అందరి పిల్లలు ఇక్కడే చదివేవారు. క్రమేణా ప్రైవేటు స్కూళ్ళ హడావిడి పెరిగాక వీటి ప్రాబల్యం తగ్గిపోయి డబ్బున్నోళ్ళంతా తమ పిల్లల్ని వాటిలో చేర్చేసారు. ఫలితం- మున్సిపల్ స్కూళ్ళు కేవలం పేదవారి బడిగా మిగిలిపోయింది. అరకొర వసతులతో అలాగే నెట్టుకోస్తున్నారు అక్కడి మాస్టార్లు.
అది పదో గరగతి A సెక్షన్. పిల్లలంతా ఓ వ్యక్తి కోసం ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ వ్యక్తి కొత్తగా రాబోయే లెక్కల మాస్టారు. పేరు 'శంకర నారాయణ'. యింతకు ముందు లెక్కల మాస్టారిగా పని చేసిన భాస్కర రావు మాస్టారికి వేరే ఊరికి ట్రాన్స్ ఫర్ అవటంతో కొత్త మాస్టారు వచ్చారు. తెల్లగా ఎత్తుగా ఆకట్టుకొనే రూపంతో ఉన్నారు 'శంకర నారాయణ' మాస్టారు.

Wednesday, 1 January 2014
2014 నూతన సంవత్సర శుభాకాంక్షలు
పాఠక దేవుళ్ళకి మరియు మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నూతన సంవత్సర
శుభాకాంక్షలు.
గత సంవత్సరము సెప్టెంబరులో మొదలు పెట్టిన నా బ్లాగు మీ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళ్ళిపోతోంది. మీ ఆదరణ, అభిమానము ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ.............
మీ
వరప్రసాద్ దాసరి.
గత సంవత్సరము సెప్టెంబరులో మొదలు పెట్టిన నా బ్లాగు మీ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళ్ళిపోతోంది. మీ ఆదరణ, అభిమానము ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ.............
మీ
వరప్రసాద్ దాసరి.
Subscribe to:
Posts (Atom)